bearth
-
ఏమిటి! నా బెర్త్ ఇవ్వాలా?!
అదో రైలు బోగీ. ఏసీ స్లీపర్ కోచ్. అందులో ఓ పెద్దావిడ. ఆవిడ ముందు ఓ పెద్దాయన. ‘‘దయచేసి మీరు పక్క బెర్త్ తీసుకుంటారా? మా వాళ్లంతా ఇక్కడున్నారు. అది కూడా లోయర్ బెర్తేనండీ..’’ చాలా ఆÔ¶ గా, వినయంగా అడుగుతోందామె. నొసలు ముడి వేశాడాయన. ఏమిటీ, నా బెర్త్ మీకు ఇవ్వాలా? లేదు. నేను నాకు కేటాయించిన సీటులోనే కూర్చుంటాను. నాకు ఇచ్చిన, నాకు వచ్చిన బెర్త్ మీదనే పడుకుంటాను. మారే ప్రసక్తే లేదు’’ అన్నాడు కర్కశంగా, కచ్చితంగా. పాపం! ఆమె చిన్నబుచ్చుకుని వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే బోగీలో ఎక్కాడో కుర్రాడు. బక్కచిక్కిపోయిన వాడి వంటిమీద చిరుగులు పడ్డ చొక్కా, మాసికలు వేసిన లాగూ ఉన్నాయి. వాడు తన వెంట తెచ్చుకున్న ఒక చిన్న చీపురుతో బోగీని ఊడుస్తున్నాడు. ఈయన తిని పడేసిన వేరుసెనక్కాయ తొక్కలు, ఆయన పక్కన ఉన్నావిడ తిని పడేసిన కమలాతొక్కలు కూడా ఊడ్చి శుభ్రం చేశాడు. తర్వాత చేయి చాపి పొట్ట చూపిస్తూ అందరి ముందుకూ వెళుతూ, వీళ్లముందుకు కూడా వచ్చాడు. దయగల వాడికి తలా కాస్త చిల్లర విదిలిస్తున్నారు. పెద్దాయన మాత్రం వాడిని చీదరింపుగా చూసి, పక్కనున్న ఆవిడతో ‘‘వీళ్లు ఇంతేనండీ, ఎప్పటికీ మారరు. అసలు ఇలాంటి వాళ్ల వల్లే దేశం భ్రష్టుపట్టిపోతోంది. ఇలాంటి వాళ్లకి డబ్బులివ్వడమంటే బిచ్చగాళ్లని, దేశద్రోహులని పెంచి పోషించినట్లే...’’ అని అంటున్నాడు. ఆవిడ మరేనండీ అంటోంది. ఈయన మరికొద్దిగంటల్లో రైలు దిగిన తర్వాత ‘మారుతున్న మానవతా దృక్పథం... అంతరించిపోతున్న మానవ విలువలు’ అనే అంశంపై తాను ఇవ్వబోతున్న ఉపన్యాసపు ప్రతిని మరోసారి సరి చూసుకుంటున్నాడు! ఆవిడేమో ‘అనాథ పిల్లల బతుకులను బాగు చేయడం ఎలా’ అనే టాపిక్ మీద వ్యాసం తయారు చేయడంలో మునిగిపోయింది!! మనలో చాలామంది ఇంతే. ఆశయాలు ఉన్నతంగా ఉంటాయి. ఆచరణలో అవి శూన్యం అవుతాయి. – డి.వి.ఆర్. -
రైళ్లలో పగటి నిద్ర బంద్
► ఇక బెర్తుల్లో రాత్రి 10 నుంచి ► ఉదయం 6 వరకే పడుకోవాలి ► ప్రయాణికుల మధ్య తగాదాల నేపథ్యంలో నిద్రించే సమయం కుదించిన రైల్వే బోర్డు సాక్షి, హైదరాబాద్: ‘ఉదయం 11 గంటలు.. మిడిల్ బెర్త్ ప్రయాణికుడు పడుకునే ఉండటంతో లోయర్ బెర్త్‌లో కూర్చోడానికి కుదరలేదు.. అలా ఓ వైపు వంగి టీ తాగుతుంటే అది ఒలికి నా ఖరీదైన డ్రెస్ పాడైంది. ఆ నష్టానికి పరిహారం ఎవరిస్తారు’ అంటూ కాజీపేటకు చెందిన ప్రవీణ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుబ్బారావు.. ఢిల్లీకి హైదరాబాద్‌లో రైలెక్కాడు.. మిడిల్ బెర్త్ టికెట్.. భోజనం చేయటం, కాలకృత్యాలు తప్ప మిగతా సమయం పడకకే పరిమితమయ్యాడు.. దీంతో లోయర్ బెర్త్‌పై ఇతరులు కూర్చోడానికి కుదరలేదు.. వారు వారించినా పట్టించుకోలేదు.. ఇది కంపార్ట్మెంట్ వారికి చికాకుగా మారటంతో టీసీకి ఫిర్యాదు చేశారు. ఇది చాలా రైళ్లలో జరుగుతున్న తంతే.. రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో వేళాపాళా లేకుండా ప్రయాణికులు పడుకుంటుండటంతో లోయర్బెర్త్ను సీటింగ్‌కు వాడుకోవటం ఇబ్బందిగా మారుతోంది. దీనిపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొస్తుండటంతో స్పందించిన రైల్వే బోర్డు.. దాన్ని నియంత్రించేందుకు రిజర్వేషన్ బోగీల్లో పడుకునే వేళలను తాజాగా సవరించింది. ఇకపై రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించేవారు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకే నిద్రపోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మిగతా వేళల్లో మిడిల్ బెర్త్‌ను మడిచి లోయర్‌బెర్త్‌లో కూర్చోవటానికి వీలు కల్పించాలని.. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోనల్ కార్యాలయాలకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది. బోగీల్లోని టీసీలు ఈ బాధ్యతను పర్యవేక్షించాలని.. వీటిపై ఫిర్యాదులొస్తే వెంటనే స్పందించాలని పేర్కొంది. అలాగే వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులను ఈ నిబంధన నుంచి మినహాయించింది. వారి శారీరక సమస్యల దృష్ట్యా సాధారణ వేళల్లోనూ పడుకునేందుకు బెర్తులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. పాత సమయంలో గంట కోత.. నిజానికి పడుకునే సమయాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు బెర్తుల్లో పడుకోవచ్చని, ఆ తర్వాత సీటింగ్‌కు వీలుగా మార్చాలని సమయపాలన ఆదేశాలు బోర్డు జారీ చేసింది. కానీ అది ఎక్కడా అమలు జరగటం లేదు. అలాంటి సమయపాలన ఉందని చాలా మందికి తెలియదు. ఫిర్యాదు చేసినా టీసీలు పట్టించుకునేవారు కాదు. అదో సమస్యగా భావించలేదు. కానీ ఇంతకాలానికి బోర్డు దృష్టిసారించింది. పాత సమయాల్లో గంట కోతపెట్టడమే కాకుండా.. కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 10కి ముందు పడకేసినా.. 6 తర్వాత పడుకునే ఉన్నా.. బెర్త్‌లకు సంబంధించిన ఫిర్యాదులు సగటున 30 వరకు రికార్డవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులు రాకుండా.. కంపార్ట్మెంట్లలో గొడవ పడుతున్న సందర్భాలు కోకొల్లలు. సాధారణంగా లోయర్ బెర్త్‌లో ముగ్గురు కూర్చుంటారు. పడుకునే వేళకు ఇద్దరు మిడిల్, అప్పర్ బెర్తుల్లోకి చేరుకుంటారు. కానీ లోయర్ బెర్త్ ప్రయాణికులు తొందరగా పడకేస్తే మిగతా ఇద్దరు గత్యంతరం లేక పైబెర్తుల్లోకి చేరుకోవాల్సి వస్తోంది. ఇక సైడ్ బెర్తుల విషయానికొస్తే.. దిగువ బెర్త్ వారు మధ్యాహ్నము కూడా పడుకునే కిటీకీల్లోంచి బయటకు చూసుకుంటూ కాలక్షేపం చేస్తుండటంతో పై బెర్తు వారు పైనే కూర్చోవాల్సి వస్తోంది. కూర్చునే వెసలుబాటులేక టీ కూడా తాగలేకపోతున్నామని, భోజనం చేయలేక ఇబ్బంది పడుతున్నామంటూ వందల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. తాజాగా అన్ని జోన్లకు ఆదేశాలు అందటంతో వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. లోయర్, మిడిల్, సైడ్ లోయర్ బెర్తుల్లో రాత్రి 10కి ముందు పడకేసినా, ఉదయం 6 తర్వాత పడుకునే ఉన్నా టీసీలకు ఫిర్యాదు చేయొచ్చు. -
టిక్కెట్లు సరే..బోగీ ఏదీ?
–ఆదోనిలో రైలును ఆపి ఆందోళనకు దిగిన ప్రయాణికులు –పోలీసుల జోక్యంతో గంట ఆలస్యంగా గుంటకల్‌కు బయలు దేరిన నాంథేడ్ ఎక్స్‌ప్రెస్ ఆదోని/అర్బన్: రిజర్వేషన్ టిక్కెట్లు జారీ చేసిన రైల్వే అధికారులు సంబంధిత బోగీని మాత్రం నాంథేడ్ ఎక్స్‌ప్రెస్‌కు ఏర్పాటు చేయలేక పోయారు. దీంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమకు బెర్త్‌లు లేక ఆదోనిలో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదోని రైల్వే స్టేషనులో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. బాధిత ప్రయాణికుల సమాచారం మేరకు..నాంథేడ్ నుంచి బెంగళూరు నాంథేడ్ ఎక్స్‌ప్రెస్(నం.16593) శనివారం బయలు దేరింది. బెంగళూరు వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు చాలా మంది దాదాపు రెండు నెలల క్రితం నుంచి రిజర్వేషన్ చేసుకున్నారు. ఇందులో కొందరికి రైల్వే అధికారులు ఎస్6 బోగీలో బెర్త్‌లు రిజర్వు చేశారు. అయితే రైలుకు మాత్రం రైల్వే అధికారులు సంబంధిత బోగిని ఏర్పాటు చేయలేదు. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం మంత్రాలయానికి వచ్చిన భక్తులకు తిరుగు ప్రయాణంలో ఎస్6 బోగిలోనే అధికారులు బెర్తులు రిజర్వు చేశారు. దాదాపు 50 మంది ప్రయాణికులు తమ బోగీ కోసం మంత్రాలయం స్టేషనులో వెతికారు. అది దొరకక పోవడంతో రైలు కదిలే సమయంలో అందుబాటులో ఉన్న దానిలోనే ఎక్కేశారు. అయితే టీసీ టిక్కెట్లపై అనుమానం వ్యక్తం చేయడంతో ప్రయాణికుల్లో ఒక్క సారిగా ఆగ్రహం తెంచుకు వచ్చింది. తాము 2 నెలల క్రితం రిజర్వు చేస్తే బోగస్ టిక్కెట్లు ఎలా అనుమానిస్తారంటూ టీసీని నిలదీశారు. ఆదోని స్టేషన్లో ఆగగానే ఫ్లాట్ ఫారంపై దిగి ఆందోళనకు దిగారు. తమకు బెర్తుల సదుపాయం కల్పించి న్యాయం చేసేంత వరకు రైలును కదలినివ్వబోమని పట్టుపట్టారు. ప్రయాణీకులతో ఆడుకుంటారా అంటూ స్టేషన్ మాస్టర్ని నిలదీశారు. సమాచారం గుంతకల్లుకు పంపామని, అక్కడ అదనపు బోగీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని స్టేషన్ మాస్టర్ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చిన్న పిల్లలు, వృద్ధుళు ఉన్నారని, బెర్తులు లేక పోతే రాత్రి పూట ఎక్కడ నిద్రపోవాలని ప్రశ్నించారు. తమకు ఖచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు రైలును కదలనివ్వబోమని మొండికేశారు. పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తంగా మారడంతో స్థానిక టూటౌన్ పోలీసులకు రైల్వే అధికారులు సమాచారం అందించారు. సీఐ గంటా సుబ్బారావు, ఎస్ఐ రమేష్‌బాబు, సిబ్బందితో స్టేషన్‌కు వచ్చి గట్టిగా హెచ్చరించారు. గంతకల్లులో ఉన్నత స్థాయి అధికారులు..ఉంటారని, వారికి సమస్యను పరిష్కరించే అధికారం ఉందని, మొండిగా వ్యవహరించి వేల మంది ప్రయాణికులు ఇబ్బంది తేవద్దంటూ సీఐ నచ్చజెప్పారు. వినకపోతే చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటోందని హెచ్చరించారు. పోలీసుల జోక్యంతో దాదాపు గంట తరువాత రైలు గుంతకల్లుకు బయలు దేరి వెళ్లింది.