Belt Shops will be closed
-
దుకాణాలు మాకొద్దు!
సాక్షి, నెల్లూరు: ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధం వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం పలు నిబంధనలు అమలులోకి తీసుసుకువచ్చింది. అధికారులు అందుకు తగినట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. తొలిదశలో బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. కొత్త పాలసీ తెచ్చేందుకు మరికొంత సమయం పడుతున్న నేపథ్యంలో పాత దుకాణాల లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బెల్టుషాపులు లేకుండా చేసేందుకు చర్యలు తీవ్రతరం చేయడంతో రెన్యూవల్ చేసుకునేందుకు అనేకమంది దుకాణదారులు ఆసక్తి చూపలేదు. దశలవారీ మద్య నిషేధ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మద్యం షాపుల లైసెన్సీ కాలపరిమితిని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. నెల్లూరు రెవెన్యూ జిల్లాలో 348 మద్యం షాపులకు గానూ 260 షాపుల నిర్వాహకులు మూడునెలల ఫీజు చెల్లించి లైసెన్సును రెన్యూవల్ చేసుకోగా మిగిలిన వారు వెనుకంజ వేశారు. దీంతో ఆయా షాపులు మూతపడ్డాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టుషాపులపై దాడులు ముమ్మరం చేశారు. మద్య నిషేధంలో భాగంగా ఏటా మద్యం దుకాణాలను తగ్గిస్తామని, అక్టోబర్ ఒకటి నుంచి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రిటైల్ మద్యం షాపులు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో నూతన మద్యం పాలసీ రూపకల్పనకు మరికొంత సమయం పట్టనుండటంతో గత నెల 25వ తేదీన మద్యం దుకాణాల లైసెన్సును మరో మూడునెలలు పొడిగిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 260 మాత్రమే.. నెల్లూరు ఎక్సైజ్ జిల్లాలో 199, గూడూరు ఎక్సైజ్ జిల్లాలో 149 మద్యం దుకాణాలున్నాయి. వీటి లైసెన్సీ కాలపరిమితి గతనెల 30వ తేదీన ముగిసింది. అయితే అప్పటికే ప్రభుత్వం మరో మూడునెలలు లైసెన్సీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వ్యాపారులు లైసెన్సీ ఫీజు, పర్మిట్ రూమ్ ఫీజులో నాలుగో వంతు చెల్లించి లైసెన్సీని రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో నెల్లూరు ఎక్సైజ్ జిల్లా పరిదిలో 199 దుకాణాలకు గానూ 154, గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 149 దుకాణాలకు గానూ 106 దుకాణదారులు రెన్యూవల్ చేసుకున్నారు. 348 దుకాణాలకు గానూ లైసెన్సీ ఫీజు, పర్మిట్‌రూమ్ ఫీజుల కింద మూడునెలలకు ప్రభుత్వానికి రూ.16.47 కోట్లు రావాల్సి ఉండగా 88 మంది రెన్యూవల్‌కు ముందుకు రాకపోవడంతో రూ 12.37 కోట్లు వచ్చింది. దీంతో రూ.4.1 కోట్ల రాబడి తగ్గింది. వెనుకంజ.. దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలుత బెల్టుషాపుల నియంత్రణపై దృష్టి సారించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు చేస్తూ బెల్టును నియంత్రించారు. మరోవైపు ఎంఆర్పీ ఉల్లంఘించినా, నిర్ణీత వేళలు పాటించని దుకాణదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నిబంధనలు అతిక్రమించి ధనార్జనకు అలవాటుపడిన మద్యం షాపు నిర్వాహకులకు ప్రభుత్వ చర్యలు మింగుడుపడడం లేదు. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాల లైసెన్సీ కాలపరిమితి మూడునెలలకు పొడిగించినా రెన్యూవల్ చేయించుకునేందుకు వెనకడుగు వేశారు. నెల్లూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 45, గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 43 మద్యం వ్యాపారులు తమ లైసెన్సులను రెన్యూవల్ చేసుకోలేదు. -
‘బెల్ట్’ తీస్తారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: 2018 జూలై 11న అనపర్తి నియోజకవర్గం పందలపాకలో ప్రజాసంకల్ప పాదయాత్ర సాగుతూండగా తన బిడ్డతో కలిసి వచ్చిన ఓ చెల్లెమ్మను చూసి ‘నీ కష్టం ఏంట మ్మా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగారు. ఆ సం దర్భంగా మద్యం రక్కసి కారణంగా తన కుటుంబం పడుతున్న కష్టాలను చెప్పుకున్న ఆమె ‘మద్యాన్ని నిషేధించండన్నా’ అని అభ్యర్థించారు. ‘మీరు సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాల’ని బిక్కవోలుకు చెందిన ఇందన వీరకాసులు అనే మహిళ 2018 జూలై 12న తన గ్రామం మీదుగా వెళ్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరింది. తన ముగ్గురు కుమారులూ మద్యానికి పూర్తిగా బానిసలయ్యారని, ఒక కుమారుడు చనిపోగా, మిగిలిన ఇద్దరూ కూడా రోజూ తాగి తనను కొట్టి, ఇంట్లోంచి తరిమివేశారని వాపోయింది. తన కుటుంబం మాదిరిగా రాష్ట్రంలో అనేక కుటుంబాలు మద్యం కారణంగాచిన్నాభిన్నమవుతున్నాయని వాపోయింది. ఇలా దారి పొడవునా మహిళలు మద్యం మహమ్మారితో పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. 2018 జూలై 25న పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో వేలాది మంది మహిళల కరతాళ ధ్వనుల మధ్య మద్యనిషేధంపై ప్రకటన చేశారు. ‘దేవుడు కరుణించి, మనందరి ప్రభుత్వం వస్తే 2024 నాటికి రాష్ట్రంలో మద్యం దుకాణాలు లేకుండా చేస్తాన’ని హామీ ఇచ్చారు. ‘బెల్ట్’ తీయడంతో ఆరంభం అందరూ అనుకున్నట్టుగానే ప్రజల అశేష ఆదరాభిమానాలతో అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన దిశగా అడుగులు వేయడం ఆరంభించారు. ఇందులో భాగంగానే ఇచ్చిన హామీకి అనుగుణంగా దశల వారీగా మద్యనిషేధం అమలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో తొలుత బెల్ట్‌షాపులు పూర్తిగా ఎత్తివేయాలని, అధికారిక షాపులు తప్ప బెల్ట్షాపులనేవి కనిపించకూడదని సీఎం ఆదేశించారు. జిల్లాలో ఆరేడు వేల వరకూ బెల్ట్‌షాపులు ఉన్నాయి. అధికారికంగా చెప్పకపోయినా దాదాపు ప్రతి గ్రామంలోనూ బెల్ట్‌షాపులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు తొలి అడుగుగా బెల్ట్‌షాపులన్నీ కనుమరుగు కానున్నాయి. ఇకపై మద్యం అధికారిక షాపులకే పరిమితం కానుంది. జిల్లాలో 540 మద్యం దుకాణాలు, 40 వరకూ బార్లు ఉన్నాయి. వాటిలోనే మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది. మూడో సంతకానికి చంద్రబాబు తిలోదకాలు 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రమాణ స్వీకారం రోజున బెల్ట్‌షాపులను ఎత్తివేస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడో సంతకం పెట్టారు. కానీ ఆచరణలో ఆ హామీకి తిలోదకాలిచ్చారు. పైగా వీధి చివరన, గుడి, బడి పక్కన మద్యం షాపులు, వాటికి అనుబంధంగా బెల్ట్‌షాపులను విచ్చలవిడిగా ప్రోత్సహించారు. మద్యాన్ని ఏరుల్లా పారిస్తూ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించారు. పేదల ఇళ్లను గుల్ల చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడారు. అమ్మకాలే లక్ష్యంగా 2015లో లిఫ్టింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. మునుపటి ఏడాది, నెల ప్రామాణికంగా 10 శాతం అదనపు కొనుగోళ్లు చేయాలని వ్యాపారులపై ఒత్తిడి తెచ్చారు. బెల్ట్‌షాపులు, మద్యం ధరలను పెంచుకునేందుకు పరోక్షంగా అనుమతి ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014 నుంచి ఒకేసారి మద్యం దుకాణాలు రెట్టింపు కాగా.. విక్రయాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. చంద్రబాబు సర్కార్ వచ్చే నాటికి రోజువారీ అమ్మకాలు రూ.కోటి వరకూ ఉండగా ఆ తరువాత రోజుకు రూ.5.60 కోట్ల వరకూ పెరిగాయి. కూలిన కుటుంబాలెన్నో.. మద్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు, లైంగిక దాడులు జరుగుతున్నా యి. అనేక కుటుంబాల్లో అశాంతి జ్వాలలు రేగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మరణాలు సంభవించాయి. కాకినాడ ఏటిమొగ రోడ్డులోని మద్యం షాపు వద్ద తలెత్తిన వివాదంలో ఒక వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చింతూరు మండలం తుమ్మలలో తనతో సహజీవనం చేస్తున్న మహిళను సీతయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో హతమార్చాడు. అమలాపురం నల్లవంతెన సమీపంలోని మద్యం షాపు వద్ద ఓ జట్టు కూలీ మద్యం మత్తులో మరో జట్టు కూలీని తలపై రాయితో మోది హతమార్చాడు. రాజమహేంద్రవరం అంబేడ్కర్ నగర్లో ఒక వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని మృతి చెందాడు. భర్త మద్యం వ్యసనానికి బానిసై, కుటుంబ పోషణను పట్టించుకోవడం లేదన్న విరక్తితో రాజమహేంద్రవరంలో ఒక మహిళ, తన పిల్లలను తీసుకుని గోదావరిలో దూకేసింది. అక్కడి మత్స్యకారులు వారిని రక్షించారు. సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో మద్యం మత్తులో గ్రావెల్ లోడు లారీ ఓ ఆటోను ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఇవేవీ చంద్రబాబును కనీసంగా కూడా కదిలించలేదు. కుటుంబాలు కూలిపోతున్నా, పిల్లలు అనాథలవుతున్నా, ఆర్థికంగా చితికిపోతున్నా పట్టలేదు. ప్రమాణ స్వీకారం రోజున బెల్ట్‌షాపులను నియంత్రిస్తానంటూ పెట్టిన మూడో సంతకాన్ని కూడా అమలు చేయలేదు. దీంతో పేదల పరిస్థితి పరమ దయనీయంగా తయారైంది. సంపన్నుల కుటుంబాల్లో సహితం మద్యం రక్కసి చిచ్చు రేపింది. ఆ మత్తులో పడి అనారోగ్యానికి గురై, అనేకమంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. -
సమష్టిగా ‘బెల్ట్’ తీశారు
కథలాపూర్(వేములవాడ) : మూడేళ్ల క్రితం గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం బెల్ట్‌షాపులు ఉండటంతో సులువుగా మద్యం దొరికేది. అమ్మకాలు జోరుగా సాగేవి. ఫలితంగా సాయంత్రం అయితే చాలు.. వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలు జరుగేవి. యువత మద్యం మత్తులో తల్లిదండ్రులతో గొడవ పడడం, పొద్దంతా కష్టపడిన కార్మికులు, కూలీలు వారికి వచ్చిన డబ్బులు మద్యానికే వెచ్చించడంతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్నిటికీ బెల్ట్‌షాపులే కారణమని భావించారు పోలీసులు. బెల్ట్ షాపులు మూసివేస్తే నేరాలు తగ్గుతాయని నిర్ణయించారు. ఇందుకు గ్రామీణుల సహకారం తీసుకున్నారు. 2016, జనవరి 6 నుంచి అప్పటి ఎస్సై నిరంజన్‌రెడ్డి బెల్ట్ తీయడం ప్రారంబించారు. సుమారు రెండేళ్ల నుంచి బెల్ట్‌షాపులు మూసివేత కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. క్రైంరేటు గణనీయంగా తగ్గింది. 55 షాపులకు చెక్ కథలాపూర్ మండలంలో 18 గ్రామాలున్నాయి. 2015, డిసెంబర్ 31 వరకు మండల వ్యాప్తంగా సుమారు 55 బెల్ట్‌షాపులు అక్రమంగా నిర్వహించేవారు. బెల్ట్‌షాపుల్లోనే సిట్టింగ్ సౌకర్యం ఉండటంతో మందుబాబులు గ్రూపులుగా వెళ్లి మద్యం సేవించేవారు. ఈక్రమంలో కొన్నిసార్లు అక్కడే వివాదాలు జరిగేవి. కొన్ని ప్రైవేట్ పంచాయితీలకు బెల్ట్‌షాపులు వేదికగా మారిన సంఘటనలున్నాయి. ఈ క్రమంలో 2016, జనవరి 6న కథలాపూర్ ఎస్సైగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక మొదటగా బెల్ట్‌షాపులపై దృష్టిసారించారు. షాపులు నిర్వహించొద్దని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. కొత్త అధికారి.. ఇవన్నీ కామన్ అనుకున్నారు నిర్వాహకులు. ఏకంగా బెల్ట్‌షాపు నిర్వాహకులను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే మండలంలోని బెల్ట్‌షాపులు అన్నీ మూతబడ్డాయి. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఆయన బదిలీ తర్వాత వచ్చిన ఎస్సైలు ఆరీఫ్ అలీఖాన్, జాన్‌రెడ్డి, రాజునాయక్, ప్రస్తుత ఎస్సై నాగేశ్వర్రావు కూడా అదే విధానాన్ని పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో మద్యం బెల్ట్‌షాపు ఊసెత్తకుండా చేశారు. పల్లెల్లో వివాదాలు తగ్గుముఖం పట్టాయి. ప్రశాంత వాతావరణం నెలకొంది. తగ్గిన నేరాల సంఖ్య 2015, డిసెంబర్ 31 వరకు కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సుమారు 146 నేరాలు నమోదుయ్యాయి. 2016 జనవరి నుంచి బెల్ట్‌షాపులు మూసివేతతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్న ఆటో, జీపు డ్రైవర్లకు పోలీసు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. 2016లో మండలంలో నమోదైన నేరాల సంఖ్య 65. 2017లో మళ్లీ 120కి చేరింది. మద్యం బెల్ట్‌షాపులు బంద్ ఉం డటంతో పోలీసుల కృషి ఫలించిందని మండలంలోని మహిళలు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు అధికారులు కొత్తగా వచ్చినప్పుడు ఏదో అంటారు అనుకున్నాం. కథలాపూర్ మండలంలో అప్పటి ఎస్సై నీరంజన్రెడ్డితోపాటు ఇప్పటివరకు కథలాపూర్‌లో విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారులు మద్యం బెల్ట్‌షాపులు మూసివేయించడం పక్కాగా అమలు చేశారు. కథలాపూర్ మండలంలో మార్పులు తేవడం సంతోషంగా ఉంది. బెల్ట్‌షాపులు లేకపోవడంతో గ్రామాల్లో కొత్త మార్పులు వచ్చాయి. పోలీసులకు కృతజ్ఞతలు. – బద్దం మహేందర్, భూషణరావుపేట మార్పు సంతోషకరం.. గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉండడంతో మద్యం సేవించడం ఎక్కువ మందికి అలవాటైంది. యువత ఒకరినిచూసి మరొకరు మద్యం సేవించి చేడిపోతున్నారు. మద్యానికి బానిస అవుతుండటం ఆందోళన కలిగించింది. ఇవన్నిటికీ కారణమైన బెల్ట్‌షాపులు మూసి ఉండటంతో పేద కుటుంబాలు కాస్తా ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉంటున్నారు. బెల్ట్‌షాపుల మూసివేతకు కృషిచేసిన పోలీస్ అధికారుల సేవలు మరిచిపోలేం. – మైస శ్రీధర్, చింతకుంట ప్రజల సహకారంతో విజయవంతం ప్రజల సహకారంతోనే బెల్ట్ షాపులను నియంత్రించగలిగాం. రెండేళ్లుగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేశాం. యువత వ్యసనాలకు బానిసకావొద్దు. యువత మంచి లక్ష్యంతో ముందుకు వెళ్లాలి. మంచి మార్గాల్లో వెళ్లే యువతను పోలీస్‌శాఖ తరఫున ప్రోత్సహిస్తాం. మండలంలో గతంలోకన్నా నేరాల సంఖ్య తగ్గడం సంతోషం. ప్రజలు ఎల్లప్పుడూ పోలీస్‌శాఖకు సహకరించాలి. – నాగేశ్వర్రావు, ఎస్సై, కథలాపూర్ -
తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్‌షాపులు మూసేస్తాం
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేస్తామని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన స్త్రీశక్తి ఉపాధిహామీ భవనాన్ని శనివారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పదవులపై ఆశలేదని, ప్రజాసేవే ముఖ్యమన్నారు. మంత్రి పదవిలో ఉండి ఉంటే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తయ్యేదని చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే శ్రీశైలం సొరంగ మార్గం చేపట్టినట్లు వివరించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మూడవ విడత రచ్చబండలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. మ ద్యానికి అలవాటు పడి ఎంతో మంది చనిపోతున్నారని, మద్యం మానిపించేందుకు మహిళలు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతోనే మహిళలకు ఆర్థిక స్వాలంభన లభించిందన్నారు. మహానేత చేపట్టిన మహిళా సంక్షేమ పథకాలు గర్వించదగినవన్నారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన రుణాలు అందజేశా రు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ కోటేశ్వర్రావు, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకనారాయణగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, ఉద్యానవనశాఖ ఏడీ బి.బాబు, తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ పాల్గొన్నారు.