beagle
-
జూలియట్ మళ్లీ ఆడుకుంది!
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఏమిటీ సమస్య? ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్‌కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్‌ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్‌ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది. ఈ తరహాలో 80 శాతం మరణాలు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది. -
మంత్రిగారి కుక్కా.. మజాకా!
-
మంత్రిగారి కుక్కా.. మజాకా!
ఒకవైపు జైపూర్ నగరంలో జరిగిన సామూహిక అత్యాచారం, దోపిడీ కేసు విచారణలో తల మునకలై ఉన్న రాజస్థాన్ పోలీసులకు.. ఓ అర్జంటు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఆ కేసును పక్కన పెట్టి అంతా రోడ్ల మీద పడ్డారు. విషయం ఏమిటంటే, ఓ మంత్రిగారు పెంచుకుంటున్న మూడేళ్ల కుక్కపిల్ల తప్పిపోయింది. బీగిల్ జాతికి చెందిన చార్లీ అనే ఈ కుక్కపిల్ల శనివారం ఉదయం 7 గంటలకు తప్పిపోయింది. దాంతో సొడాలా పోలీసు స్టేషన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదుచేశారు. వెంటనే అక్కడి పోలీసులు ఇతర స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చి, దాన్ని 'వీలైనంత తొందరగా' కనిపెట్టాలని చెప్పారు. అది రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్‌కు చెందినదా కాదా అనే విషయాన్ని మాత్రం పోలీసులు బయట పెట్టడంలేదు. ఆదివారం అంతా పోలీసులు ఆ కుక్కపిల్ల కోసం వెతుకుతూనే ఉన్నారు. ''కుక్కపిల్లలు, ఇతర పెంపుడు జంతువులు పోయాయన్న ఫిర్యాదులు మాకు రోజూ వస్తూనే ఉంటాయి. అది మంత్రిదైతే ఏమవుతుంది? అది కనిపించగానే మేం దాని యజమానికి అప్పగించాలి'' అని ఇన్స్పెక్టర్ విద్యా ప్రకాష్ చెప్పారు. చార్లీ ఆచూకీ ఎవరైనా చెబితే వాళ్లకు రూ. 10 వేల బహుమతి ఇస్తామంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే.. సామూహిక అత్యాచారం, దోపిడీ లాంటి పెద్దకేసును వదిలేసి ఇలాంటి కేసును పట్టుకోవడంపై పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.