
న్యూఢిల్లీ: కీలక అంశాలే అజెండాగా ఈ నెల 27న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ మీటింగ్‌లో ప్రధానంగా ఐదు అంశాలపై బోర్డు చర్చించనుంది.
వర్కింగ్ గ్రూప్: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ కోసం వర్కింగ్ గ్రూప్ నియామకంపై ఎస్‌జీఎంలో కసరత్తు చేస్తారు. ఇందులో ఉండాల్సిన సభ్యులు, అప్పగించాల్సిన బాధ్యతలపై చర్చిస్తారు.
డబ్ల్యూపీఎల్‌కు నిర్దిష్టమైన షెడ్యూల్: మహిళల లీగ్‌కు ఐపీఎల్‌లాగే క్రేజ్ పెంచేందుకు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు అందుబాటులో ఉండే వీలైన, మేలైన నిర్దిష్ట షెడ్యూల్‌పై దృష్టి సారిస్తారు.
లైంగిక వేధింపుల నిరోధక కమిటీ: అప్పట్లో బోర్డు మాజీ సీఈఓ రాహుల్ జోహ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచి్చనపుడు కమిటీ వేసి నిగ్గుతేల్చారు. అయితే ఇప్పుడు బోర్డులో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర జట్లకు ఫిజియోలు: దేశవాళీ ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం రాష్ట్ర జట్లకు నాణ్యమైన ఫిజియోలను, ట్రెయినర్లను నియమించాలని ఇందుకోసం ఎన్‌సీఏ సరి్టఫైడ్ సిబ్బందిని తీసుకోనుంది.
మౌలిక వసతులపై: మౌలిక వసతుల అభివృద్ధి, సబ్సిడీ సబ్–కమిటీల నియామకంపై ఎస్‌జీఎంలో చర్చించనున్నారు.
చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్
Comments
Please login to add a commentAdd a comment