Bharti Singh
-
ప్రెగ్నెంట్ అని తెలీక పార్టీలకు వెళ్లి మందు తాగా: కమెడియన్
ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియక కమెడియన్ భారతీ సింగ్ మందు తాగింది. నిజానికి ఏడు వారాల వరకు ఆమెకు తాను గర్భవతి అన్న విషయమే తెలియదు. ఈ విషయాన్ని భారతీ సింగ్ స్వయంగా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా ప్రెగ్నెన్సీని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎంజాయ్ చేశాఅప్పటిదాకా పార్టీలకు వెళ్తూ హాయిగా నచ్చింది తింటూ, తాగుతూ ఎంజాయ్ చేశాను. అనుకోకుండా ఓ రోజు ప్రెగ్నెన్సీ కిట్ కనిపించడంతో ట్రై చేద్దామనుకున్నాను. తీరా పరీక్షిస్తే పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని నా భర్త హార్ష్కు చెప్తే అతడు నమ్మలేదు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేస్తే గర్భవతినని నిర్ధారణ అయింది. ఆడవారిదే తప్పంటారు!గర్భంలో ఉన్న శిశువుకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా మహిళదే తప్పంటారు చాలామంది. అయితే భర్త మానసికంగా ధైర్యం చెప్తూ అండగా ఉంటే ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. నాకు అలా అర్థం చేసుకునే భర్త దొరికాడు అని చెప్తూ మురిసిపోయింది. ముచ్చటైన కుటుంబంకాగా భారతి సింగ్.. రచయిత, నిర్మాత, యాంకర్ హార్ష్ లింబాచియాను ప్రేమించింది. వీరిద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో గోలా పుట్టాడు. తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను భారతీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కేంద్రమంత్రి భార్యకు బెదిరింపులు!
న్యూఢిల్లీ: తన సంభాషణలను రహస్యంగా రికార్డు చేసి ఓ వ్యక్తి.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ భార్య భారతీ సింగ్ ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ప్రదీప్ చౌహాన్ తమ కుటుంబానికి తెలిసినవాడని, ఆగస్టు 6న అతనితో తాను మాట్లాడిన మాటల్ని రహస్యంగా రికార్డు చేశాడని, ఆ తర్వాత తనకు రూ. 2 కోట్లు ఇవ్వకుంటే ఆ సంభాషణల్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని భారతీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చౌహాన్ వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ ఉందని, దానితో తమ కుటుంబానికి హాని చేస్తానని అతడు బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తనకు సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఆడియో, వీడియో రికార్డులను బయటపెడతానని చౌహాన్ ఆమె పేర్కొన్నారు. అతని దగ్గర ఉన్న క్లిప్పుల్లో ఏముందో తనకు తెలియదని, కానీ వాటిని బయటపెట్టి తన భర్త పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తానని అతడు ఫోన్లో బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. నిందితుడు ఆమె సంభాషణల్ని రికార్డు చేసి.. వాటిని వేరే వాటితో మిక్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తున్నదని పోలీసు వర్గాలు తెలిపాయి.