ఉత్తమ జెడ్పీ చైర్మన్‌గా చమన్
అనంతపురం సిటీ : దేశంలోనే 9 మందిని ఉత్తమ జెడ్పీ చైర్మన్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, అందులో అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్ కూడా ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వానికి వివరాలు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం జెడ్పీ ఆవరణలో జరిగిన జ్యోతిరావ్ పూలే విగ్రహావిష్కరణలో ఎంపీ నిమ్మల, మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పలువురు ఎమ్మెల్యేలు చమన్‌ను అభినందించారు.