bhajana
-
జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్..
గాంధీనగర్: నటులు, గాయకులు, ఇతర కళాకారులపై కొందరు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తారు. గజరాత్ ప్రముఖ జానపద గాయకుడు కృతిన్ గాధ్వీకి సరిగ్గా ఇలాగే జరిగింది. ఆయన పాటలు పాడుతుండగా.. కొందరు కరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఇష్టాన్ని చాటుకున్నారు. ఆయనపై రూ.10, 20, 50, 100 నోట్లు గుమ్మరించారు. 'వల్సాద్ అగ్నివీర్ గో సేవా దళ్' నిర్వహించిన భజన కార్యక్రమంలో ఇలా జరిగింది. మార్చి 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వందల మందిని కృతిన్ గాధ్వి తన గాత్రంలో అలరించి ఉత్సాహపరిచారు. అయితే గోవుల సేవ కోసం ఫండ్స్ సేకరించేందుకు ఈ భజన నిర్వహించారు నిర్వహకులు. దీంతో ఈ డబ్బునంతా ఛారిటీకే ఇస్తున్నట్లు గాధ్వీ తెలిపారు. #WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo — ANI (@ANI) March 12, 2023 విరాళాల సేకరణ కోసం ఇలా భజనలు నిర్వహించడం గుజరాత్లో కొత్తేంకాదు. స్వామి వివేకానంద ఐ టెంపుల్ ట్రస్టు కూడా కొత్త కంటి ఆసుపత్రి కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఫండ్స్ సేకరించింది. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
భజన వీడియోకు ముగ్ధురాలైన కంగనా
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ముక్కుసూటి మనిషి. మనసులో ఏదీ దాచుకోదు. తనకు ఏమనిపించినా నిర్మొహమాటంగా బయటకు చెప్తుంది. ఈ వైఖరి వల్ల కొందరు ఆమెను మెచ్చుకున్నప్పటికీ చాలామంది నొచ్చుకుంటారు కూడా! ఇదిలా వుంటే తాజాగా ఆమె ఓ వీడియోను చూసి మైమరిచిపోయింది. ఓ పల్లెలో సాంప్రదాయంగా రెడీ అయిన మహిళలు, అమ్మాయిలు భజన చేస్తూ పాట పాడుతుండగా ఓ యువతి ఆ పాటకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నాట్యం చేస్తోంది. ఇందులో అందరూ సాంప్రదాయ దుస్తులే ధరించి ఓ వరుస క్రమంలో ముందుకు వెళ్తున్నారు. కనుల విందుగా కనిపిస్తున్న ఈ వీడియో వినసొంపుగానూ ఉంది. "ఇది కర్ణాటకలో జరిగే ఓ ఆధ్యాత్మిక భజన. ఇలాంటివి ఇంకెక్కడ జరుగుతున్నాయి అనుకున్నా. కానీ పల్లెల్లో ఇలాంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి" అని ఇది నిరూపిస్తోంది అంటూ స్మిత ప్రకాశ్ అనే మహిళ ఈ వీడియోను షేర్ చేసింది. దీన్ని కంగనా తిరిగి షేర్ చేస్తూ 'ఇలాంటి మనోహరమైన దృశ్యాలకు అంతం అనేది ఉండదు, ప్రతి రోజు ఇలాంటివి ఏదో ఒకటి ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి. ఈ దేశంతో మనల్ని ప్రేమలో పడేలా చేస్తాయి' అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలామంది నిజంగానే ఈ భజన మనోహరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇక కంగనా సినిమాల విషయానికొస్తే.. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది. బుధవారం జయలలిత జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న ‘తలైవి’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. మరోవైపు యాక్షన్ మూవీ 'థాకడ్'లో నటిస్తుండగా ఇది దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నారు. చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ రౌడీగా మారిన అభిషేక్.. సీఎం అవుతాడట! -
‘భజన బ్యాచ్’తో వస్తోన్న యప్‌టీవీ
సాక్షి, హైదరాబాద్: ప్రాంతీయ టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకుని.. ఆయా కార్యక్రమాలను విదేశాల్లో ప్రసారం చేసే ఆన్లైన్ వేదిక యప్ టీవీ తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఇది సొంతంగా సీరియల్స్‌ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భజన బ్యాచ్ పేరుతో.. వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నట్లు యప్ టీవీ యాజమాన్యం తెలిపింది. దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న వాసుదేవ రెడ్డి (ఐడ్రీమ్), యప్‌టీవీ స్టూడియోలు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యప్ టీవీ యాజమాన్యం మాట్లాడుతూ.. 12 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్‌లో పోసాని కృష్ణమురళి, గెటప్ శ్రీను, జెమిని సురేష్, దీప నాయుడు, జోగి కృష్ణరాజు, షకలక శంకర్, బుల్లెట్ భాస్కర్, గణపతి, గోవింద్, సుధాకర్ రాఘవ, అప్పారావ్ వంటి ప్రముఖ హస్యనటులు నటిస్తున్నారని తెలిపారు. భజన బ్యాచ్ అనేది కామిక్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కనున్నట్లు తెలిపారు. భజనలే బతుకుతెరువుగా బండి లాగిస్తున్న ఓ వ్యక్తి వారసత్వంగా తన పిల్లలకు కూడా భజనలు నేర్పుతాడు. అయితే ఇది వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది.. వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు.. ఈ సందర్భంగా ఏర్పడిన పరిణామాలు వంటి అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. పంచ్‌లు, కామెడీ సన్నివేశాలు, ఆసక్తికర ట్విస్ట్‌లతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యప్ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఉత్తమమైన ప్రాంతీయ అంశాలను అందించడమే మా ప్రధాన ధ్యేయం. ఈ క్రమంలో మేము మరో గొప్ప సిరీస్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాము’ అని తెలిపారు. అంతేకాక ‘భజన బ్యాచ్’ అనేది ప్రధానంగా యువతనే కాక అన్ని వయసుల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు ఉదయ్ నందన్ రెడ్డి. -
ఆరాధ్యుడి ఆరాధనకు అంకురార్పణ
– రాయరు 345వ ఆరాధనోత్సవాలు ప్రారంభం – కన్నుల పండువగా ధ్వజారోహణ మంత్రాలయం: కురుస్తున్న విరుల వాన.. మోగుతున్న మంగళవాయిద్యాలు.. ధ్వనిస్తున్న వేద మంత్రోచ్ఛారణలు..దాససాహిత్య మహిళల హరిదాస కీర్తనలు, భజనలు.. భక్తుల హర్షధ్వానాల మధ్య శ్రీరాఘవేంద్రస్వామి 345వ సప్త రాత్రోత్సవాలు ప్రారంభయమ్యాయి. బుధవారం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతత్వంలో ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ముందుగా గజరాజు స్వాగతం పలుకుతుండగా పీఠాధిపతి రాయరు మూల బందావన దర్శనం చేరుకుని విశేష పూజలు గావించారు. శ్రీమఠం ముంగిట గజరాజు, గోమాత, తురగ(అశ్వం)పూజ భక్తిశ్రద్ధలతో కానిచ్చారు. శ్రీమఠం ప్రాకార శిఖరాగ్రం నుంచి పూలు కురిపిస్తుండగా పీఠాధిపతి ధ్వజారోహణతో వేడుకలకు అంకురార్పణ పలికారు. అడ్మినిస్ట్రేటివ్, పీఆర్వో, క్యాస్, ఏఏవో, మేనేజర్ కార్యాలయాల్లో లక్ష్మి, రాయరు చిత్ర పటాలకు పూజలు చేశారు. రాత్రి డోలోత్సవ మండపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ, చెక్క, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలు జరిపారు. విశ్వమోహనుడి పర్వం : సుభుదేంద్రతీర్థులు, పీఠాధిపతి శ్రీరాఘవేంద్రస్వామి ఉత్సవాలు కేవలం మంత్రాలయం మఠంలోనే కాకుండా విశ్వమంతటా నిర్వహించబడుతోందని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పేర్కొన్నారు. వేడుకల ప్రారంభోత్సవంలో పీఠాధిపతి మాట్లాడుతూ భువనమోహనుడు రాయరు ఆరాధన రోజుల్లో భక్తులకు కరుణచూపుతో ఆశీర్వదిస్తారన్నారు. రాయరు మహిమలు అమోఘమన్నారు. భక్తుల కల్పతరువుగా ప్రాణకోటి సుభిక్షానికి మూల గురువుగా నిలుస్తారన్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భక్తులు, పోలీస్ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఏడు రోజుల పాటు భక్తులకు సకల సౌకర్యాలు క్షేత్రంలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పీఠాధిపతి పూర్వాశ్రమ తండ్రి, గురువు గిరియాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ మునిస్వామి పాల్గొన్నారు. శ్రీమఠంలో ఎంపీ బుట్టారేణుక రాఘవేంద్రస్వామి దర్శనార్థం బుధవారం కర్నూలు ఎంపీ బుట్టారేణుక మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకుని రాఘవేంద్రుల మూల బందావనంకు పూజలు చేసుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రాలు, రాఘవేంద్రుల జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షితలతో ఆశీర్వదించారు. మఠం మేనేజర్ శ్రీనివాస రావు పూర్ణకుంభంతో ఎంపీకి ఆహ్వానం పలికారు. ఆమెతోపాటు సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కష్ణ ఉన్నారు.