ఏపీఎస్పీ పటాలం ప్రతిష్ట పెంచండి
ఏపీఎస్పీ పటాలం ప్రతిష్ట పెంచండి
Published Wed, Sep 21 2016 9:33 PM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM
– ఏపీఎస్‌పీ కమాండెంట్ విజయకుమార్
కర్నూలు: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ఏపీఎస్‌పీ కర్నూలు రెండవ పటాలం ప్రతిష్టను మరింత పెంచాలని కమాండెంట్ విజయకుమార్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం బీ కంపెనీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ సమర్పణరావు, ఆర్‌ఎస్‌ఐ కేశవరెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో కూర్చోని రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డ్సు, డ్యూటీ రోస్టర్, డైలీ ప్రోగ్రామ్ రిజిస్టర్, నగదు లావాదేవీలకు సంబంధించిన రిజిస్టర్, స్టోర్ బుక్, పరేడ్ తదితర రికార్డులను తనిఖీ చేశారు. పటాలంలో హెడ్‌క్వాటర్ కంపెనీతో కలిపి మొత్తం 8 కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో 95 మంది సిబ్బంది పని చేస్తున్నారు. విధి నిర్వహణలో వాటికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో, విధుల నిర్వహణలో అలసత్వం తగదని సిబ్బందికి హెచ్చరించారు.
Advertisement
Advertisement