bcc commission
-
బీసీల్లో కొత్తగా కులాల చేర్పు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లో మరిన్ని కులాల చేర్పు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న కులాల చేర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటివరకు ఎలాంటి కేటగిరీలో లేని సంచార జాతులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ఉంది. ఏడాది క్రితం బీసీ కమిషన్‌కు 25 కులాల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. వాటి చేరికపై బీసీ కమిషన్ పలు సూచనలు సైతం చేసింది. బీసీల్లో ఆ కులాల చేర్పుపై కేంద్రంసలహా తీసుకోవాలని రాష్ట్ర యంత్రాంగం భావించి లేఖ రాసింది. బీసీల్లో ఆయా కులాల చేర్పు నిర్ణయాధికారం రాష్ట్రానికే ఉందంటూ సూచించడంతో ఫైలు కాస్త సీఎం వద్దకు చేరింది. అసెంబ్లీ రద్దు కావడంతో సీఎం కొత్తగా నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా పోయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి రావడంతో సీఎం కార్యాలయం బీసీ కులాల చేర్పునకు సంబంధించిన ఫైలును వెనక్కి పంపినట్లు సమాచారం. దీనిపై కొత్త ప్రభుత్వంలోనే స్పష్టత వస్తుందని ఓ అధికారి చెప్పారు. -
త్వరలో బీసీ కమిషన్‌కు హోదా
► కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా లభిస్తుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా బిల్లు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ బుధవారం దత్తాత్రేయను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఓబీసీ కమిషన్ బిల్లుకు రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుతగలకపోతే ఎప్పుడో ఆమోదం పొందేదన్నారు. సవరణల పేరుతో లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో విపక్ష పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందుతుందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లట్ తనకు స్పష్టం చేశారని దత్తాత్రేయ తెలిపారు. బీసీల అభ్యున్నతికి దత్తాత్రేయ తీసుకుంటున్న చొరవకు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.