Bhasha
-
ఎదురుతన్నిన చంద్రబాబు దుష్ప్రచారం
తోచీతోచనమ్మ తోడికోడలుపుట్టింటికి వెళ్లిందట.. అలా అయింది చంద్రబాబు పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏమీ విషయం లేక దిగాలుగా ఉన్న చంద్రబాబుకు.. ఆయన మాటల్లో ఉర్లగడ్డ అనే పదం ఉల్లిగడ్డగా ఉచ్చరించారు అంటూ టీడీపీ, చంద్రబాబు, ఐటీడీపీ లో రెండ్రోజులుగా తెగ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలో పెట్టి లబ్ధిపొందాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇదేం పెద్ద మైలేజి తీసుకురాకపోగా తిరిగి ఎదురుతన్నింది. కొన్ని పదాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పలుకుతారు. అదేం నేరం కాదు.. ఘోరం కాదు.. ఒకే వస్తువును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉచ్ఛరిస్తారు. ఆ అంశాన్ని పట్టుకుని చంద్రబాబు యాగీ చేసేందుకు ప్రయత్నించడం ద్వారా ఒక ప్రాంతం ప్రజానీకాన్ని అవమానించినట్లు అయింది. తనదీ రాయలసీమే అని చెప్పుకునే చంద్రబాబు ఆ ప్రాంత యాసభాషలను వెక్కిరించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన చంద్రబాబుకు అలుగడ్డను ఉర్లగడ్డ అంటారన్నది తెలీదా.. లేకపోతే అది తప్పా.. ఎందుకని అలా విమర్శిస్తున్నారు అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించాలి అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా లోపాలు ఉంటే చూడాలి కానీ రాయలసీమ భాషను అడ్డం పెట్టుకుని మొత్తం ప్రాంతాన్ని చిన్నబుచ్చడం ఏమిటని అంటున్నారు. క్షమాపణ చెప్పాలి చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ చెప్పుకోవడానికే రాయలసీవాసులు కానీ ఎన్నడూ ఇక్కడ నివసించింది లేదు. పండగపూట చుట్టపు చూపుగా సొంత ఊరికి వచ్చి వెళ్లేవారికి రాయలసీమ యాస, భాష ఎలా తెలుస్తాయి అని అంటున్నారు. జగనన్న నిఖార్సైన రాయలసీమ బిడ్డ. ఈ ప్రాంతం వ్యక్తిగా ఎవరైనా పెద్ద వారు కనిపిస్తే ఏన్నా బాగుండావా అని.. చిన్నోళ్లయితే ఏమబ్బా బాగుండావా అంటూ ఆప్యాయంగా మా సీమ యాసలో మాట్లాడతారు. మరి రాయలసీమ వాసులని చెప్పుకునే చంద్రబాబుకు, లోకేష్‌కు రాయలసీమ యాస, భాష గురించి తెలుసా? అంటూ రాయలసీమ భాషాపరిరక్షణ సమితి ప్రశ్నిస్తోంది. తమ భాషను విమర్శించినందుకు చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో గతం ఎన్నికల్లో వచ్చిన మూడు సీట్లు కూడా రానివ్వమని, మొత్తానికి సున్నా చుట్టి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరిస్తూ సమితి పేరిట వచ్చిన కరపత్రాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆ ప్రాంత భాషాభిమానులు ఇప్పుడు చంద్రబాబుమీద ధ్వజమెత్తుతున్నారు. రెండెకరాలతో ఇప్పుడు వేలకోట్లకు అధిపతిగామారి సీమ యాసను వెక్కిరించే స్థాయికి చేరిన చంద్రబాబును నేలకు దించుతామని వారు అల్టిమేటం ఇచ్చారు. -
భాషా తమిళ రీమేక్.. అయితే హీరోగా రజినీకాంత్ కాదట..!
చిత్రసీమలో హిట్ చిత్రాలను రీమేక్ చేయడం అనేది చాలా కాలం నుంచి జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా వచ్చిన కొన్ని చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. గతంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన బిల్లా చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు విష్ణువర్ధన్ చేశారు. రజనీకాంత్ పాత్రలో అజిత్ నటించి హిట్ కొట్టారు. తాజాగా మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రజినీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం బాషా. ఒక సాధారణ యువకుడు పరిస్థితుల ప్రభావంతో ఎలా అండర్ వరల్డ్ డాన్‌గా మారాడో..? తిరిగి మళ్లీ ఎలా మంచిగా మారి జన స్రవంతిలోకి కలిసిపోయాడు? అన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం టాలీవుడ్‌లోనూ రజనీకాంత్‌కు స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకుడు విష్ణువర్ధన్ కొన్ని మార్పులు చేసి రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులోనూ అజిత్‌ను కథానాయకుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. కాగా తునివు చిత్రం తర్వాత అజిత్ తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్ వైదొలిగారు. అందుకు కారణం కథలో అజిత్ చెప్పిన మార్పులకు ఈయన అంగీకరించ పోవడమేనని సమాచారం. ఇప్పుడు తాజాగా అజిత్ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తదుపరి విష్ణువర్ధన్ దర్శకత్వంలో భాషా చిత్రానికి రీమేక్‌లో నటించడానికి అజిత్ మరోసారి సాహసం చేస్తారా? అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
వైభవంగా మరాఠీ భాషా దినోత్సవం..
ముంబై: మహరాష్ట్రలో భాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మరాఠీ సాహిత్యకారుడు వి.వి.షిర్వాద్కర్, అలియాస్ కుసుమగరాజ్ జయంతి సందర్భంగా జరిపే మహరాష్ట్ర భాషా దివస్ ను పురస్కరించుకొని పలు సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా షిర్వాద్కర్ స్వంత గ్రామం నాసిక్ లో కుసుమగరాజ్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. భాషా దినోత్సవం సందర్భంగా మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని సుమారు 568 బస్ స్టేషన్ల నుంచి 18,000 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి బస్సుకు కుసుమగరాజ్ సహా.. పలువురు ప్రముఖుల కవితలు, సాహిత్యంతో కూడిన హోర్డింగులు, బ్యానర్లతో ప్రత్యేకంగా అలంకరించడం సాహిత్యాభిమానులను అమితంగా ఆకర్షించింది. 1999 లో జ్ఞానపీఠ్ అవార్డు అలంకరించిన కుసుమగరాజ్ మరణం తర్వాత మహరాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును మరాఠి రాజ్యభాషా గౌరవ దినంగా నిర్వహిస్తూ... మరాఠీ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది నుంచి మరాఠీ సాహిత్యంలో ప్రతిభ చూపిన ఇద్దరికి ప్రత్యేక పురస్కారాలు అందించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా మొదటి భాషా సంవర్థక్ అవార్డును అహ్మద్ నగర్ కు చెందిన కూరగాయల వ్యాపారి బెబితాయ్ గైక్వాడ్ కు అందించింది. తన సంపాదనలో ప్రతిరోజూ ఐదు రూపాయల చొప్పున పొదుపుచేసి సుమారు 900 పుస్తకాలను కొనేందుకు వెచ్చించిన హైస్కూల్ డ్రాపవుట్ బెబితాయ్ ఇప్పటివరకూ సుమారు 3,000 మరాఠీ సాహిత్య పుస్తకాలను చదివింది. పార్టీలో మరాఠీ అనుకూల వైఖరి ఉన్నప్పటికీ తమ పిల్లలను కాన్వెంట్ చదువులకు పంపడంపై వేడుకలకు హాజరైన ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ థాకరే సమర్థించుకున్నారు.