breaking news
Bhadrapada month
-
తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?
ఈ సందేహం దాదాపు అందరికీ కలుగుతుంది. ఎందుకంటే, మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం...ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలని చెబుతోంది శాస్త్రం... పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృ యఙ్ఞాన్ని నిర్వహిస్తాడు... పుత్రులు లేనివారి సంగతి ఏమిటి మరి? వారి గతి అథోగతేనా? అంటే..కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు...లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు...అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. ఎలా పెట్టాలంటే..?సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరం) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. మహాలయం పెట్టలేని పక్షంలో కనీసం గతించిన పెద్దలను తలచుకుని వారి పేరు మీదుగా శక్తిమేరకు శుచిగా వంట చేసి భోజనాలు పెట్టాలి. ఇలాంటి క్రతువులపై విశ్వాసం లేనివారు కూడా పేదలకు అన్నదానం చేయడం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, శునకాలకు, కాకులకు ఆహారం పెట్టడం మంచిది. మహాలయ పక్షాలలో శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రవచనం. (సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు మహాలయ పక్షాలు) (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే..
భాద్రపద పౌర్ణమి, ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం(Chandra Grahan) ఏర్పడనుంది. గతంలో ఒకటి రెండు గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం మన దేశంలో లేదు. ఈ ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది. గ్రహణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలనే దానిపై పండితులు చెప్పిన వాటిలో ముఖ్యాంశాలు. ఆదివారం,7న రాత్రి 9:58 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు మూడున్నర గంటలు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం.సూతక కాలం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏం చేయాలి?హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి, గ్రహణ సమయంతో పాటు, గ్రహణం తరువాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12.57 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తరువాత తలుపులు తెరిచి యథావిధిగా పూజలు చేస్తారు. రాహుకేతు పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటాయిపాటించాల్సిన నియమాలు ఏంటంటే...గ్రహణం రోజున సూతక కాలం ఆరంభం అయినప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు. ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేక΄ోతే ΄ాలు, పండ్ల రసం వంటివి తీసుకుంటారు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం.గ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. వీలైనంత వరకు భగవన్నామ స్మరణ, ధ్యానం మంచిది. .దానాలు శ్రేష్టంచంద్ర గ్రహణం ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహణ సమయంలోనూ, ఆ తర్వాతా చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శక్తిమేరకు బట్టలు, ఆహారం, ధాన్యం, డబ్బు దానం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నమ్మకం. అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ ఆదివారం రానున్న చంద్ర గ్రహణం రోజు మనం కూడా పెద్దలు, శాస్త్రాలు చెప్పిన పరిహారాలు పాటించడం శ్రేయస్కరం. దైవారాధన ఎలా?గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్యపూజ చేసుకోవాలి. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
నేను... భాద్రపద మాసాన్ని...
చాంద్రమానం ప్రకారం పున్నమి చంద్రుడు ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర నక్షత్రాలలో సంచరిస్తుంటాడు కాబట్టి నాకా పేరు వచ్చింది. మొదటి పదిహేను రోజులూ దేవతల పక్షం... రెండో పదిహేను రోజులూ పితృదేతల పక్షంగా నన్ను అంటే భాద్రపద మాసాన్ని గుర్తుంచుకుంటారందరూ. అయితే నన్ను శూన్యమాసమని, శుభకార్యాలకు పనికిరానని చాలామంది చిన్నచూపు చూస్తారు కానీ, దేవతలలో ప్రథమ పూజనీయుడైన వినాయకుడు ఉద్భవించినదీ, విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇచ్చి, లోకపూజ్యుడిని చేసిందీ ఈ మాసంలోనే అని ఎవరికీ గుర్తురావెందుకో! వినాయక చవితి మర్నాడే కదా, సప్తరుషులను స్మరించుకునే ఋషిపంచమీ వ్రతం చేసుకునేది అందరూ! అంతేనా..? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని వరాహ, వామనావతారాలు ధరించింది నా మాసంలోనే కదా! ఇంకా పరివర్తన ఏకాదశి, అనంత పద్మనాభస్వామి వ్రతం, ఉండ్రాళ్ల తదియ వంటి ఎన్నో పర్వదినాలు కూడా నా హయాంలోనే కదా అందరూ జరుపుకునేది! ఒక్కోమాసం లో ఒక్కో దేవతకు ప్రాధాన్యమిచ్చే మన ఆచార సంప్రదాయాలు భాద్రపద మాసంలో పితృదేవతలకు పెద్దపీట వేశాయి. మీ మనుషులకు ఒక సంవత్సరం పితృదేవతలకు ఒకరోజుతో సమానం. అందుకే ఏడాదికోసారి వారికి తద్దినం పెట్టడం లేదా తర్పణలు విడవడం సంప్రదాయం. అయితే కొన్ని వర్ణాలలో ఇలా తద్దినాలు పెట్టే అవకాశం, అలవాటు ఉండదు. అటువంటివారు నేను జరిగే పౌర్ణమి వెళ్లిన పాడ్యమి నుంచి అమావాస్య వరకు... దీనికే మహాలయపక్షమనీ, పితృపక్షమనీ పేరులెండి. ఈ కాలంలో ఇతర లోకాలలో ఉన్న తలిదండ్రులు, తాతముత్తాతలు, ఇతర బంధుమిత్రులకు తర్పణ వదిలి, వారి పేరు మీదుగా పేదలను లేదా బంధుమిత్రులను పిలిచి అన్నం పెడుతుంటారు. అలా పెడితే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. మీ నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాల మాటెలా ఉన్నా, కనీసం పదిమంది పేద ల కడుపు నింపేందుకు అవకాశం కలుగుతున్నది నా మాసంలోనే కదా అనే ఆనందంతో నా గుండె నిండుతుంది. అసలు మీరు ఏ మర చి పని చేసినా భగవంతుడిపై విశ్వాసంతో మీ మీద మీరు పూర్తి నమ్మకంతో చేస్తే చాలు... అది విజయవంతమవుతుందని నేనంటాను. మీరేమనుకుంటారో మీ ఇష్టం. అన్నట్టు నన్ను భద్రకరమైన మాసమని కూడా అంటారు మరి మీకు తెలుసో లేదో! - డి.వి.ఆర్.