Bethanie Mattek Sands
-
రిటైర్మెంట్కు ముందు సానియా మీర్జాకు పరాభవం
రిటైర్మెంట్కు ముందు జరిగిన అబుదాబి ఓపెన్ టెన్నిస్ టోర్నీ-2023లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పరాభవం ఎదురైంది. ఈ టోర్నీలో బెథానీ మాటెక్ (అమెరికా)తో బరిలోకి దిగిన హైదరాబాదీ తొలి రౌండ్లోనే నిష్క్రమించి అబాసుపాలైంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా–బెథానీ ద్వయం 3–6, 4–6తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)–లౌరా సిగెముండ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. సానియా–బెథానీలకు 4,350 డాలర్లు (రూ. 3 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కాగా, ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌తో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు సానియా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. -
Wimbledon 2021: సానియా జోడీ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా శుభారంభం చేసింది. నాలుగేళ్ల తర్వాత ఈ టోర్నీ బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. అమెరికా ప్లేయర్ బెతాని మ్యాటెక్ సాండ్స్‌తో కలిసి అద్భుత విజయం సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా- బెతాని జోడీ 7-5, 6-3 తేడాతో ఆరో సీడ్ అలెక్సా గౌరచి(చిలీ)- డిసారియ క్రాక్జిక్(అమెరికా) జోడీపై వరుస సెట్లలో గెలుపొందింది. గంటా 28 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ అలవోకగా విజయాన్నందుకుంది. సానియా కెరీర్లో ఇది 121 విజయం కాగా.. ఈ మ్యాచ్‌లో ఆమె ఒక్క ఏస్ మాత్రమే సంధించింది. సానియా.. వింబుల్డన్‌లో 2017లో చివరిసారిగా బరిలోకి దిగింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న ఈ మెగా గ్రాండ్‌స్లామ్ టోర్నీ సానియాకు చాలా కీలకంగా మారింది. కెరీర్ చరమాంకంలో ఉన్న 34 ఏళ్ల సానియా.. ఈ వింబుల్డన్‌లో ఎలాగైనా విజయం సాధించి విశ్వక్రీడల బరిలో నిలవాలని ప్లాన్ చేస్తుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ద్వారా భారత్తరఫున నాలుగు ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించనుంది. ఇదిలా ఉంటే, 2018లో ఇజాన్‌కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్గెలిచి సెకండ్ఇన్నింగ్స్ఘనంగా ప్రారంభించిన ఈ పాక్ కోడలు.. ఆతర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. -
తొలి రౌండ్లోనే సానియా జంట ఓటమి
ఈస్ట్‌బార్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈస్ట్‌బార్న్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సానియా–మ్యాటెక్ సాండ్స్ జోడీ 3–6, 4–6తో అమెరికా ద్వయం సబ్రినా శాంటామరియా–క్రిస్టీనా మెక్‌హాలె చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
శభాష్... సానియా
• బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్న భారత స్టార్ • బెథానీకి నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన వైనం • 91 వారాల తర్వాత చేజారిన అగ్రస్థానం • ఇండో–అమెరికన్ జంట ఖాతాలో రూ. 31 లక్షల 89 వేల ప్రైజ్‌మనీ విజయం సాధిస్తే ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరుతుంది. అదే సమయంలో వరుసగా 91 వారాల నుంచి ఉన్న టాప్ ర్యాంక్ కూడా చేజారుతుంది. అదీ తన భాగస్వామిగా ఉన్న సహచర క్రీడాకారిణికి అగ్రస్థానం ఖాయమవుతుంది. ఇలాంటి సంకట పరిస్థితిని ఎదుర్కొన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాను నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోతాననే విషయాన్ని లెక్క చేయలేదు. గొప్ప క్రీడాస్ఫూర్తితో, ఆద్యంతం సమన్వయంతో ఆడుతూ విజయాన్ని దక్కించుకుంది. అమెరికాకు చెందిన తన డబుల్స్ పార్ట్‌టైమ్ భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ చిరకాల స్వప్నం నెరవేరేందుకు ప్రత్యక్షంగా సహకరించి ఔరా అనిపించింది. బ్రిస్బేన్: కొత్త ఏడాదిని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఘనంగా ప్రారంభించింది. బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ బ్రిస్బేన్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తన డబుల్స్ రెగ్యులర్ భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) అందుబాటులో లేకపోవడంతో... తన పార్ట్‌టైమ్ భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలసి సానియా ఈ టోర్నీలో ఆడింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ ఈ ఇండో–అమెరికన్ జంట విజేతగా నిలిచింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ టైటిల్ పోరులో సానియా–బెథానీ ద్వయం 6–2, 6–3తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా–ఎలీనా వెస్నినా (రష్యా) జంటను ఓడించింది. బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గడం సానియాకిది మూడోసారి. గతంలో ఆమె బెథానీతోనే కలసి 2013లో, హింగిస్‌తో జతగా 2016లో ఈ టైటిల్‌ను గెలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 41వ డబుల్స్ టైటిల్‌కాగా... బెథానీ ఖాతాలో ఇది 23వ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సానియా–బెథానీ జంటకు 46,796 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 31 లక్షల 89 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన మకరోవా–వెస్నినా జోడీకి 24,950 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 17 లక్షలు), 305 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బెథానీకి అధికారికంగా నంబర్‌వన్ స్థానం లభిస్తుంది. క్వార్టర్ ఫైనల్లో మినహా మిగతా రెండు మ్యాచ్‌ల్లో అలవోకగా నెగ్గి ఫైనల్‌కు చేరుకున్న సానియా–బెథానీ జంటకు ఫైనల్లో ఒకింత ప్రతిఘటన ఎదురైంది. అయితే కీలక సమయాల్లో సహనం కోల్పోకుండా ఆడిన ఈ ఇండో–అమెరికన్ జంటకు విజయం దక్కింది. తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సానియా–బెథానీ తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయారు. కేవలం బ్రిస్బేన్ టోర్నీకి మాత్రమే బెథానీతో సానియా జత కట్టింది. సోమవారం మొదలయ్యే సిడ్నీ ఓపెన్‌లో, ఈనెల 16న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బార్బరా స్ట్రికోవాతో కలసి సానియా ఆడుతుంది. ఈ రెండు టోర్నీల్లోనూ సానియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. లెక్క సరిచేశారు... గత ఏడాది అక్టోబరులో జరిగిన సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో బెథానీకి టాప్ ర్యాంక్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)తో కలసి ఈ టోర్నీలో ఆడిన బెథానీ ఫైనల్లో గెలిచి ఉంటే ఆమెకు నంబర్‌వన్ ర్యాంక్ దక్కేది. కానీ మకరోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో బెథానీ–సఫరోవా ద్వయం ఓడిపోవడంతో ఈ అమెరికా క్రీడాకారిణి కల చెదిరింది. అదే టోర్నీలో సానియా–హింగిస్ జంట సెమీఫైనల్లో మకరోవా–వెస్నినా చేతిలో ఓడిపోయింది. అయితే బ్రిస్బేన్ ఓపెన్‌లో విజయం సాధించి సానియా, బెథానీ ఒకేసారి రష్యా జంటపై బదులు తీర్చుకున్నారు. సానియా ర్యాంక్ ఎలా చేజారిందంటే.... ఈ టోర్నీకి ముందు సానియా 8,135 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... బెథానీ 7,805 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. వీరిద్దరి మధ్య 330 పాయింట్ల తేడా ఉంది. అయితే గత ఏడాది బ్రిస్బేన్ ఓపెన్‌లో సానియా టైటిల్ గెలిచినందుకు ఆమె ఖాతా నుంచి 470 పాయింట్లు కోత కాకుండా ఉండాలంటే ఈ టైటిల్‌ను సానియా నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సానియా టైటిల్ నిలబెట్టుకోవడంతో ఆమె పాయింట్లలో ఎలాంటి మార్పు ఉండదు. మరోవైపు బెథానీ బ్రిస్బేన్ ఓపెన్‌లో ఆడలేదు కాబట్టి ఆమె ఖాతాలో అదనంగా 470 పాయింట్లు చేరాయి. ఫలితంగా ఐదో ర్యాంక్‌లో ఉన్న బెథానీ ఒక్కసారిగా నాలుగు స్థానాలు ఎగబాకి 8,275 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించనుంది. సెరెనా, వీనస్ తర్వాత... డబ్ల్యూటీఏ 1984లో డబుల్స్ ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టాక నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న 34వ క్రీడాకారిణిగా బెథానీ గుర్తింపు పొందనుంది. 2010 జులైలో సెరెనా, వీనస్ తర్వాత డబుల్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలువనున్న అమెరికా ప్లేయర్‌గా బెథానీ ఘనత వహించనుంది. -
సెమీస్‌లో సానియా–బెథానీ జోడీ
బ్రిస్బేన్: ఈ ఏడాది ఆడుతున్న తొలి టోర్నమెంట్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తన భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలసి బ్రిస్బేన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన డబుల్స్ రెండో రౌండ్లో సానియా–బెథానీ ద్వయం 6–4, 4–6, 10–5 తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇరీనా బెగూ (రొమేనియా) –దరియా కసత్కినా (రష్యా) జంటపై గెలిచింది. క్లెపాక్ (స్లొవేనియా)–మరియా జోస్ (స్పెయిన్), సు వీ సెయి (చైనీస్ తైపీ)–లారా సిగెమండ్ (జర్మనీ)ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సానియా జోడీ తలపడుతుంది. సానియాకు సంకటం: గత 91 వారాలుగా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అప్రతిహతంగా దూసుకుపోయిన సానియా మీర్జా తన అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. మ్యాచ్ ఓడితే కాకుండా... సానియా మరో విజయం సాధిస్తే అది ఆమెను నంబర్‌వన్ నుంచి దూరం చేయనుండటం ఆసక్తికరం పరిణామం! అదీ ఆమె భాగస్వామిగా ఈ టోర్నీ ఆడుతున్న బెథానీ నంబర్‌వన్ స్థానానికి చేరుకునే అవకాశ ముంది. ఈ టోర్నీలో సానియా–బెథానీ జోడి ఫైనల్లోకి ప్రవేశిస్తే బెథానీ నంబర్‌వన్ అవుతుంది. సానియా రెండో స్థానానికి పడిపోతుంది. ఈ వివరాలు సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా వెల్లడించారు. -
పాత భాగస్వామితో కొత్త సీజన్
బెథానీతో బ్రిస్బేన్ టోర్నీలో సానియా న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సీజన్‌ను తన పాత భాగస్వామితో కలిసి మొదలుపెట్టనుంది. జనవరి 1 నుంచి 7 వరకు ఆస్ట్రేలియాలో జరిగే బ్రిస్బేన్ ఓపెన్‌లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా మీర్జా ఆడనుంది. ఈ ఏడాది మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్‌ను సాధించింది. మహిళల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న ఈ హైదరాబాద్ క్రీడాకారిణి గతంలో బెథానీతో కలిసి నాలుగు టోర్నీల్లో విజేతగా నిలిచింది.