bettalion
-
భారీ ఎన్కౌంటర్.. నలుగురు జవాన్లు మృతి
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరాటంలో నలుగురు జవాన్లు అమరులవ్వగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పీ సుందరాజ్ మాట్లాడుతూ.. 114వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల నేపథ్యంలో కాంకేర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని ధ్రువీకరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, కాల్పులకు దిగిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నమని ఆయన తెలిపారు. -
ఏపీఎస్పీ పటాలం ప్రతిష్ట పెంచండి
– ఏపీఎస్పీ కమాండెంట్ విజయకుమార్ కర్నూలు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలం ప్రతిష్టను మరింత పెంచాలని కమాండెంట్ విజయకుమార్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం బీ కంపెనీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఐ సమర్పణరావు, ఆర్ఎస్ఐ కేశవరెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో కూర్చోని రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డ్సు, డ్యూటీ రోస్టర్, డైలీ ప్రోగ్రామ్ రిజిస్టర్, నగదు లావాదేవీలకు సంబంధించిన రిజిస్టర్, స్టోర్ బుక్, పరేడ్ తదితర రికార్డులను తనిఖీ చేశారు. పటాలంలో హెడ్‌క్వాటర్ కంపెనీతో కలిపి మొత్తం 8 కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో 95 మంది సిబ్బంది పని చేస్తున్నారు. విధి నిర్వహణలో వాటికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో, విధుల నిర్వహణలో అలసత్వం తగదని సిబ్బందికి హెచ్చరించారు.