భజన వీడియోకు ముగ్ధురాలైన కంగనా | Kangana Ranaut Today Tweet About Vandipe Ninage Gananatha Bhajane from Karnataka | Sakshi
Sakshi News home page

ఈ మనోహరత్వానికి అంతం లేదు: కంగనా రనౌత్‌

Published Thu, Feb 25 2021 1:04 PM | Last Updated on Thu, Feb 25 2021 1:38 PM

Kangana Ranaut Today Tweet About Vandipe Ninage Gananatha Bhajane from Karnataka - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ముక్కుసూటి మనిషి. మనసులో ఏదీ దాచుకోదు. తనకు ఏమనిపించినా నిర్మొహమాటంగా బయటకు చెప్తుంది. ఈ వైఖరి వల్ల కొందరు ఆమెను మెచ్చుకున్నప్పటికీ చాలామంది నొచ్చుకుంటారు కూడా! ఇదిలా వుంటే తాజాగా ఆమె ఓ వీడియోను చూసి మైమరిచిపోయింది. ఓ పల్లెలో సాంప్రదాయంగా రెడీ అయిన మహిళలు, అమ్మాయిలు భజన చేస్తూ పాట పాడుతుండగా ఓ యువతి ఆ పాటకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నాట్యం చేస్తోంది. ఇందులో అందరూ సాంప్రదాయ దుస్తులే ధరించి ఓ వరుస క్రమంలో ముందుకు వెళ్తున్నారు.

కనుల విందుగా కనిపిస్తున్న ఈ వీడియో వినసొంపుగానూ ఉంది. "ఇది కర్ణాటకలో జరిగే ఓ ఆధ్యాత్మిక భజన. ఇలాంటివి ఇంకెక్కడ జరుగుతున్నాయి అనుకున్నా. కానీ పల్లెల్లో ఇలాంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి" అని ఇది నిరూపిస్తోంది అంటూ స్మిత ప్రకాశ్‌ అనే మహిళ ఈ వీడియోను షేర్‌ చేసింది. దీన్ని కంగనా తిరిగి షేర్‌ చేస్తూ 'ఇలాంటి మనోహరమైన దృశ్యాలకు అంతం అనేది ఉండదు, ప్రతి రోజు ఇలాంటివి ఏదో ఒకటి ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి. ఈ దేశంతో మనల్ని ప్రేమలో పడేలా చేస్తాయి' అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలామంది నిజంగానే ఈ భజన మనోహరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక కంగనా సినిమాల విషయానికొస్తే.. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన ‘తలైవి’ చిత్రంలో నటిస్తోంది. బుధవారం జయలలిత జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ‘తలైవి’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. మరోవైపు యాక్షన్‌ మూవీ 'థాకడ్‌'లో నటిస్తుండగా ఇది దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 1న విడుదల చేయాలనుకుంటున్నారు.

చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్‌ క్వీన్‌

రౌడీగా మారిన అభిషేక్‌.. సీఎం అవుతాడట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement