bhajans
-
భజనలు చేస్తూ మోదీ.. లంగర్లో వడ్డిస్తూ రాహుల్
వారణాసి/ఢిల్లీ: పంజాబ్ ఎన్నికల సందడి అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ వారణాసిలో కనిపించింది. కాంగ్రెస్ నుంచి ఆప్ వరకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరూ గురు రవిదాస్ సంస్మరణలో మునిగితేలారు. 15వ శతాబ్దానికి చెందిన దళిత నాయకుడు గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాజకీయ నాయకులు, భక్తులతో వారణాసి కిటకిటలాడిపోయింది. రవిదాస్ అనుచరుల ఓట్లను లక్ష్యంగా చేసుకొని అన్ని పార్టీల వారు పోటీలు పడి మరీ ప్రార్థనలు చేశారు. Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg — Narendra Modi (@narendramodi) February 16, 2022 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో రవిదాస్ ఆలయాన్ని సందర్శించి మహిళా భక్తులతో కలిసి కూర్చొని భజనలు చేశారు. రవిదాస్ జన్మస్థలమైన వారణాసిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఒక ఎంపీగా తనకా అవకాశం దక్కడం అదృష్టమని మోదీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారణాసిలోని రవిదాస్ ఆలయంలో లంగర్ (సమూహ భోజనాలు)లో భక్తులకు భోజనాలు వడ్డించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెల్లవారుజామున 4 గంటలకే రవిదాస్ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ కూడా ప్రార్థనలు చేశారు. రవిదాస్‌కి ఎందుకింత ప్రాధాన్యం ► గురు రవిదాస్ వారణాసిలోని గోవర్ధన్‌పూర్ గ్రామంలో చర్మకారుల కుటుంబంలో జన్మించారు. రవిదాసియా అనే ప్రత్యేక మతాన్ని వ్యాప్తి చేశారు. పంజాబ్‌లో ప్రముఖ డేరా సచ్చఖానంద్ బల్లాన్ రవిదాసియా మతాన్నే ఆచరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ డేరాకు 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ► చిన్నప్పట్నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్న ఆయన సమాజంలో నెలకొన్న వర్ణ వివక్షను ప్రశ్నిస్తూ కవిత్వం రాశారు. ఆయన రాసిన కవిత్వానికి, రవిదాసులో సాహితీవేత్తకి కులాలకతీతంగా అభిమానులున్నారు. ► సిక్కు రాడికల్ సంస్థకు చెందిన కొందరు నాయకులు 2009లో వియన్నాలో గురు రవిదాస్ డేరాలపై జరిపిన దాడిలో ఒక నాయకుడు మరణించాడు. దీంతో సిక్కు మతంతో తమకు సంబంధం లేదని ఆ డేరా ప్రకటించింది. గురు గ్రంథ సాహిబ్ స్థానంలో రవిదాస్ రచించిన 200 కీర్తనలతో కూడిన అమృత్వాణిని తీసుకువచ్చారు. అదే తమకు మత గ్రంథమని ప్రకటించుకున్నారు. ► పంజాబ్ జనాభాలో 32 శాతం దళితులున్నారు. వారిలో ఎక్కువ మంది రవిదాస్ అనుచరులు కావడంతో రాజకీయ పార్టీల తలరాతలు మార్చే ఓటు బ్యాంకుగా మారారు. ► ఈ సారి పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14నే జరపాలని తొలుత ఎన్నికల సంఘం నిర్ణయించినప్పటికీ రవిదాస్ జయంతి కోసం ఎన్నికల్ని కూడా 20 తేదీకి వాయిదా వేసింది. ► పంజాబ్‌లో దళితుల ఓట్లను ఆకర్షించడానికి గతంలో బీఎస్పీ ప్రయత్నించి కొంత సఫలమైంది. అయితే ఆ పార్టీకి రామ్‌దాసియా సిక్కుల మద్దతు మాత్రమే లభించింది. ఈసారి వీరి ఓట్ల కోసం ప్రతీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వారణాసిలోని రవిదాస్ ఆలయంలో వడ్డిస్తున్న రాహుల్ -
‘నీవు మరణించినా...నీ గాత్రం అమరం’
అమృత్సర్ : ప్రముఖ సూఫీ సంగీత విద్వాంసుడు, వడాలి బ్రదర్స్‌లో చిన్నవాడైన ఉస్తాద్ పురాన్ చాంద్ వడాలి(75) శుక్రవారం ఉదయం అమృత్‌సర్‌లో కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న వడాలిని గురువారం అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది. అంత్యక్రియలు వీరి పూర్వికుల గ్రామం వడాలిలో జరుగనున్నాయి. ఉస్తాద్ పురాన్ చాంద్ వడాలి, ప్యారేలాల్ వడాలిగా ప్రఖ్యాతి. వడాలి బ్రదర్స్ పంజాబీ సూఫీ సంగీతంలో విద్వాంసులు. 1975లో జలంధర్‌లో హర్భల్లా ఆలయంలో ఇచ్చిన తొలి ప్రదర్శనతో వడాలి బ్రదర్స్ ఎక్కువగా ఖ్యాతి పొందారు. వీరు భజనలు, గజల్స్, కాఫియాన్లు ఎక్కువగా పాడుతుంటారు. హిందీ మూవీ 'పిన్జార్' లో, ఇటీవల విడుదలైన 'తను వెడ్స్ మను' లో కూడా వడాలి బ్రదర్స్ పాటలు పాడారు. ట్విట్టర్ నివాళి.... ‘‘పంజాబ్ సాహిత్యాన్ని, సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఓ షెహన్షా నీ ఆత్మకు శాంతి చేకురాలని వేడుకుంటున్నాము’’ అంటూ ట్విట్టర్ ప్యారేలాల్ వడాలి మృతికి నివాళి అర్పించింది. -
భక్తుల పాదయాత్ర
న్యాల్కల్: కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన వందలాది మంది భక్తులు ఆదివారం భజనలు చేసుకుంటూ పాదయాత్రగా మండల కేంద్రమైన ఝరాసంగం కేతకి ఆలయానికి వెళ్ళారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, తాము కోరిన కోర్కెలు తీరాలని కోరుతూ ప్రతిఏటా పాదయాత్రతో వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. అందులో భాగంగా కర్నాటక, మహారాష్ట్రాలలోని అనేగావ్, నెట్టూరు, కోడ్‌గా, బరూర్, తాండ, అల్లిపుర్గి, జైనాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం న్యాల్కల్ మండలంలోని మల్గి, డప్పూర్, అత్నూర్, న్యాల్కల్, రుక్మాపూర్‌ల మీదుగా కేతకి సంగమేశ్వర ఆలయానికి తరలివెళ్లారు. భజనలు, నృత్యాలు చేస్తూ ఆయా గ్రామాల గుండా పాద యాత్రను కొనసాగించారు. నాలుగు రోజుల క్రితం పాదయాత్రగా బయలు దేరామని ఆదివారం రాత్రి ఆలయానికి చేరుకొని భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం పాదయాత్రన తరలి వెళున్న భక్తులకు అత్నూర్ గ్రామానికి చెందిన తుకారం పాటిల్-పరాగ్‌బాయి, బాబురావు-సుమిత్రబాయి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. కేతకీ ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రతి ఏటా అన్నాదానం నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాల్కల్ మీదుగా ముంగి వైపు వస్తున్న భక్తులకు ముంగి చౌరస్తా వద్ద పలువురు భక్తులకు టీ, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రవీదర్, నాయకులు ఎల్చల్ నర్సింహారెడ్డి, రాజు పాటిల్, శివాజీ పాటిల్, విజయ్ పాటిల్, విఠల్‌రెడ్డి, ఏక్నాథ్, దండేమహారాజ్, వీరారెడ్డి, న్యాల్కల్ శ్రీను సేఠ్ తదితరులు పాల్గొన్నారు. -------------- 14జడ్‌హెచ్‌ఆర్41:న్యాల్కల్ మీదుగా ఝరాసంగంకు పాద యాత్రన తరలి వెళ్లుతున్న భక్తులు