లండన్: లేటు వయసులో బ్యూటీ క్వీన్ కిరీటాన్ని దక్కించుకున్న 85 ఏళ్ల ఎలిజబెత్ లాతెగన్ ఆత్మవిశ్వాసం, జీవితం పట్ల ఆమె దృక్పధంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ అందాల బామ్మ నుంచి యువత నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. బ్యూటీ క్వీన్‌గా గెలుపొందడంతో పాజిటివ్ మైండ్, కష్టించి పనిచేయడం జీవితకాలాన్ని పెంచడంతో పాటు చూపరులను ఆకట్టుకోవడం సాధ్యమేనని స్పష్టమైందని ఈ బామ్మ చెబుతోంది. కెన్సింగ్టన్‌లో జరిగిన సీనియర్ మహిళల బ్యూటీ కాంటెస్ట్‌లో 18 మందితో పోటీపడి ఎలిజెబెత్ విన్నర్‌గా నిలిచింది. ఈ పోటీలో తనకన్నా చిన్న వయసు వారినీ అధిగమిస్తూ అందాల కిరీటాన్ని ఆమె దక్కించుకుంది.
వృద్ధులకు ఆహారాన్ని అందించే మీల్స్ ఆన్ వీల్స్‌కు నిధుల కోసం స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈవెంట్ నిర్వాహకులు తనను గేలి చేస్తున్నారేమోనని భావించానని ఎలిజబెత్ చెప్పుకొచ్చారు. అయితే తర్వాత ఎలాగైనా కాంటెస్ట్‌లో పాల్గొనాలని ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నేరుగా పోటీకి వెళ్లి టైటిల్ నెగ్గానని చెప్పారు.
ఈ పోటీకి ఎంతో మంది యువతులు వచ్చినా తన గుడ్‌లుక్స్ జడ్జీలను ఆకట్టుకున్నాయని చెప్పారు. తాను అందంతో పాటు ధృడంగా ఉన్నానని ఈ కాంటెస్ట్ నిరూపించిందని అందాల బామ్మ చెప్పారు. యువతులు తమ శరీరం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ చురుకుగా ఉండాలని, ఇదే తన విజయ రహస్యమనీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment