బస్టాండ్‌లో ఎలుగుబంటి హల్చల్
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ములకనూరులో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. సోమవారం ఉదయం ఓ ఎలుగుబంటి బస్టాండ్‌లోకి ప్రవేశించటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఎలుగు ఎక్కడ తమపై దాడి చేస్తోందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.