Bhavani Singh
-
ఎండకు గొడుగు పట్టారు..
మండుతున్న ఎండల్లో రోడ్డు మీద పుచ్చకాయ ముక్కలు కనిపిస్తే వెంటనే ఆగిపోతాం.ఓ కప్పు తాజా పుచ్చకాయ ముక్కలు తిని సేదదీరుతాం. ఇంటి నుంచి బయటకు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి ఇల్లు చేరేలోపు ఏర్పడే అవసరం అది. మరి అదే ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రకోపాన్ని భరిస్తూ పుచ్చకాయ ముక్కలమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? 52.9 డిగ్రీలకు చేరిన ఎండలో ఎన్ని పుచ్చకాయలు తింటే అతడికి సాంత్వన దొరుకుతుంది. తనకు, తన తల మీద నాట్యమాడుతున్న సూర్యుడికి మధ్య ఏ అడ్డూ లేదు. వర్షాకాలంలో మొక్కజొన్న కండెలు కాలుస్తూ, ఎండాకాలంలో పండ్ల ముక్కలమ్ముకుంటూ... బతుకు బండి ఈడ్చడానికి ఏ ఎండకా గొడుగు పట్టే తనకు గొడుగుపట్టేదెవరు? ఎండనే గొడుగు చేసుకుని బతుకీడుస్తున్న ఇలాంటి వాళ్లకు గొడుగులు పంచుతున్నారు ఢిల్లీలోని నలుగురు యువతులు అనూష అత్రీ, భావని సింగ్, ఖుషీ సింగ్, వశిఖా మెహతా.‘సమాజంలో సహాయం అవసరమైన వాళ్లు అనేకమంది ఉన్నారని కరోనా సమయంలో తెలిసింది’ అంటూ తమ సేవా ప్రస్థానాన్ని వివరించారు. ‘సేవ’ అవసరం ఉంది! ‘‘మా సర్వీస్ కరోనా సమయంలో మాస్క్‌లు పంచడంతో మొదలైంది. కరోనా కరాళనృత్యం చేస్తున్న రోజుల్లో కూడా శ్రామికులు కొంతమంది మాస్కు కూడా లేకుండా పనులకు వెళ్లడం మమ్మల్ని ఆందోళన పరిచింది. తమ ఆరోగ్యభద్రత కోసం కనీసంగా కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ల అలసత్వం, నిర్లక్ష్యానికి కారణం చైతన్యం లేకపోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన వెసులుబాటు లేకపోవడం. కనీసం మాస్కు అయినా ఇవ్వగలిగితే మంచిది కదా అనుకున్నాం. మా పేరెంట్స్ మాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తీసి మాస్కులు కొని పంచాం. ఒకసారి మురికి వాడల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలిశాయి. వాళ్లు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిసి హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులిచ్చాం. సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉందని తెలిసి ‘వారియర్స్ వితవుట్ ఏ కాజ్’ పేరుతో ఎన్జీవో ్రపారంభించాం. చదువు అవసరాన్ని తెలియచేయాల్సిన పరిస్థితి ఇంకా దేశంలో నెలకొని ఉందంటే నమ్ముతారా? చదువు జీవితాన్ని మెరుగుపరుస్తుందని వివరించినప్పటికీ వారిలో ఏదో నిర్లిప్తత. హెల్త్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌తోపాటు రుతుక్రమ పరిశుభ్రత కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు ఫైనాన్షియల్ లిటరసీ కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. మేము సర్వీస్ అందిస్తున్న వాళ్లలో చాలామందికి తమకు చేతనైన పని చేసి ఓ వంద రూపాయలు సంపాదించుకోవడం తెలుసు. కానీ పని దొరకని రోజు కూడా భోజనం చేయాలంటే ఈ రోజు సంపాదించిన వందలో ఓ పది రూపాయలు దాచుకోవాలని తెలియదు. పని దొరక్కపోతే పస్తులుండడమే ఇంతవరకు వాళ్లకు తెలిసిన జీవితం. అలాంటి కుటుంబాలలో మహిళలను సమీకరించి వాళ్లు చేసే పనులతోనే డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడవాళ్లందరికీ ఊలుతో స్వెట్టర్లు, టోపీలు అల్లడం వచ్చి ఉంటుంది. వాళ్లను సంఘటిత పరిచి క్రోషియో నిట్టింగ్ బ్యాగ్‌లు, ఊలు ఉత్పత్తుల తయారీని ్రపోత్సహించాం. ఆ మహిళలను స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించే సంస్థలతో అనుసంధానం చేయగలిగాం. ఈ ఏడాది ‘బీట్ ద హీట్’ క్యాంపెయిన్ చేపట్టాం. ఇందులో భాగంగా రోడ్డు పక్కన బండి పెట్టుకుని పుచ్చకాయ ముక్కలమ్మేవాళ్లు ఇతర చిన్న చిన్న వస్తువులమ్ముకునే వాళ్లకు మొత్తం ఐదువేల మందికి గొడుగులిచ్చాం. పండ్లు, సోడాలమ్ముకునే వాళ్ల కంటే స్టవ్ పెట్టి వండే వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఎర్రటి ఎండలో బండి మీద స్టవ్ పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్, బజ్జీలు వేసే వాళ్ల తల కూడా పెనంతో సమానంగా వేడెక్కి పోతుంటుంది. అలాంటి ఎందరో మేమిచ్చిన గొడుగును వాళ్ల బండికి కట్టుకుని రోజంతా హాయిగా పని చేసుకుంటున్నారు. మా సర్వీస్‌ని ఢిల్లీ, నోయిడాల నుంచి దేశంలోని బెంగళూరు, చండీగర్, ముంబయి, హైదరాబాద్‌లకు విస్తరించాం. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మా నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం’’ అని చెప్పారు. -
జయకు షాక్
చెల్లని భవానీసింగ్ నియామకం పునర్విచారణ లేదనడంతో జయకు ఊరట తీర్పు తీవ్రంగా ఉండాలని సూచించిన సుప్రీం చె న్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అప్పీలుపై నియమితులైన ప్రభుత్వ న్యాయవాది భవానీసింగ్ నియామకం చెల్లదని సుప్రీం కోర్టు సోమవారం తీర్పుచెప్పి షాక్‌కు గురిచేసింది. అలాగని కేసుపై పునర్విచారణ అవసరం లేదని ప్రకటించడం ద్వారా జయకు ఊరటనిచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఒకే తీర్పులో జయకు షాక్, ఊరట చోటుచేసుకోవడం విశేషం. జయ ఆస్తుల కేసుపై కర్ణాటక ప్రత్యేక కోర్టు గత ఏడాది సెప్టెంబరు 27వ తేదీన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అదే ఏడాది అక్టోబరు 17వ తేదీన జయ బెయిల్‌పై బయటకు వచ్చారు. కర్ణాటక కోర్టు తీర్పుపై జయలలిత సుప్రీం కోర్టులో చేసిన అప్పీలును విచారించాల్సిందిగా కర్ణాటక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమారస్వామిని సుప్రీం కోర్టు నియమించింది. జయ తరఫున వాదించేందుకు తమిళనాడు ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా భవానీసింగ్ నియమితులయ్యారు. జయ తరఫున వాదనను భవానీసింగ్ దాదాపు పూర్తి చేయగా 90 శాతం తీర్పు ప్రతులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో జయ కేసులో తీర్పు వెలువడుతుందని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న దశలో భవానీసింగ్ నియామకం చెల్లదంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చే శారు. దీనిపై విచారణకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించింది. విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి మదన్‌లోకూర్ భవానీసింగ్ నియామకం చెల్లదని, మరో న్యాయమూర్తి భానుమతి చెల్లుతుందని ఈనెల 4వ తేదీన ఇద్దరూ భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ పరిణామంతో సుప్రీం కోర్టు మరోసారి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు ఈ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్కే అగర్వాల్, ప్రపుల్ల సీ చంద్ ఈనెల 21వ తేదీ విచారణ ప్రారంభించి సోమవారం తీర్పు చెప్పారు. హక్కు, అధికారం లేదు : సుప్రీం జయ ఆస్తుల కేసులో అప్పీలుపై విచారణకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా భవానీసింగ్ నియామకం చెల్లదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టమైన తీర్పుచెప్పింది. ప్రభుత్వానికి హక్కు, అధికారం లేదని, చట్టప్రకారం ఇది మోసపూరితమైన చర్య అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం లేదని తోసిపుచ్చింది. భవానీ సింగ్ నియామకం చెల్లనంత మాత్రాన జయ ఆస్తుల కేసును మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషన్‌దారుడు అన్బళగన్ తన వాదనను ఈనెల 28వ తేదీలోగా లిఖితపూర్వకంగా కర్ణాటక కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. పిటిషనర్ ప్రతిని స్వీకరించిన అనంతరం తీర్పు చెప్పాల్సిందిగా కర్ణాటక న్యాయమూర్తి కుమారస్వామిని అదేశించింది. న్యాయమూర్తి తీర్పు చెప్పేముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. దేశంలో అవినీతి, లంచగొండితనం పెరిగిపోయి దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని నిర్మూలించేలా తీర్పుచెప్పాలని సూచించింది. సుప్రీం వ్యాఖ్యలతో కలకలం అవినీతి రహిత సమాజాన్ని ఆశిస్తున్నట్లుగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. జయకు జైలు జీవితం ఖాయమనే ఊహాగానాలు బయలుదేరగా, ప్రతిపక్షాలు సంబరం చేసుకుంటున్నాయి. భవానీసింగ్పై తీర్పు నిజాయితీకి, న్యాయానికి కలిగిన విజయమని డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. నిందితులుగా నిర్ధారణ అయిన వారే తమకు అనుకూలమైన వ్యక్తిని ప్రభుత్వ న్యాయవాదిగా నియమించుకోవడం ఈ కేసు విచారణలో వినోదమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ అన్నారు. అందుకే కోర్టు సరైన తీర్పును వెల్లడించిందని వ్యాఖ్యానించారు. జయ ఆస్తుల కేసు పునర్విచార ణ సాగాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ.రామకృష్ణన్ కోరారు. -
జయకేసులో మెలిక
చె న్నై, సాక్షి ప్రతినిధి : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు కోసం ఎదురుచూస్తుండగా తాజాగా మరో మెలిక ఎదురైంది. జయ అప్పీలు కేసును వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది భవానీసింగ్ నియామకంలో రేగిన వివాదమే తాజా మెలికకు కారణమైంది. జయ ఆస్తుల కేసుపై కర్ణాటక ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై జయలలిత సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. వెలువడిన తీర్పు ప్రకారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు సుమారు పదేళ్లపాటూ జయ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి లేదు. అప్పీలపై వెలువడే తీర్పుపై జయ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో దేశమంతా తీర్పు కోసం ఆతృతతో ఎదురుచూస్తోంది. జయ అప్పీలు కేసును విచారించాలని క ర్ణాటక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమారస్వామిని సుప్రీం కోర్టు నియమించింది. మూడునెలల్లోగా కేసు విచారణను ముగించాలని సైతం సుప్రీం ఆదేశించింది. జయ అప్పీలు కేసు వాదనకు తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా భవానీసింగ్ నియమితులయ్యారు. మూడు నెలల్లోగా అప్పీలుపై విచారణను పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాల కారణంగా బెంగళూరు కోర్టులో ప్రతిరోజూ విచారణ సాగింది. జయ తరపున వాదనను భవానీసింగ్ దాదాపూ పూర్తి చేశారు. అయితే భవానీసింగ్ నియామకం చెల్లదంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను సుప్రీం నియమించింది. విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి మదన్‌లోకూర్...భవానీసింగ్ నియామకం చెల్లదని, మరోన్యాయమూర్తి భానుమతి చెల్లుతుందని పేర్కొంటూ ఈ నెల4వ తేదీన తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ పరిణామంతో సుప్రీం కోర్టు మరోసారి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు ఈ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. ఈ ముగ్గురు న్యాయమూర్తుల ఎంపికపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు గత కొన్ని రోజులుగా కసరత్తు చేశారని తెలిసింది. కసరత్తు పూర్తికాగా ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టు రిజిష్ట్రారు శనివారం ప్రకటించారు. భవానీసింగ్ నియామకంపై డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్కే అగర్వాల్, ప్రపుల్ల సీ చంద్ ఈనెల 21వ తేదీ నుంచి విచారణ ప్రారంభిస్తారు. జయ, డీఎంకే తరపు న్యాయవాదులు హాజరై తమ వాదనను మరోసారి వినిపిస్తారు. ముగ్గురు న్యాయమూర్తుల్లో ఆర్కే అగర్వాల్ గతంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు రెండువారాల్లో విచారణ పూర్తిచేసి భవానిసింగ్ నియామకం చెల్లుతుంది అని తీర్పు వెలువడితే క ర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం అప్పీలు విచారణపై వెంటనే తీర్పు చెప్పాల్సి ఉంటుంది. భవానీసింగ్ నియామకం చెల్లదని తీర్పు వెలువడిన పక్షంలో తమిళనాడు ప్రభుత్వం అప్పీలుకు వెళుతుంది. అప్పీలు వల్ల అసలుకేసులో తీర్పు వాయిదా పడే అవకాశం ఉంది. జయ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం అసలు కేసుకాగా, భవానీసింగ్ నియామకంపై దాఖలైన పిటిషన్ కొసరు కేసుగా మారింది. జయ ఆస్తుల కేసులో తీర్పు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారు మరికొంత కాలం వేచి ఉండక తప్పనిస్థితి నెలకొంది. -
‘భవాని’ వద్దు
* సుప్రీం కోర్టుకు డీఎండీకే * జయలలిత కేసుకు వ్యతిరేకంగా పిటిషన్ సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అప్పీలు పిటిషన్ విచారణకు ప్రభుత్వ న్యాయవాదిగా భవానీసింగ్‌ను నియమించొద్దంటూ డీఎండీకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. భవానీసింగ్‌ను తప్పించి, మరో న్యాయవాదిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని పిటిషన్ రూపంలో గురువారం విన్నవించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలుశిక్ష పడ్డ విషయం తెలిసిందే. జయలలిత, ఆమె నెచ్చెలి శశికళతోపాటుగా ఇలవరసి, సుధాకరన్‌కు జైలు శిక్ష పడడంలో కీలక భూమిక పోషించిన న్యాయవాది భవానీ సింగ్. ప్రభుత్వ తరపున తన వాదనలను ప్రత్యేక న్యాయస్థానం ముందు ఉంచి, జైలు శిక్షపడేలా చేశారు. అయితే, జయలలిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఎట్టకేలకు కర్ణాటక న్యాయ స్థానం నుంచి బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టుకు చేరింది. అక్కడ నిబంధనలతో కూడిన బెయిల్ జయలలిత అండ్ బృందానికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో తమకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ జయలలిత అండ్ బృందం కర్ణాటక న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్లడానికి సిద్ధమైంది. అప్పీలు పిటిషన్ దాఖలుకు తగ్గ కసరత్తులు వేగవంతం అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఇచ్చిన గడువు ఆధారంగా విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. ఆయన్ను తప్పించండి: జయలలిత అండ్ బృందం అప్పీలు పిటిషన్ విచారణకు ప్రభుత్వ న్యాయవాదిగా భవానీ సింగ్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువే. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, అవగాహన ఆయనకే ఉన్నారుు. అయితే, కర్ణాటక న్యాయ స్థానంలో బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో భవానీ సింగ్ వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకున్న డీఎండీకే ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కింది. డీఎండీకే న్యాయవాది మణి ఈ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. భవానీ సింగ్‌ను ప్రభుత్వ న్యాయవాదిగా తప్పించి, ఆయన స్థానంలో అప్పీలు పిటిషన్ విచారణకు మరో న్యాయవాదిని నియమించాలని విన్నవించారు. ఒక వేళ భవానీ సింగ్ వాదించిన పక్షంలో కేసు నీరుగారే అవకాశాలుంటాయని అనుమానాలు వ్యక్తం చేశారు. తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని భవానీసింగ్‌ను తప్పించేలా కర్ణాటక న్యాయ స్థానానికి సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు బెంచ్ విచారణకు స్వీకరించింది. అదే సమయంలో ఇదే విషయాన్ని వివరిస్తూ, కర్ణాటక హైకోర్టును సైతం ఆశ్రయించవచ్చుగా అని పిటిషనర్‌కు సూచించడం విశేషం.