BCCI SGM
-
మే 27న బీసీసీఐ కీలక సమావేశం.. వన్డే ప్రపంచకప్‌పై చర్చలు!
న్యూఢిల్లీ: కీలక అంశాలే అజెండాగా ఈ నెల 27న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ మీటింగ్‌లో ప్రధానంగా ఐదు అంశాలపై బోర్డు చర్చించనుంది. వర్కింగ్ గ్రూప్: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ కోసం వర్కింగ్ గ్రూప్ నియామకంపై ఎస్‌జీఎంలో కసరత్తు చేస్తారు. ఇందులో ఉండాల్సిన సభ్యులు, అప్పగించాల్సిన బాధ్యతలపై చర్చిస్తారు. డబ్ల్యూపీఎల్‌కు నిర్దిష్టమైన షెడ్యూల్: మహిళల లీగ్‌కు ఐపీఎల్‌లాగే క్రేజ్ పెంచేందుకు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు అందుబాటులో ఉండే వీలైన, మేలైన నిర్దిష్ట షెడ్యూల్‌పై దృష్టి సారిస్తారు. లైంగిక వేధింపుల నిరోధక కమిటీ: అప్పట్లో బోర్డు మాజీ సీఈఓ రాహుల్ జోహ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచి్చనపుడు కమిటీ వేసి నిగ్గుతేల్చారు. అయితే ఇప్పుడు బోర్డులో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర జట్లకు ఫిజియోలు: దేశవాళీ ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం రాష్ట్ర జట్లకు నాణ్యమైన ఫిజియోలను, ట్రెయినర్లను నియమించాలని ఇందుకోసం ఎన్సీఏ సరి్టఫైడ్ సిబ్బందిని తీసుకోనుంది. మౌలిక వసతులపై: మౌలిక వసతుల అభివృద్ధి, సబ్సిడీ సబ్–కమిటీల నియామకంపై ఎస్‌జీఎంలో చర్చించనున్నారు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్ -
లోధా సంస్కరణల అమలుకు కమిటీ
బీసీసీఐ ఎస్‌జీఎంలో నిర్ణయం ముంబై: లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలుపై కిందామీదా పడుతున్న బీసీసీఐ ఈ వ్యవహారాన్ని మరికొంత కాలం వాయిదా వేయాలని భావిస్తున్నట్టుంది. దీంట్లో భాగంగా బోర్డు ప్రక్షాళన కోసం ప్యానెల్ పేర్కొన్న ప్రతిపాదనలను ‘అత్యుత్తమంగా వేగంగా’ ఎలా అమలు చేయాలో సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం దాదాపు మూడు గంటల పాటు జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) ఏ విషయంలోనూ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ సమావేశానికి బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. ‘ఎనిమిది అంశాల అజెండాతో ఎస్జీఎం జరిగింది. లోధా ప్యానెల్ నివేదిక అమలు కోసం ఐదు లేక ఆరుగురితో కూడిన కమిటీని నేడు (మంగళవారం) ఎంపిక చేస్తాం. నూతన సంస్కరణలపై కోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తమంగా అమలు పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ 15 రోజుల్లోగా నివేదిక అందిస్తుంది. పరిపాలక కమిటీలోని సభ్యులు ఇందులో ఉండరు. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీటి అమలులో ఉన్న ఇబ్బందులను గుర్తించి సీఓఏకు తెలుపుతుంది’ అని కార్యదర్శి అమితాబ్ చౌదరి వివరించారు. ఒక రాష్ట్రం ఒక ఓటు, 70 ఏళ్ల గరిష్ట వయస్సు, మూడేళ్ల కూలింగ్ పీరియడ్ అమలుపై బోర్డు సభ్యుల్లో వ్యతిరేకత కనిపిస్తున్న విషయం విదితమే. మరోవైపు పాకిస్తాన్‌తో సిరీస్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇక భారత జట్టు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దేనని చౌదరి చెప్పారు. వచ్చేనెలలో జట్టు లంక పర్యటనకు వెళ్లకముందే కోచ్ ఎవరో తేలుతుందని ఆయన అన్నారు.