సౌరవ్ గంగూలీకి గౌరవ డాక్టరేట్!
క్రికెట్ రంగానికి అందించిన సేవలకు గుర్తుగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బెంగాల్ ఇంజినీరంగ్ అండ్ సైన్స్ యూనివర్సిటీ(బీఈఎస్ యూ) గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. గంగూలీకి ఓ జ్క్షాపికతోపాటు గౌరవ డాక్టరెట్ ను గవర్నర్ ఎంకే నారాయణన్ అందచేశారు.
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. తనకు లభించిన అవార్డుల్లో ఇదే అత్యుత్తమం అని అన్నారు. తన రాష్ట్రం తరపున లభించిన ప్రతి అవార్డు తనకు ఉత్తమైందనే అని అన్నారు. ప్రతి విద్యార్థి హార్డ్ వర్క చేయాలని.. వారి వారి రంగాల్లో అత్యుత్తమ శిఖరాలను అందుకోవాలని గంగూలీ సలహా ఇచ్చారు.