చురుకుగా బీచ్ కబడ్డీ శిక్షణ
బాపట్ల: అంతర్ జిల్లాల స్త్రీ, పురుషుల బీచ్కబడ్డీ పోటీల్లో పాల్గొనే టీంలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో కోచ్క్యాంపును బీచ్కబడ్డీ రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు తాతా బసవశంకరరావు ఆదివారం పరిశీలించారు. సామర్లకోటలో ఈనెల 6వ తేదీ నుంచి 9వతేదీ వరకు జరిగే 64వ అంతర జిల్లాల స్త్రీ, పురుషుల బీచ్ కబడ్డీలో గుంటూరు జిల్లాకు పతకం వచ్చే విధంగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. బాపట్ల ఏరియా వైద్యశాల పాలకవర్గం అధ్యక్షులు కర్పూరపు రామారావు, కబడ్డీ జిల్లా అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ఊసా రాంబాబు, జంపని శ్రీరామమూర్తి తదితరులు కోచ్క్యాంపును పరిశీలించిన వారిలో ఉన్నారు.