BCCI CEO Rahul Johri
-
'వర్షాకాలం తర్వాతే క్రికెట్ మొదలవ్వొచ్చు'
ముంబై : వర్షాకాలం తర్వాతే దేశంలో మళ్లీ క్రికెట్ టోర్నీలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2020)ను కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. కోవిడ్-19 ఆంక్షల వల్ల క్రికెట్ టోర్నీలు అన్నీ రద్దు అయిన విషయం తెలిసిందే. ముంబైలో నిర్వహించిన వెబినార్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ భద్రతను కోరుకుంటారని, వారిని గౌరవించాలని అన్నారు. క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ అంశంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించనున్నట్లు ఆయన తెలిపారు. (సచిన్ నిమ్మకాయలు ఇవ్వవా: భజ్జీ) 'వర్షాకాలం ముగిసాకే క్రికెట్ అధికారికంగా ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మన దగ్గర వర్షాకాలం ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్కప్ వాయిదా పడితే, అప్పుడు అక్టోబర్ లేదా నవంబర్లో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు ఉంటాయి. అయితే ఐపీఎల్లో ఆడేందుకు అంతర్జాతీయ ప్లేయర్లు వస్తుంటారని, వారికి 14 రోజుల క్వారెంటైన్ అవసరం ఉంటుందని, అలాంటి సందర్భంలో ఐపీఎల్ మ్యాచ్లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించే కష్టమే' అంటూ పేర్కొన్నాడు. అంతేగాక దేశవాలి సీజన్లో అక్టోబర్ నుంచి మే వరకు దాదాపు 2వేల మ్యాచ్లు జరగాల్సి ఉందని, వీటిని నిర్వహించడం బీసీసీఐకి ఒక చాలెంజ్లా మారే అవకావం ఉన్నట్లు జోహ్రి తెలిపారు. (లాక్డౌన్: విరుష్కల మరో వీడియో వైరల్) -
జోహ్రిపై విచారణకు కమిటీ
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సీఓఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి రాకేశ్ శర్మ, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ శర్మ, ఢిల్లీ మహిళా హక్కుల సంఘం మాజీ చైర్పర్సన్ బర్ఖాసింగ్ ఇందులో ఉన్నారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. -
లిఖితపూర్వక హామీ తీసుకోండి
బీసీసీఐ సీఈఓను కోరిన లోధా కమిటీ న్యూఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్లకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని రాష్ట్ర సంఘాల నుంచి లిఖితపూర్వక హామీ తేవాలని లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రిని ఆదేశించింది. అనర్హత వేటుతో పదవిని కోల్పోనున్న ఆయా సంఘాల ప్రతినిధులు మ్యాచ్ల నిర్వహణకు, నూతన కార్యవర్గానికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోమని హామీ పత్రాన్ని తేవాలని లోధా కమిటీ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ సభ్యులు ఆర్.ఎం.లోధా, జస్టిస్ అశోక్ భాన్, ఆర్.వి.రవీంద్రన్ బుధవారమిక్కడ సమావేశమై బీసీసీఐ సీఈఓకు ఈ మేరకు హామీ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం, రాజస్తాన్ క్రికెట్ సంఘం వ్యవహారాల్లో కల్పించుకోబోమని లోధా కమిటీ చెప్పింది. క్రికెట్ బాగు కోసం ఈ కమిటీ తెచ్చిన సంస్కరణలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రికి చెప్పింది.