Berlin wall
-
బెర్లిన్ వాల్
-
గూఢచర్యం ఎలా చేయాలో చెప్పే స్కూళ్లు!
బెర్లిన్: ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో గూఢచారుల రాజధానిగా పేరొందిన బెర్లిన్ నగరంలో కొత్తగా గూఢచార్యం ఎలా చేయాలో చెప్పేందుకు.. జర్మనీ దేశ నిఘూ వర్గాలు పాఠశాలలను ప్రారంభిస్తున్నాయి. ఇక తమ స్పై(వేగు) స్కూల్లో సైబర్‌దాడులను ఎలా అరికట్టాలో నేర్పించడంతో పాటు హ్యాకింగ్, ఉగ్రమూకలను ఏరి పారేయడం, కెమిస్ట్రీ ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి ఏజెంట్లకు శిక్షణ ఇస్తామని జర్మన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ క్రమంలోనే సెంటర్ ఫర్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ట్రైనింగ్‌ను గూఢాచార సంస్థల అధిపతులు మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. కాగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీగా విడిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగావకాశాలు, మెరుగైన విద్య కోసం తూర్పు జర్మన్లు 1950-60 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీకి వలసపోయారు. అందులో వందలాది మంది ప్రొఫెసర్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు ఉండటంతో తూర్పు జర్మనీ ఆర్థిక వ్యవస్థ (బ్రెయిన్ డ్రైన్) బలహీనపడింది. ఈ క్రమంలో వలసలను కట్టడి చేసేందుకు తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో బెర్లిన్ గోడను నిర్మించింది. 1980లో సోవియట్ ఆధిపత్య ధోరణి పతనం కావడంతో.. తూర్పు జర్మనీలో ఆంక్షలు సడలి రాజకీయ సరళీకరణ ప్రారంభమైంది. దీంతో నవంబర్ 9, 1989 న బెర్లిన్ గోడను కూల్చివేశారు. ఈ క్రమంలో ఇటీవల బెర్లిన్ గోడ కూలి 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవటంతో అక్కడి ప్రజలు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. -
వాళ్లింటికి వెళ్లొద్దు
మొన్న నవంబర్ 9న రెండు చరిత్రాత్మకమైన పరిణామాలు సంభవించాయి. అయోధ్య తీర్పు వచ్చింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం అయింది. ఈ రెండు సందర్భాలలోనూ.. ముప్పై ఏళ్ల క్రితం ఇదే నవంబర్ 9న కుప్పకూలిన బెర్లిన్ గోడ ప్రస్తావన మన ప్రధాని నోటి నుంచి, పాక్ విదేశాంగ మంత్రి నోటి నుంచి వచ్చింది! బెర్లిన్ గోడలా అయోధ్య తీర్పు మనుషుల మధ్య అడ్డుగోడల్ని కూల్చేసిందని మన ప్రధాని అంటే.. బెర్లిన్ గోడలా కర్తార్‌పూర్.. దక్షిణాసియా దేశాల్ని కలుపుతుందని పాక్ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో బెర్లిన్ గోడ గురించి క్లుప్తంగా కొన్ని వివరాలు, విశేషాలు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ.. రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌ల ఆధిపత్యంలోకి వెళ్లింది. రష్యా అధీనంలో ఉన్న జర్మనీలో కమ్యూనిజం, మిగిలిన మూడు ప్రాంతాల్లోని జర్మనీలో క్యాపిటలిజం అభివృద్ధి చెందాయి. ఆ మూడు ప్రాంతాలు సంయుక్తంగా వెస్ట్ జర్మనీగా, మిగిలిన ప్రాంతం ఈస్ట్ జర్మనీగా ఉండిపోయింది. ఈస్ట్ జర్మనీ రాజధాని ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ జర్మనీ రాజధాని వెస్ట్ బెర్లిన్ అయింది. క్రమంగా కమ్యూనిస్టు, క్యాపిటలిస్టు ప్రాంతాల మధ్య తీవ్రమైన భేదాలు మొదలయ్యాయి. ప్రజల ఆదాయ మార్గాలు, జీవనశైలితో సహా అన్నింటిలోనూ వెస్ట్ జర్మనీ మెరుగయింది. క్యాపిటలిస్టుల అదీనంలోని ప్రదేశాలు సుసంపన్నం అయ్యాయి. దాంతో ఈస్ట్ జర్మనీ వాసులు, ఈస్ట్ బెర్లిన్ వాసులు... వెస్ట్ జర్మనీ, వెస్ట్ బెర్లిన్ల వైపు దృష్టి సారించారు. వెస్ట్ జర్మనీ కూడా తమ దేశానికి రావాలనుకుంటున్న వాళ్లకు అభ్యంతరం చెప్పలేదు. వెస్ట్ బెర్లిన్ భౌగోళికంగా ఈస్ట్ జర్మనీలో ఉన్నప్పటికీ వెస్ట్ బెర్లిన్ చేరగలిగితే ఆ తర్వాత వెస్ట్ జర్మనీ వాసులుగా స్థిరపడడం సులువయ్యేది. దాంతో ఈస్ట్ జర్మనీవాసులు ఏదో ఒక రకంగా వెస్ట్ బెర్లిన్‌కి చేరేవారు. గోడను కట్టింది ఎవరు? రోజూ లక్షల మంది ప్రజలు ఈస్ట్ బెర్లిన్ నుంచి వెస్ట్ బెర్లిన్‌కు వెళ్లేవాళ్లు. ఉద్యోగం, వినోదం ఏదైనా వెస్ట్ బెర్లిన్లోనే దొరికేవి. కమ్యూనిస్టు విధానాలు అమలులో ఉన్న ఈస్ట్ బెర్లిన్‌లో వినోదాలు, విలాసాలే కాదు సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడంతో మహిళలు షాపింగ్‌కు కూడా వెస్ట్‌కు వెళ్లేవాళ్లు. దీంతో రష్యాలోని కమ్యూనిస్టు పాలకులు వలసలను నిరోధించడానికి గోడ కట్టడమే ప్రత్యామ్నాయం అనుకున్నారు. మాస్కోలో 1961 ఆగస్టు మూడు నుంచి ఐదవ తేదీ వరకు జరిగిన సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.పన్నెండవ తేదీ రాత్రి సంతకాలయ్యాక 13వ తేదీన నిర్మాణం మొదలైంది. గోడను 12 అడుగుల ఎత్తున కట్టారు. నిత్యం మిలటరీ పహారాలో ఉండే అంత ఎత్తు గోడనూ దాటి వెళ్లడానికి అది కూలేనాటి వరకు ఐదువేల మంది ప్రయత్నించగా వారిలో రెండు వందల మంది తూటాలకు బలయ్యారు. ‘వాళ్లింటికి వెళ్లొద్దు’ అని ఎంత చెప్పినా పౌరులు వినకపోవడంతో అడ్డు గోడ కట్టడమే మార్గం అనుకుంది ప్రభుత్వం. గోడను పడగొట్టింది ఎవరు? నిజానికి బెర్లిన్ గోడ పతనం దాని నిర్మాణంతోనే మొదలయింది! అయితే అది పూర్తిగా ధ్వంసం కావడానికి సుమారు మూడు దశాబ్దాల సమయం పట్టింది. బెర్లిన్ గోడకు వ్యతిరేకంగా కొనసాగుతున్న మూకుమ్మడి నిరసన ప్రదర్శనలు 1989 సెప్టెంబర్ చివరినాటికి ముమ్మరమయ్యాయి. పర్యవసానంగా అక్టోబర్ 18న తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పార్టీ అధినేత ఎరిక్ హోనేకర్ రాజీనామా చేయవలసి వచ్చింది. కొత్త ప్రభుత్వం పౌరులను పశ్చిమ జర్మనీలోకి అనుమతించడానికి ఒక కొత్త చట్టాన్ని సిద్ధం చేసింది. ఆ చట్టం 1989 నవంబర్ 9 రాత్రి 10.30 గంటలకు అమలులోకి వచ్చింది. బార్న్హాల్మర్ స్ట్రాస్ దగ్గర జనం గుమిగూడి సరిహద్దు ద్వారాలను తెరిపించారు. ►ఈస్ట్ బెర్లిన్‌లో వినోదాలు, విలాసాలే కాదు సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడంతో మహిళలు షాపింగ్‌కు కూడా వెస్ట్ బెర్లిన్‌కు వెళ్లేవాళ్లు! -
ఒకరి గెలుపు... మరొకరి ఓటమి కానేకాదు!
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఒకరి విజయంగా... మరొకరి పరాజయంగా చూడకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు దేశచరిత్రలో నూతనాధ్యాయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత బలమని మరోమారు నిరూపితమైందని, తీర్పును సమాజంలోని అన్నివర్గాలు సహృదయంతో ఆమోదించడమే ఇందుకు నిదర్శమని చెప్పారాయన. అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 9న బెర్లిన్ గోడ కూలిన ఘటనను ఆయన గుర్తు చేశారు. ఈ రోజే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమవుతోందని కూడా చెప్పారు. ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలనే సందేశం అందిన రోజని ఆయన చెప్పారు. అనవసర భయాలు, విద్వేషాలు, నెగిటివ్ ఆలోచనలు వదిలి జనమంతా సరికొత్త భారతావని నిర్మాణానికి కలిసిరావాలన్నారు. న్యాయ చరిత్రలో సువర్ణాధ్యాయం వందల ఏళ్లుగా నలుగుతున్న కీలక అంశంపై కోర్టు ఇచ్చిన తీర్పును మోదీ ప్రస్తుతించారు. ఈ విషయమై రోజూ విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని దేశమంతా కోరిందని, సుప్రీంకోర్టు ఈ కోరికను సమర్ధవంతంగా నెరవేర్చిందని తెలిపారు. ఈ రోజు భారత న్యాయచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం అందరి వాదనలు ఓపికతో విని ఏకాభిప్రాయ తీర్పునిచ్చిందన్నారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాదం తరాలుగా సాగుతూ వస్తోందని, కానీ తాజా తీర్పుతో కొత్త భారతావని నిర్మాణానికి పూనుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు మన ప్రజాస్వామ్యం ఎంత బలమైందో, ఎంత గొప్పదో ప్రపంచమంతా మరోమారు గుర్తిస్తుందన్నారు. ఇకపై అంతటా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. డ్రోన్లతో నిఘా.. అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసు శాఖ అప్రమత్తమయింది. ప్రత్యేక నిఘా కోసం డ్రోన్లను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ పౌరులు శాంతి, సామరస్యపూర్వకంగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో కార్యకలాపాలను కూడా గమనిస్తామని, వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా వివేకంతో వాడాలని, ఎవరూ ఎటువంటి అసత్యాలు గానీ, విద్వేషపూరిత ప్రచారం గానీ చేయవద్దని సూచించారు. ► యావద్భారత విజయం అయోధ్యపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వడం శుభపరిణామం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన విజయం. కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో అందరం భాగస్వామ్యం కావాలి. మన సంస్కృతి, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకొనేందుకు కృషి చేయాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ► సంయమనం పాటించాలి సాక్షి, అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన తర్వాతే తుది తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► ఈ తీర్పు ఓ మైలురాయి అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పును స్వాగతి స్తున్నాం. ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశ ఐక్యత, సమగ్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పును అన్ని వర్గాలు, మతాలు ప్రశాంత చిత్తంతో అంగీకరించాలి. ఒకే భారతదేశం– ప్రశస్త భారతదేశం నినాదానికి కట్టుబడి ఉండాలి. శ్రీరామ జన్మభూమి కోసం పోరాడిన సంస్థలకు, సాధు సమాజానికి, అసంఖ్యాక ప్రజలకు కృతజ్ఞతలు. హోంమంత్రి అమిత్ షా ► రాముడు అయోధ్యలో పుట్టాడని రుజువైంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడు పుట్టాడన్నది నిర్వివా దాంశం. సుప్రీంకోర్టు తీర్పుతో అదే విషయం మరోసారి రుజువైంది. కోర్టు తీర్పు సంతోషం కలిగించింది. కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్ ఆలయం మాదిరిగా అయోధ్యలో రామాలయం విశాలంగా ఉండాలి. శ్రీరాముని ఆశీస్సులు యావత్ భారతావనికి ఉండాలని ఆకాంక్షిస్తున్నా. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి ► అంతిమ విజయం ఈ తీర్పును ఆర్ఎస్ఎస్ స్వాగతిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు సరైన ముగింపు పలికింది. ఈ తీర్పు దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంది. సత్యం, న్యాయం అంతిమంగా గెలుస్తాయని నిరూపించింది. విభేదాలను మరిచి రామాలయ నిర్మాణానికి పనిచేయాలి. అయోధ్యకు సంబంధించి చారిత్రక ఆధారాలున్నందునే ముందుండి పోరాడాం. మథుర, వారణాసిలోని ఆలయాలకు సంబంధించిన ఇలాంటి వివాదాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోబోదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ► ఇరు వర్గాలకు ఊరట అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో హిందూ ముస్లిం వర్గాలకు ఊరట, సంతోషం కలిగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్య నుంచి హిందువులు, ముస్లింలకు సంతృప్తి కలిగించింది’అని ట్విట్టర్లో తెలిపారు. మసీదు నిర్మాణంలో ముస్లిం సోదరులకు హిందూ సోదరులు సాయం చేయడం ద్వారా ఐక్యతా భావం చూపాలి. అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీలో రవి శంకర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. శ్రీశ్రీ రవి శంకర్ -
గోడ కూలినచోట బంధాలు అతికేనా!
ఆవేశంతో ఊగిపోతున్న నిరసనకారులు సుప్రసిద్ధమైన బెర్లిన్ గోడను కూల్చివేసి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత, నగరం తిరిగి ఒకటిగా అల్లుకుపోయింది. ఇది ఐక్య జర్మనీ నూతన రాజధానిగా మాత్రమే కాకుండా, యూరప్ రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా అవతరించింది. (విడిపోయినప్పుడు పశ్చిమ జర్మనీ రాజధాని బాన్ నగరం). పాత తూర్పు బెర్లిన్ శివార్లలో భాగమైన ప్రెంజ్లయర్ బెర్గ్ ఇప్పుడు జర్మనీలోనే అత్యంత ఆకర్షణీయ ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఐస్ క్రీమ్ లాగిస్తున్న గుంపులు ట్రెప్టవర్ పార్క్‌లో, సోవియట్ యుద్ధంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన భారీకట్టడం వద్దకు వెళుతుండగా మరి కొందరు తూర్పు జర్మనీ పాత టీవీ టవర్ ఛాయలో రూపొందించిన కారల్ మార్క్స్, ఎంగెల్స్ భారీ విగ్రహాల వద్ద ఫోటోలు తీసుకోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు. కొనసాగుతున్న అవశేషాలు తూర్పు జర్మనీ ప్రభుత్వ వ్యవస్థను మొత్తంగా లొంగదీసుకుని బెర్లిన్ గోడను తెరువగలిగిన భారీ స్థాయి ప్రజాందోళనలకి 30 సంవత్సరాలు తర్వాతకూడా పాత బెర్లిన్ అవశేషాలు నేటికీ కొనసాగుతుండటమే కాదు.. ఇంకా వృద్ది చెందుతున్నాయి. కాకుంటే పాత బెర్లిన్‌లో ఇష్టానుసారంగా పరిణామాలు జరగటం లేదు. తూర్పు జర్మనీ పార్లమెంట్ భవనం అయిన పీపుల్స్ ప్యాలెస్ (ప్రజల ఉపయోగార్థం ఇక్కడ థియేటర్లు, రెస్టారెంట్లు, డిస్కో కూడా ఉండేవి)ని 2006–2008 మధ్య కాలంలో నాటకీయంగా కూల్చి వేశారు. ఆ కాలంలో అక్కడ గడిపి తమ మధురానుభూతులను పండించుకున్న చాలామందికి ఈ భవనం కూల్చివేతతో గుండె పిండినంత పనయింది. కొంతమంది తూర్పు జర్మన్ పౌరులు తమ గతానికి సంబంధించిన ముఖ్యమైన భాగాలు ఇప్పుడు తమ జ్ఞాపకాల దొంతర్లలో మరుగునపడిపోయాయని భావిస్తుండటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆనాటి సుపరిచితమైన ప్రకృతి చిత్రాలు, రంజింపజేసే పురాస్మృతులను ఇప్పుడు ఎయిర్ బ్రష్‌తో వాస్తవమైన వాటికంటే మించిన ప్రతిభతో చిత్రించారు. ఈ చిత్రాలు.. జాత్యహంకారపు నాజీ సామ్రాజ్యం, కమ్యూనిస్టు తూర్పు జర్మనీ రాజ్యంకి చెందిన రెండు నియంతృత్వాలతో కూడిన 20 శతాబ్దపు జర్మన్ ఏకాధిపత్య నిరంకుశ చరిత్రకు సమాన ప్రాతిపదికను కల్పిస్తుంటాయి. ఇంకా వింత గొల్పేదేమిటంటే ఆనాటి పార్లమెంట్ భవనం స్థానంలో ఒకప్పుడు అక్కడే నివసించిన జర్మన్ కైజర్ల ప్యాలెస్ ప్రతిరూపాన్ని ప్రతిష్టించడమే. కమ్యూనిస్టులు, నాజీలూ అడుగుపెట్టని కాలానికి చెందిన ఈ ప్యాలెస్‌లో రాజ రికపు గతాన్ని ప్రదర్శించే మ్యూజియం కూడా నెలకొల్పారు. వలసవాదపు కళాత్మక చిహ్నాలెన్నో దీంట్లో కనిపిస్తాయి. విస్తృతార్థంలో, పాత తూర్పు జర్మనీపై పాశ్చాత్యీకరణ మార్పు ప్రభావాలను ఇప్పుడు బెర్లి¯Œ లో స్పష్టంగా చూడవచ్చు. ప్రజల పాదార్థిక జీవన ప్రమాణాలు స్పష్టంగానే మెరుగుపడ్డాయి. పునరేకీకరణలో భాగంగా సంఘీభావ పన్ను విధిం పుద్వారా తూర్పు ముఖంగా వచ్చిపడిన బిలియన్ల కొద్దీ యూరోల కారణంగా తూర్పు ప్రాంతంలోని కొన్ని భాగాలు చాలా బాగా మెరుగుపడ్డాయి. అయితే వ్యవస్థాగత పునరభివృద్ధి ఇప్పటికీ ముళ్లబాటలోనే నడుస్తోంది. పాశ్చాత్య వలసీకరణపై తీవ్ర నిరసనలు తూర్పు జర్మనీలోని భారీ పరిశ్రమలను పశ్చిమ జర్మనీకి చెందిన ఆర్థిక పండితులు పట్టుబట్టి అమ్మివేయడం లేక మూసివేయడం చేసిన తీరు నూతన జర్మనీ దేశంలో పలు నిరసనలకు దారి తీసింది. పాశ్చాత్య వలసీకరణలో భాగంగా తూర్పు జర్మన్ కార్మికుల ఉద్యోగాలను పణంగా పెట్టి పశ్చిమ జర్మనీ ప్రాంతంలో పరిశ్రమలన్నింటినీ కేంద్రీకరించారంటూ ఐక్య జర్మనీలో పలువురు నిరసనకారులు నిరసిస్తున్నారు. ఈ సెంటిమెంటును అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐక్యమయ్యాక తూర్పు జర్మనీలో నిరుద్యోగం పరాకాష్టకు చేరింది. ఫలితంగా బెర్లిన్, లీప్జిగ్ వంటి నగరాలకు వెలుపల ఉన్న హిప్స్టెర్ హబ్లనుంచి అనేకమంది యువతీయువకులు చక్కటి కెరీర్లు, మంచి జీవన పరిస్థితులను అన్వేషిస్తూ పశ్చిమ జర్మనీ వైపు తరలిపోతున్నారు. రాజకీయంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో గుర్తించదగిన స్థాయిలో వ్యత్యాసాలున్నాయి. దీని వల్ల తక్కువ బహుళ సంస్కృతీ వ్యవస్థ కలిగిన తూర్పు ప్రాంతంలో అసాధారణ స్థాయిలో ఛాందసవాద తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతుం డటం గమనించవచ్చు. ఉదాహరణకు చెమింట్జ్ (పాత కార్్లమార్క్స్ సిటీ) పట్టణంలో 2018లో మితవాద పక్షాల ర్యాలీల సంఖ్య పెరిగింది. వీటిలో కొన్ని జాత్యహంకారానికి వ్యతిరేక ర్యాలీలు కూడా ఉన్నాయి. డ్రెస్డెన్ పట్టణంలో నాజీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎందుకంటే పట్టణంలో ప్రజాస్వామ్య వ్యతిరేక జాత్యహంకారులతో పోరాడక తప్పని స్థితి. పాత తూర్పు జర్మనీకి చెందిన థురిగింయాలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కరడుగట్టిన మితవాద పక్షమైన ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ’ రెండో స్థానంలో నిలిచింది. తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న కారణంగా పశ్చిమ జర్మనీలో ఎన్నికల్లో గెలవలేకపోతున్న లెఫ్ట్ పార్టీ తూర్పు జర్మనీ ప్రాంతంలో మాత్రం అనేక సంవత్సరాలుగా ప్రజాకర్షక ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ (ఎఎఫ్‌డి) తూర్పు జర్మనీ ప్రాంతంలో గణనీయంగా మెరుగుపడింది పైగా అది తూర్పుకు మాత్రమే పరిమితం కాలేదు. ఆశ్చ ర్యమేమిటంటే ఈ పార్టీ ప్రముఖ నేత జోర్న్ హోకె పశ్చిమ జర్మనీలోని పారిశ్రామిక కేంద్రమైన రుర్ ప్రాంతానికి చెందినవాడు. నియో నాజీల హింస జర్మనీలో పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా తీవ్ర ఛాందసవాద మారణ కాండవైపు ఇలాంటి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. మితవాదమే అసలైన ప్రమాదం వలసల అనుకూల సీడీయూ నాయకుడు వాల్టర్ లుబేక్ను నాజీ అనుకూల ముఠాలు ఈ సంవత్సరం చంపేయడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ హత్య పశ్చిమ జర్మనీలోని కాజెల్ పట్టణంలో జరగటం గమనార్హం. తూర్పు జర్మనీలో మౌలిక వసతుల పునరుద్దరణ, పశ్చిమ జర్మనీని తలపించే జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో పాత తూర్పు జర్మనీ రాష్ట్రాల్లోని రాజకీయ, సామాజిక జీవితానికి నిజమైన ప్రమాదం ఏర్పడనుంది. ఇది జర్మన్లందరి భవిష్యత్తుకూ ప్రమాద హేతువే. మేట్ ఫిట్జ్‌పాట్రిక్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొపెసర్, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఫ్లిండర్స్ యూనివర్సిటీ -
బెర్లిన్ గోడను కూల్చింది ఈ రోజే..
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ప్రజలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లకుండా, రాకుండా నిర్మించిన 96 మైళ్ల బెర్లిన్ గోడ్‌ను కూల్చేందుకు పూనుకున్నది నేడే. అంటే 1989, నవంబర్ 9వ తేదీ నాడు. ఆ గోడను కూలగొట్టడానికి మూడు రోజులు పట్టింది. అది కూలిన మరుక్షణం నుంచే తూర్పు జర్మనీ ప్రజలు తండోపతండాలుగా దాదాపు 30 లక్షల మంది పశ్చిమ జర్మనీ వెళ్లారు. మరో మూడు రోజుల్లోనే వారిలో ఎక్కువ మంది వెనక్కి తిరిగి వచ్చారు. తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు ప్రభుత్వం, పశ్చిమ జర్మనీలో మితవాద ప్రభుత్వం ఉండడంతో ఇరు దేశాల మధ్య అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొని ఉండేవి. ఆర్థికంగా వెనకబడిన తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు పాలకులు కఠిన చట్టాలను అమలు చేస్తుండడంతో అక్కడి ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందిన పశ్చిమ జర్మనీకి వలసలు పోయేవారు. రానురాను ఈ వలసలు మరీ ఎక్కువవడంతో జర్మనీ డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా పిలిచే తూర్పు జర్మనీ ప్రభుత్వం రెండు దేశాల సరిహద్దులో గోడను కట్టాల్సిందిగా తన సైనికులను ఆదేశించింది. దాంతో వారు 1961, ఆగస్టు 13న గోడ నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య 200 రోడ్లను బ్లాక్ చేశారు. బారికేట్లు, తీగలతో మొదలైన 96 మైళ్ల ఈ గోడ ఆ తర్వాత కాంక్రీటు రూపం సంతరించుకుంది. రానురాను తూర్పు జర్మనీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. 1989 నాటికి పశ్చిమ జర్మనీతో పోలిస్తే దేశీయ దిగుబడి 40 శాతానికి పడిపోయింది. అదే ఏడాది అక్టోబర్‌లో అప్పటి రష్యా అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచ్చేవ్, తూర్పు జర్మనీలో పర్యటించగా, ‘గోర్బీ హెల్ప్ అస్, గోర్బీ హెల్ప్ అస్’ జీడీర్ ప్రజలు నినాదాలు చేశారు. ఆ మరుసటి నెలలోనే ప్రజలు బెర్లిన్ గోడను కూల్చేందుకు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ప్రజాగ్రహాన్ని గమనించిన జీడీఆర్ ప్రభుత్వం దేశ పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. -
పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ‘బెర్లిన్’ గోడ
క్వెట్టా : బెర్లిన్ వాల్ తరహాలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో గోడ కట్టేందుకు పాకిస్తాన్ సమాయత్తమవుతోంది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దు గ్రామాల్లో అత్యధికంగా ఫష్తూన్ తెగకు చెందిన గిరిజనులు నివాసముంటున్నారు. ఆఫ్ఘన్, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ వీరిని పట్టించుకున్న దాఖలాలు లేదు. ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో గోడ నిర్మించి.. తమ దేశం పరిధిలోని ప్రజలను లోపలకు ఆహ్వానించాలనుకుంటోంది. పాక్-ఆఫ్ఘన్ దేశాల మధ్య 2,500 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతముంది. ఈ సరిహద్దు నుంచి ఉగ్రవాదులు దేశంలోపలకు చోరబడి విధ్వంసాలను సృష్టిస్తున్నారు.. వీరిని అడ్డుకునేందుకు బెర్లిన్ వాల్ తరహాలోనే గోడను నిర్మిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. భారత్ నుంచి ఆఫ్ఘన్ విడిపోయిన తరువాత అంటే బ్రిటీష్ కాలంలో 1893లో ఏర్పాటు చేసిన డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ ఈ గోడను నిర్మిస్తోంది. పాకిస్తాన్ నిర్మించతలపెట్టిన గోడపై ఆఫ్ఘనిస్తాన్ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. విభజిత గ్రామాలుగా పిలుస్తున్న వీటిలో ఫస్తూన్ తెగలోని పలువురికి పాస్‌పోర్టులు ఉన్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని చమన్ జిల్లాలోని 7 గ్రామాల ప్రజలు తరచూ సరిహద్దులు దాటుతూ ఉంటారు. వీరు పాకిస్తాన్ సార్వభౌమాధికారిన్ని అంగీకరించరని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బలూచిస్తాన్ ప్రజలను పూర్తిగా పాకిస్తాన్ ప్రజలుగానే గుర్తిస్తామని చమన్ జిల్లా సరిహద్దు ఫ్రాంటియర్ కార్ప్స్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ కల్నల్ మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు కూడా గోడను నిర్మించడం వల్ల.. ఇటు వైపు ఉన్నది పాకిస్తాన్.. అటు వైపు ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ అని తేలిగ్గా గుర్తించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. సరిహద్దుల్లో గోడ నిర్మించాలని 1989నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా.. అది ఇప్పటికి సాకారమయిందని ఆయన చెప్పారు. -
మళ్లీ కూలిన బెర్లిన్ గోడ
భారత్, బంగ్లా ఇరుదేశాల ఎన్క్లేవ్లలో ఉన్న పిల్లలంతా భావి అవిద్యావంతులు. అటు వంటి వీరికి మీరు ఏ దేశ పౌరసత్వాన్ని కావాలంటే ఆ దేశ పౌరసత్వాన్ని ఎంచుకోవచ్చు అని ప్రకటించడం ఎంత గొప్ప వరమో బయటి వారికి బహుశా చెప్పినా అర్థం కాదు. బంగ్లాదేశ్‌తో చేసుకున్న సరిహద్దు మారకం గురించి ప్రధా ని మోదీ ఒక మాట అన్నారు ‘‘ఇది బెర్లిన్ గోడ కూలగొట్ట డం లాంటిది’’ అని. ఎన్నో ఏళ్ల నుండి రాజ్య రాహిత్యంతో బాధపడుతూ కష్టాల కడలికి ఎదురీదుతున్న ఇరు ఎన్క్లేవ్ (పరదేశ పరివేష్టిత భూభా గం) లలోని ప్రజలకే కాదు.. వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసి వచ్చిన నా లాంటి వాళ్లకూ నరేంద్ర మోదీ వాడిన ఆ పోలిక అచ్చుగుద్దినట్లు సరిపోయిందనిపిస్తుంది. మోదీ ఆ పోలిక తీసుకురావడం వెనుక ఉన్నది మమతా బెనర్జీ ప్రజాపక్షపాత మనస్తత్వం. 2012లో 76 ఏళ్ల స్త్రీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు నేను కూచ్ బిహార్ జైలుకి వెళ్లాను. ఆమె ఇండియాకి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ నుండి వైద్యపరీక్షల కోసమని అక్రమంగా ఇండియాలోకి ప్రవేశిస్తూ జైలు పాలయింది. ఏళ్లు గడిచినా బయటపడే ఉపాయం లేక విరక్తితో ఆ వయసులో ఆత్మహత్య చేసుకుంది. నేను వెళ్లిన ఆ జైలు మొత్తం అలాంటి వాళ్లతో నిండి ఉంది. వాళ్లలో పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలలో కొంత మంది, వాళ్ల తల్లులు కాన్పుకి భారతదేశ హాస్పిటల్లో చేరే నిమిత్తం అక్రమంగా సరిహద్దు దాటుతూ ఉంటే పట్టుబడి జైలు పాలయ్యాక జైలులో పుట్టిన వారు. కుప్ప లు తెప్పలుగా ఉన్న వారందరూ అయిన వారితో ఒక్క మాట మాట్లాడటం కోసం నా ఫోన్‌ని యాచించి వరు సలో నిలబడ్డప్పుడు వారి ఆ దయనీయత నాకు ‘‘భార త్ బంగ్లాదేశ్ చిట్ మహల్ వినిమయ్ కమిటీ’’ని తెలు సుకునేలా చేసింది. కమిటీ సెక్రటరీ దీప్తిమాన్ సేన్ గుప్తో నన్ను చిట్ మహల్లని పిలువబడే బంగ్లాదేశ్ ఎన్క్లేవ్లకి తీసుకెళ్లారు. ఎప్పుడో రంగ్‌పూర్ రాజు, కూచ్ బిహార్ రాజు చీట్లాట ఆడుకుని గెలిచి, ఓడిన గ్రామాలివి అన్నారు స్థానికులు. చరిత్ర కూచ్ బిహార్, మొఘల్ రాజుల మధ్య అపరిష్కృత ఒడంబడిక అంటుంది. కారణాలేవయినా వారిప్పుడు రాజ్యమనే పెద్ద దిక్కులేని దీనులు. ఈ 21వ శతాబ్దంలో కరెంటు, బడి, హాస్పిటల్, రవాణా, ఫోను వంటి ప్రాథమిక సౌకర్యాలేవీ వారికి అందుబాటులో లేవు. ఎన్క్లేవ్ అంటే అచ్చంగా జంతువుల బదులు మనుషులు నివసిస్త్తున్న ఒక చిట్టడవి అంతే. నేను వెళ్లిన పువాతుర్ కుటి తదితర ఎన్క్లేవ్లు పెద్దవి. ఇవికాక కౌంటర్ ఎన్క్లేవ్లు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు మొదటి అడుగు ఇండియాలోనూ రెండో అడుగు బంగ్లాదేశ్‌లోనూ మూడో అడుగు మళ్లీ ఇండి యాలోనూ వేసి ఒక సంక్లిష్ట సరిహద్దు చిత్రాన్ని అనుభ వించవచ్చు. అందరమూ మనుషులమే అయినప్పటికీ మనకు మనమే ఏర్పరచుకున్న ఆ గందరగోళం దిగు లును కలిగిస్తుంది. మాటలలో అక్కడి స్త్రీలు స్త్రీగా నాతో ఒక విషయం పంచుకున్నారు. ‘‘కాన్పుకి ఎలాగో అక్ర మంగా ఇండియాకి వెళ్తాం కానీ హాస్పిటల్లలో ఏమని చెప్తాం. అందుకని ముందే ఫలానా ఇండియా వ్యక్తి ఈమె నా భార్య అని చెప్పేటట్లు మాట్లాడుకుంటాం. నువ్వు చెప్పు ఒక ఆడదానికి భర్త బతికి ఉండగా ఇంకొక మగవాడిని భర్తగా చెప్పుకోవడమెంత అసహ్యం’’ అని. రాజ్య పెత్తనం లేదు కనుక ఇక్కడ గంజాయి సాగు విరివిగా సాగుతుంది. కొనుగోలుదారులు ఢిల్లీ నుండి వస్తారు. అరాచకశక్తులు అవసరమొచ్చినప్పుడు ఇక్కడే తలదాచుకుంటాయ్. ఈ గందరగోళంలో ఎలా తలదూ ర్చాలో అర్థం కాక ఎన్జీవోలు మిన్నకుండిపోయాయ్. ఆశావహులు కొందరు అక్రమంగా తమ పిల్లల్ని బడు లకి పంపించడం అడపాదడపా కనిపిస్తుంది కానీ అక్క డి పిల్లలంతా భావి అవిద్యావంతులు. అటువంటి వీరికి మీరు ఏ దేశ పౌరసత్వాన్ని కావాలంటే ఆ దేశ పౌరస త్వాన్ని ఎంచుకోవచ్చు అని ప్రకటించడం ఎంత గొప్ప వరమో బయటి వారికి బహుశా చెప్పినా అర్థం కాదు. శరీరం లేకుండా అవయవానికి ఎలా మనుగడ లేదో రాజ్యం లేకుండా మనిషికి అలా మనుగడలేదు అంటా డు ప్లేటో. ఆ విషయాన్ని ఎన్క్లేవ్ ప్రజలు రుజువు పరచారు. మనం ఈ ఎన్క్లేవ్లని ఇవి ఇండియావి ఇవి బంగ్లా దేశ్వి అని పేరు పెట్టుకున్నాం. అలా పిలిచిన తరువాత సంక్షేమ భాధ్యతలు చేపట్టాల్సిన బాధ్యత కలిగిన రాజ్యాలుగా ఈ సమస్య పరిష్కారానికి ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు తీసుకున్నాం? 1958లో నెహ్రూ నూన్ ఒప్పందం సమయంలో చట్టసభల అనుమతి అవ సరమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు 9వ సవ రణ పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి 9వ సవరణ నుండి మనం ఈ సమస్య పరిష్కారానికి 100వ సవరణ వరకూ ఎందుకు ప్రయాణించా ల్సివచ్చింది? మిగిలిన సరిహద్దు మారకాలు బంగ్లాదేశ్‌తో చేసు కున్నంత సులభమైనవి కావు. బంగ్లాదేశ్‌తో మనకు మొదటి నుండీ స్నేహ సంబంధాలే ఉన్నాయి . చైనా తోనూ, పాకిస్తాన్‌తోనూ అలా కాదు. ప్రజల ఉద్వేగాలే కాదు, అనేక విషయాలతో కూడిన సంక్లిష్ట చిక్కుము డుల కూడిక అవి. కానీ అంతిమంగా చూస్తే ఈ దేశాలు, సరిహద్దులు ప్రజల రక్షణ, సంక్షేమం కోసం చేసుకున్న ఒడంబడికలు అవి భస్మాసురుడి లాగా మన నెత్తినే చెయ్యి పెట్టే పరిస్థితి రాకుండా చూసుకోవడం మన బాధ్యతే. ఆయా ప్రాంతాల ప్రజలని, మిలటరీ నుండీ, అర్థం కాని అయోమయ అస్తిత్వ చిక్కు ప్రశ్నల నుండి రక్షించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. మరిన్ని బెర్లిన్ గోడలు వెంట వెంటనే కూలాలి. (వ్యాసకర్త రచయిత్రి) మొబైల్: 80196 00900 - సామాన్య