beef controversy
-
పోలీస్ స్టేషన్ ఎదుట బీఫ్ కర్రీ పంపిణీ..
కోజికోడ్ : కేరళలో పోలీస్ ట్రైనీల మెనూలో బీఫ్‌ను తొలగించారన్న వార్తల నేపథ్యంలో కోజికోడ్‌లోని ఓ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బీఫ్ కర్రీ, బ్రెడ్‌ను పంచారు. ముక్కం పోలీస్ స్టేషన్ వద్ద కేపీసీసీ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ కే ప్రవీణ్ కుమార్ బీఫ్ కర్రీ, బ్రెడ్ పంపిణీని ప్రారంభించారు. ప్రధాని మోదీని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రమాణ స్వీకరాం చేసిన వెంటనే కలిశారని, ఆయన ప్రోద్బలంతో మోదీ, షాలకు క్లీన్ చిట్ ఇచ్చిన లోక్‌నాథ్ బెహెరాను డీజీపీగా నియమించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సంఘ్ అజెండాను పినరయి విజయన్ తలకెత్తుకున్నారని, ఆయన రెండు నాల్కల ధోరణిని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుందని అన్నారు. మరోవైపు పోలీస్ ట్రైనీల మెనూ నుంచి బీఫ్‌ను తొలగిస్తారన్న ప్రచారం అవాస్తవమని కేరళ పోలీసు విభాగం స్పష్టం చేసింది. చదవండి : ‘పిల్లలు బీఫ్ తినడం పెద్దల తప్పు’ -
ఓనం పూట బీఫ్ తిన్న నటి.. విమర్శలు
సాక్షి, కొచ్చి: మళయాళం స్టార్ నటి బీఫ్ వివాదంలో చిక్కుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందిన సురభి లక్ష్మి ఓనం పండగ రోజు బీఫ్ తిన్న కారణంగా విమర్శలు ఎదుర్కుంటోంది. కొన్నాళ్ల క్రితం తన స్నేహితులతో ఓ హోటల్‌కు వెళ్లిన సురభి బీఫ్ ఫ్రైను ఎంజాయ్ చేస్తూ ఓ సెల్ఫీ దిగి దానిని తన ఫేస్బుక్లో షేర్ చేసింది. అయితే వాటిని చూపిస్తూ ఓనం పూట ఓ ఛానెల్ వాళ్లు ఓ కార్యక్రమం ప్రసారం చేశారు. అంతే శాఖాహర ఫెస్టివల్ అయిన ఓనం పూట గోమాంసం తింటావా? అంటూ సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర పదజాలంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే అది ఓనం కంటే మూడు వారాల కంటే ముందే దిగానని, కొజికోడ్‌లోని తన ఫెవరెట్ హోటల్‌కు వెళ్లినప్పుడు దిగిన ఫోటో అని సురభి క్లారిటీ ఇచ్చారు. ‘ఓ కార్యక్రమం కోసం నేను అక్కడికి వెళ్లాను. బాగా ఆకలేసింది. ఆ సమయంలో నేను తింది బీఫా?చికెనా? పంది మాంసమా? అని ఆలోచించలేదు. మనిషికి ఆకలి ముఖ్యం. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ఆ కార్యక్రమం ఓనం రోజు ప్రసారం కావటం అని ఆమె చెప్పారు. -
జమ్ములో మళ్లీ 'నెట్' కట్!
శ్రీనగర్: గోమాంసం (బీఫ్) తినే విషయమై అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో జమ్ములో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బీఫ్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మిలిటెన్సీ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఫ్ పార్టీ ఇచ్చారన్న కారణంతో ఓ ఎమ్మెల్యేపై అసెంబ్లీలోనే సహచర ఎమ్మెల్యేలు దాడిచేసిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.