breaking news
beauty competition
-
మిస్టర్ వరల్డ్ పోటీలు: మిస్టర్ గ్లో..మిస్టర్ స్లో..
అందాల ప్రపంచంలో అతివలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. పురుషులకూ అంతే ప్రాధాన్యత ఉంది. మోడలింగ్ కావచ్చు, గ్లామర్, సినీ రంగాల్లో రాణించాలనుకునే యువతికైనా, యువకుడికైనా బ్యూటీ కాంటెస్ట్‌లు చక్కని ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తాయి. అయితే మహిళల అందాల పోటీలు రోజురోజుకూ విస్తరిస్తుంటే మగవాళ్ల అందాల పోటీల విలువ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పోటీలు సందడిగా ముగిసిన నేపథ్యంలో మిస్టర్ వరల్డ్ పోటీలను సిటీ మోడలింగ్ రంగం గుర్తు చేసుకుంటోంది. ప్రపంచ సుందరి పోటీలు ఎంత పాపులరో, ప్రపంచ సుందరాంగుడు పోటీలు అంత తక్కువ పాపులర్ అని చెప్పొచ్చు. మిస్ వరల్డ్ పోటీలను 1951లో ప్రారంభిస్తే.. చాలా ఆలస్యంగా.. 45ఏళ్ల తర్వాత 1996లో మిస్టర్ వరల్డ్ పోటీలను ఎరిక్ మోర్లే ప్రారంభించారు. అందం, శారీరక సామర్థ్యం, ప్రతిభ, వ్యక్తిత్వాన్ని బట్టి పురుషులను విజేతలుగా ఎంపిక చేసే ఈ పోటీ లండన్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు సారథ్యం వహిస్తున్న జూలియా మోర్లేనే ఈ పోటీలకు సైతం అధ్యక్షురాలిగా ఉన్నారు. మూడు దశాబ్దాల్లో.. పదకొండు సార్లు.. మిస్ వరల్డ్ పోటీల్లానే.. ఏటా నిర్వహించాలని ప్రారంభంలో అనుకున్నా.. స్పందనను బట్టి ఈ పోటీలను నిర్ణిత వ్యవధి అనేది లేకుండా నిర్వహిస్తున్నారు. తొలిసారి 1996లో బెల్జియం వాసి టామ్ నుయెన్స్ ఈ పోటీలో గెలుపొందగా, 1998లో వెనిజువెలా వాసి సాండ్రో ఫినోగ్లియో, 2000లో ఉరుగ్వే వాసి ఇగ్నాసియో క్లిచె, 2003లో బ్రెజిల్ వాసి గుస్తావో గియానెట్టి, 2007లో జువాన్ స్పెయిన్ కు చెందిన గార్సియా పోస్టిగో, 2010లో ఐర్లాండ్‌కు చెందిన కమాల్ ఇబ్రహీం, 2012లో కొలంబియా నివాసి ఫ్రాన్సిస్కో ఎస్కోబార్, 2014లో డెన్మార్క్ నుంచి నిక్లాస్ పెడర్సెన్, 2016లో మొదటి ఆసియన్ విజేతగా భారత్‌కు చెందిన రోహిత్ ఖండేల్వాల్, 2019లో ఇంగ్లాండ్ వాసి జాక్ హెసెల్వుడ్ గెలుపొందారు. చివరి సారిగా 2024లో ఈ పోటీ నవంబర్ 23న వియత్నాంలోని ఫాన్ థియెట్లో జరిగింది. డానియెల్ మేజియా మిస్టర్ వరల్డ్ పోటీలో, స్పోర్ట్స్ టాలెంట్ విభాగాల్లో విజేతగా నిలిచారు. అతను 60 మంది ఇతర పోటీదారులతో పోటీపడి, మొదటి స్థానం దక్కించుకున్నారు. వివిధ విభాగాల్లో.. మిస్టర్ వరల్డ్ పోటీలో పాల్గొనేవారు వివిధ విభాగాల్లో పోటీ పడతారు, వారి శారీరక సామర్థ్యం పరీక్షించడానికి స్పోర్ట్స్ ఛాలెంజ్, ప్రతిభను ప్రదర్శించే టాలెంట్ రౌండ్, సామాజిక మాధ్యమాల్లో పట్టును చూపించే మల్టీమీడియా, వ్యక్తిగత శైలి ఫ్యాషన్ సెన్స్ చూపే ఫ్యాషన్ రౌండ్.. ఈ పోటీలు పాల్గొనేవారి సమగ్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి రూపొందించారు. ఇండియాకు టైటిల్ తెచ్చిన నగరవాసి..2016లో, రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు, ఆసియన్ కూడా. ఈ పోటీ జులై 19, 2016న ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగింది. రోహిత్, మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డు కూడా గెలుచుకున్నారు. విశేషం ఏమిటంటే రోహిత్ ఖండేల్వాల్ నగరానికి చెందిన యువకుడు కావడం. ఈ నేపథ్యంలో మిస్టర్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి మన హైదరాబాద్ పూర్తిగా సరైన ఎంపిక అని పలువురు నగర మోడల్స్ అభిప్రాయపడుతున్నారు. మిస్ వరల్డ్ లాగే మిస్టర్ వరల్డ్ పోటీదారులు కూడా హైదరాబాద్ నగరంలో సందడి చేస్తారేమో వేచి చూద్దాం.. (చదవండి: మిస్ యూనివర్స్ సన్నాహకం..) -
మిస్ యూనివర్స్ పోటీల్లో దేవకన్యలా మెరిసిపోయిన శ్వేత
ప్రతిష్టాత్మక 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి.ఎల్ సాల్వడార్లో వేదికగా ఆదివారం ఉదయం 9గంటలకు(భారత కాలమానం ప్రకారం).. మిస్ యూనివర్స్2023 ఎవరో తేలిపోనుంది. 90 దేశాలకు చెందిన అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 23ఏళ్ల శ్వేతా శార్దా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన నేషనల్ కాస్ట్యూమ్ షోలో శ్వేత ధరించిన కాస్ట్యూమ్స్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. రీగల్ ఎంబ్రాయిడరీతో చేసిన దుస్తులు ధరించి శ్వేత దేవకన్యలా మెరిసింది. జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించిన కిరీటం ధరించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.దీంతో పాటు జాతీయ పక్షి నెమలి ప్రతిబింబించేలా కాస్ట్యూమ్‌ను ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. సవాళ్లను ఎదుర్కొనే, అభివృద్ధి చెందుతున్న దృఢమైన భారత్‌కు ప్రతీకగా ఈ కాస్ట్యూమ్‌ను డిజైన్ చేసినట్లు డిజైనర్ నిధి యశా తెలిపింది. ప్రస్తుతం శ్వేతా శార్దా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) ఎవరీ శ్వేతా శార్దా? చండీగఢ్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా శార్దా ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఈ ఏడాది భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. 16 ఏళ్ల వయసులో తన తల్లితో కలిసి ముంబై చేరిన శ్వేత చిన్నతనంలోనే డ్యాన్స్‌పై మక్కువ ఏర్పరుచుకుంది. ఇప్పటివరకు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’, ‘డ్యాన్స్ దీవానే’ వంటి పలు రియాలిటీ షోల్లో ఆమె పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా గ్రూప్‌లో భాగమైన ‘మిస్ దివా యూనివర్స్-2023’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మరి మిస్ యూనివర్స్‌గా సత్తా చాటుతుందా అన్నది చూడాల్సి ఉంది. భారత్ నుంచి చివరగా 2021లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్‌గా గెలుపొందిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం
‘నేను ఒక సగటు భారతీయ మహిళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న నాకు అందాల సుందరిగా పట్టాభిషేకం చేయడం భారతదేశం నలుమూలల్లో ఉన్న అద్భుతమైన మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు స్వాతి పాల. ఈ యేడాది హాట్ మండే మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత కిరీటాన్ని ఇటీవల స్వాతి పాల అందుకున్నారు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన స్వాతి, హైదరాబాద్‌లో మీడియా రంగంలోనూ పని చేశారు. కెనడాలో బిజినెస్ అనలిస్ట్‌గా, ఇద్దరు పిల్లలు తల్లిగా, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న గృహిణిగా, తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న సాధకురాలిగా స్వాతి ఎన్నో సంగతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ఈ ఏడాది ప్రయాణం నాకు చాలా అపురూపమైనది. వివాహిత మహిళల కోసం అత్యంత గౌరవనీయమైన, ప్రసిద్ధి చెందిన ఈ అందాల పోటీలు దుబాయ్‌లోని రస్ అల్ ఖైమాలోని హిల్టన్ గార్డెన్ ఇన్ లో జరిగింది. ఈ ఫైనల్స్‌లో దేశ దేశాల నుంచి 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నేను అగ్రగామిగా నిలవడం ఎంతో గొప్పగా, ఆనందంగా అనిపించింది. నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, భూమిని సూచించేలా నన్ను ఎలిమెంట్స్ క్వీన్‌గా ప్రకటించారు. మాది వైజాగ్. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీయే చేశాను. హైదరాబాద్‌కి ఉద్యోగరీత్యా వచ్చాక సాక్షి’ టీవీ ప్రారంభం నుంచి నాలుగేళ్లు హెచ్.ఆర్ విభాగంలోనూ, క్రియేటివ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గానూ వర్క్ చేశాను. మా వారి జాబ్ నేవీ కావడంతో తనకు కెనడాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో నేనూ కెనడా వెళ్లాను. అక్కడే బిజినెస్ అనలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో అప్లై మా వారు ఆన్లైన్లో ఈ అందాల పోటీల గురించి చూసి, నన్ను ప్రోత్సహించారు. అప్లై చేయించారు. 50 వేల అప్లికేషన్స్‌లో 110 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక అయిన వారిలో నేనున్నాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఏడాదిగా చాలా సెషన్స్ అయ్యాయి. వాటిలో రకరకాల టాస్క్‌లు దాటుకుని దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాను. మూడు రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 20 మందితో పోటీ పడి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచాను. కష్టమైనా ఇష్టంతో.. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఈ పోటీలో పాల్గొడానికి చేసిన కృషి చాలా కష్టమైనది. రోజూ జిమ్‌కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవడం, గ్రూమింగ్ సెషన్స్ తీసుకోవడం, ర్యాంప్ వాక్, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం క్లాసులు .. ప్రతిసారీ టాస్క్ అనిపించింది. ఉద్యోగంతో పాటు ఈ హార్డ్ వర్క్ చేయగలనా.. అని సందేహం కలిగింది. కానీ, ప్రారంభించాక మెల్ల మెల్లగా మామూలు అయిపోయింది. అయితే, ఈ క్లాసులన్నీ దాదాపు ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇండియా నుంచి కోచ్‌లుగా ఉన్న రితిక రామ్త్రీ మొదటి ఆరు నెలలు, తర్వాత శైలజ సూచి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండియా టైమింగ్స్‌ను బట్టి నైట్ టైమ్‌లోనూ కోచింగ్ తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను అనే ఉత్సాహంతో ఈ ప్రయాణం నడిచింది. క్లాసికల్ డ్యాన్సర్ ముందు కష్టం అనుకున్నది మెల్లగా మెల్లగా నా దినచర్య మార్చుకోవడంతో ట్రైనింగ్ సులువుగా మారిపోయింది. సెషన్స్‌లో ‘మిమ్మల్నే మిసెస్ ఇండియాగా ఎందుకు సెలక్ట్ చేయాలి?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నాను. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకున్నాను. దీంతో డ్యాన్స్‌లో నాకు సులువు అనిపించింది. పిల్లలే ప్రోత్సాహం కిరీటం వచ్చిందా లేదా అనేది తర్వాతి విషయం. శిక్షణ ఎంత బాగా తీసుకుంటామో ఫైనల్ పోటీలలో ప్రతిఫలిస్తుంది. కానీ, నాలో నాకే చాలా గొప్ప మార్పులు కనిపించాయి. నా పెద్ద కొడుకు తనీష్‌కి పదకొండేళ్లు. వాడు నా ఫొటోలు తీసి, సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ చేసేవాడు. చిన్నవాడు రేయాన్ ఫుడ్ తీసుకోవడంలో చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ‘నువ్వే గెలవాలి’ అనే వారి తాపత్రయం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. రాబోయే పోటీలు 12వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. కెనడాలో వచ్చే నెలలో జరగబోయే ఆడిషన్స్‌లో నేను జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. అయితే, ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయో తెలియాల్సి ఉంది’ అని వివరించారు ఈ మిసెస్ ఇండియా. – నిర్మలారెడ్డి -
గ్లామర్ గర్ల్స్
-
ఫైనల్ బ్యూటీస్
-
బ్యూటీ కాంటెస్ట్‌లో 18 మందిని వెనక్కి నెట్టి..
లండన్: లేటు వయసులో బ్యూటీ క్వీన్ కిరీటాన్ని దక్కించుకున్న 85 ఏళ్ల ఎలిజబెత్ లాతెగన్ ఆత్మవిశ్వాసం, జీవితం పట్ల ఆమె దృక్పధంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ అందాల బామ్మ నుంచి యువత నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. బ్యూటీ క్వీన్‌గా గెలుపొందడంతో పాజిటివ్ మైండ్, కష్టించి పనిచేయడం జీవితకాలాన్ని పెంచడంతో పాటు చూపరులను ఆకట్టుకోవడం సాధ్యమేనని స్పష్టమైందని ఈ బామ్మ చెబుతోంది. కెన్సింగ్టన్లో జరిగిన సీనియర్ మహిళల బ్యూటీ కాంటెస్ట్‌లో 18 మందితో పోటీపడి ఎలిజెబెత్ విన్నర్‌గా నిలిచింది. ఈ పోటీలో తనకన్నా చిన్న వయసు వారినీ అధిగమిస్తూ అందాల కిరీటాన్ని ఆమె దక్కించుకుంది. వృద్ధులకు ఆహారాన్ని అందించే మీల్స్ ఆన్ వీల్స్‌కు నిధుల కోసం స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈవెంట్ నిర్వాహకులు తనను గేలి చేస్తున్నారేమోనని భావించానని ఎలిజబెత్ చెప్పుకొచ్చారు. అయితే తర్వాత ఎలాగైనా కాంటెస్ట్‌లో పాల్గొనాలని ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నేరుగా పోటీకి వెళ్లి టైటిల్ నెగ్గానని చెప్పారు. ఈ పోటీకి ఎంతో మంది యువతులు వచ్చినా తన గుడ్‌లుక్స్ జడ్జీలను ఆకట్టుకున్నాయని చెప్పారు. తాను అందంతో పాటు ధృడంగా ఉన్నానని ఈ కాంటెస్ట్ నిరూపించిందని అందాల బామ్మ చెప్పారు. యువతులు తమ శరీరం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ చురుకుగా ఉండాలని, ఇదే తన విజయ రహస్యమనీ చెప్పారు. -
అందాల కిరీటం ఎవరిదో?.