
జమ్ములో మళ్లీ 'నెట్' కట్!
శ్రీనగర్: గోమాంసం (బీఫ్) తినే విషయమై అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో జమ్ములో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బీఫ్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో మిలిటెన్సీ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఫ్ పార్టీ ఇచ్చారన్న కారణంతో ఓ ఎమ్మెల్యేపై అసెంబ్లీలోనే సహచర ఎమ్మెల్యేలు దాడిచేసిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.