bharath stage
-
అశోక్ లేలాండ్ బీఎస్–6 వాహనాలు
చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్‌లేలాండ్.. భారత్ స్టేజ్(బీఎస్)–6 ప్రమాణాలకు అనుగుణంగా తన భారీ శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా సీట్లు, స్టీరింగ్ వంటి వాటిని మార్చుకుని కొనుగోలు చేసే సౌకర్యాన్ని వీటిలో అందుబాటులో ఉంచింది. మాడ్యులర్ బిజినెస్ ప్రోగ్రామ్‌గా పిలిచే ఈ విధానం టైలర్‌మేడ్ తరహాలో ఉంటుందని వివరించింది. మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందుతున్న ఈ నూతన తరం వాహనాలు వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్దమవుతాయని ప్రకటించింది. ప్రస్తుత ధరల శ్రేణి రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ ఉండగా, నూతన మోడళ్ల విడుదల సమయంలో ధరలను వెల్లడిస్తామని సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా అన్నారు. ఈ కామర్స్, పార్సిల్స్‌కు తగిన ట్రక్కుల నుంచి సిమెంట్‌ను తరలించే వాహనాలతోపాటు, డిఫెన్స్, టూరిస్ట్ బస్సులను ఆయన సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల వాహనాల విక్రయాలు నమోదు కాగా, త్వరలోనే అమ్మకాలను 4 లక్షల యూనిట్లకు పెంచడం ద్వారా ప్రపంచంలోనే టాప్–10 స్థానంలోకి చేరనున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 24వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనాలను విడుదల చేయడం ద్వారా మార్కెట్ వాటా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ టెక్నాలజీ డ్రైవర్లకు స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు ఇంజన్లో ఎటువంటి లోపం తలెత్తినా వెంటనే డ్రైవర్‌కు సమాచారం వస్తుందని వెల్లడించారు. నూజివీడు ప్లాంట్‌కు మందగమనం సెగ ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడులో ప్లాంట్ ఏర్పాటు చేయగా, ఆ నాటి నుంచి ఆటో పరిశ్రమలో మందగమనం నెలకొనడంతో విస్తరణ పణులను చేపట్టలేకపోతున్నామని ధీరజ్ హిందుజా అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రైవేటు ప్యాసింజర్ సంస్థలకు అవసరమైన బస్సులను ప్రస్తుతానికి తాము ఉత్పత్తి చేయడం లేదన్నారు. -
త్వరలో మహీంద్రా బీఎస్–6 వాహనాలు
ముంబై: మోటార్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ (బీఎస్) నిబంధనలను ఎప్పటికప్పుడు మార్పులుచేస్తుండగా.. వీటికి అనుగుణంగా తమ వాహనాల ఉత్పత్తిలో మార్పులు చేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ‘బీఎస్–సిక్స్’ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తాజా నిబంధనలకు తగిన వాహనాలను ఈ ఏడాది నుంచే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై మాట్లాడిన ఎంఅండ్ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా.. ‘ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం చివరినాటికి బీఎస్–6 గ్యాసోలిన్ వాహనాన్ని సిద్ధంచేస్తున్నాం. ఈ వాహనానికి.. నూతన నిబంధనలకు తగిన విధంగా ఇంధనం ఉండాలనే ఆంక్షలు లేనందున తొలుత దీనిని విడుదలచేస్తున్నాం. అయితే, డీజిల్ వాహనానికి మాత్రం దేశం మొత్తం ఒకే బీఎస్–6 ఇంధనం అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉన్నందున ఈ వాహన విడుదల ఆలస్యం కానుంది. నూతన నిబంధనలకు సరిపడే విధంగా వాహనాలను ఉత్పత్తి చేయడం కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాం. అమలుకు సంబంధించి ఎటువంటి టెక్నికల్ సమస్యలను ఎదుర్కొలేదు. ముందస్తు ప్రణాళికతో నూతనతరం వాహనాలను అందుబాటులోకి తీసుకునిరావడానికి రంగం సిద్ధంచేశాం’ అని అన్నారు. -
హోండా కొత్త బైక్... సీబీ హార్నెట్ 160
ధర రూ.79,900 పనాజి: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ కంపెనీ కొత్త బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సీబీ హార్నెట్ 160 ఆర్ పేరుతో అందిస్తున్న ఈ కొత్త బైక్ ధర రూ.79,900 (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని కంపెనీ తెలిపింది. భారత్ స్టేజ్(బీఎస్)-ఫోర్ పర్యావరణ నిబంధనలకనుగుణంగా తయారైన తొలి భారతీయ బైక్ ఇదని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీత మురమత్సు చెప్పారు. ఈ బైక్ విక్రయాలు 21 నగరాల్లో నేటి(శుక్రవారం) నుంచి, దేశవ్యాప్తంగా కొత్త ఏడాది నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 160 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ బైక్ సింగిల్ డిస్క్, డ్యుయల్ డిస్క్ విత్ సీబీఎస్... ఈ రెండు వేరియంట్లలో లభిస్తుందని చెప్పారు. ఈ మోడల్‌కే ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.