Bharat nagar
-
Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ ఎదురుగా ఉన్న నాలా కల్వర్టు స్థానంలో బాక్స్ టైప్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ►బాలానగర్ నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వచ్చే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. అయితే ఖైతాన్నగర్ వద్ద వాహనాలను కుడివైపు మళ్లించి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, జింకలవాడ నాలా, దుర్గామాత ఆలయం, సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ►మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు అనుమతించరు. వాటిని నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి కూకట్పల్లి వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకుని మూసాపేట క్రాస్‌రోడ్డు మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► ద్విచక్ర వాహనాల రాకపోకలు మాత్రమే భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. ఈ వాహనాలను సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ (ఎదురుగా ఎడమ వైపునకు), దుర్గామాత ఆలయం(కుడి మలుపు), జింకలవాడ నాలా, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్(కుడి మలుపు), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ఖైతాన్నగర్ రహదారిలో ఎడమవైపు తీసుకుని నర్సాపూర్ క్రాస్‌రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ►ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు, లైట్ మోటార్ వాహనాలు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు అనుమతించరు. వాటిని భరత్‌నగర్ మార్కెట్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద కుడివైపు మళ్లి ఐడీపీఎల్ కంపెనీ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
ఫ్లైఓవర్ పైనుంచి కారు బోల్తా
హైదరాబాద్: మితిమీరిన వేగం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్‌లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు కింద పడిన ఘటన మరచిపోకముందే అలాంటిదే మరో ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పైకి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఫ్లైఓవర్ కింద భరత్‌నగర్ మార్కెట్‌కు వచ్చిన కూరగాయల వ్యాపారులు, విద్యుత్ కేబుల్ కార్మికులు ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు కారు వారికి కాస్త దూరంగా పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. 30 అడుగుల ఎత్తు నుంచి... బోరబండ పండిట్ నెహ్రూనగర్, స్వరాజ్నగర్లకు చెందిన స్నేహితులు మహ్మద్ సోహెల్ (27), మెహిజ్ (19), గౌస్ (20), ఇర్ఫాన్ (18), అశ్వక్ (18) సోమవారం రాత్రి భోజనం చేయడానికి హైటెక్‌సిటీకి వెళ్లారు. సోహెల్ మామయ్యకు చెందిన హ్యుందాయ్ ఆక్సెంట్ కారు (ఏపీ 11ఆర్ 9189)ను సునీల్ (22) నడుపుతున్నాడు. భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో మూసాపేట నుంచి ఎర్రగడ్డ వైపు వస్తున్నారు. భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పైకి వేగంగా వెళ్లిన కారు.. ఒక్కసారిగా అదుపు తప్పింది. అడుగున్నర ఎత్తున్న ఫుట్‌పాత్ ఎక్కి, అంతటితో ఆగకుండా రెయిలింగ్‌ను ఢీకొట్టి 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. పెద్ద శబ్దంతో కారు కింద పడటంతో అక్కడ ఉన్న కూరగాయల వ్యాపారులు, విద్యుత్ కేబుల్ కార్మికులు ఏం జరిగిందో తెలియక భయాందోళనతో పరుగులు తీశారు. అనంతరం తేరుకుని కారు వద్దకు చేరుకున్నారు. జేసీబీ సాయంతో కారు రేకులు తొలగించి అం దులో ఉన్న ఆరుగురిని బయటకు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న సోహెల్ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఐదుగురు గాయపడ్డారు. మృతుడు సోహెల్ తండ్రి షఫీ చాయ్ హోటల్ నడుపుతున్నారు. అశ్వక్, ఇర్ఫాన్, మొహిజ్లు స్వరాజ్‌నగర్‌లో ఏసీ రిపేరింగ్ పనులు చేస్తుంటారు. గౌస్ అల్మారా పనులు చేస్తుండగా.. సునీల్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
స్నేహితుడి మృతిని తట్టుకోలేక...
-
కారులో తరలిస్తున్న రూ.3.84 కోట్లు పట్టివేత
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోలీసు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా నగరంలోని భరత్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం కారులో తరలిస్తున్న రూ.3.84 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ నగదును పోలీసులు సీజ్ చేసి ... కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీజ్ చేసిన నగదుపై కారు డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.