Bhilwara Kings
-
విధ్వంసం సృష్టించిన టేలర్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా గంభీర్ సేన
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఛాంపియన్స్‌గా గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్ నిలిచింది. బుధవారం జైపూర్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఇండియా క్యాపిటిల్స్ టైటిల్ కైవసం చేసుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు రాస్ టేలర్, మిచెల్ జాన్సన్ కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాస్ టేలర్, జాన్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టేలర్ 41 బంతుల్లో 82 , జాన్సెన్ 35 బంతుల్లో 62 పరుగులు సాధించారు. కాగా టేలర్ ఇన్నింగ్స్‌లో 4 పోర్లు, 8 సిక్స్‌లు ఉండటం గమానార్హం. ఇక అఖరిలో నర్స్(19 బంతుల్లో 42) మెరుపులు మెరిపించడంతో ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భిల్వారా కింగ్స్ బౌలర్లలో రాహుల్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పనేసర్ రెండు, బ్రెస్నెన్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భిల్వారా కింగ్స్.. 18.2 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. భిల్వారా బ్యాటర్లలో షేన్ వాట్సన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో పంకజ్ సింగ్, ప్రవీణ్ తాంబే, పవన్ సయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ప్లంకెట్, భాటియా చెరో వికెట్ సాధించారు. Time for #legendary Celebrations! 🥳@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/XBFMJtj6Zf — Legends League Cricket (@llct20) October 5, 2022 చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్ -
గెలిపించిన షేన్ వాట్సన్.. ఫైనల్‌కు బిల్వారా కింగ్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బిల్వారా కింగ్స్ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో బిల్వారా కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది.ఓపెనర్లు విలియం పోర్టర్‌ఫీల్డ్ (43 బంతుల్లో 60 పరుగులు), మోర్నీ వాన్విక్ 31 పరుగులు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్(24 బంతుల్లో 48 నాటౌట్) చివరిదాకా నిలిచి జట్టును గెలిపించాడు. ఆఖర్లో పఠాన్ బ్రదర్స్ యూసఫ్ పఠాన్(21), ఇర్ఫాన్ పఠాన్(22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రియాన్ 45, యశ్పాల్ సింగ్ 43, తిలకరత్నే దిల్షాన్ 36 పరుగులు చేశారు. బిల్వారా కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్ 2, పనేసర్, ఎడ్వర్ట్స్, బ్రెస్నన్, త్యాగిలు తలా ఒక వికెట్ తీశారు. ఇక అక్టోబర్ 8న(శనివారం) ఇండియా క్యాపిటల్స్‌తో జరగనున్న ఫైనల్లో బిల్వారా కింగ్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఆదివారం(అక్టోబర్ 2న) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చదవండి: యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా! Glimpses of @Bhilwarakings from tonight! #BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/JadTaqN5gK — Legends League Cricket (@llct20) October 3, 2022 -
LLC 2022: దంచికొట్టిన బ్యాటర్లు.. భిల్వారా కింగ్స్ ఘన విజయం! సెహ్వాగ్ సేనకు పరాభవం
Legends League Cricket 2022- Gujarat Giants vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో భిల్వారా కింగ్స్ ఘన విజయం సాధించింది. వీరేంద్ర సెహ్వాగ్ సేనపై ఇర్ఫాన్ పఠాన్ బృందం ఏకంగా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పఠాన్ సారథ్యంలోని భిల్వారా కింగ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. దంచికొట్టిన కింగ్స్ బ్యాటర్లు! ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, జెయింట్స్ బౌలర్లు భిల్వారా కింగ్స్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. కింగ్స్ ఓపెనర్లు మోర్నీ వాన్ విక్ అర్ధ శతకం(28 బంతుల్లోనే 50 పరుగులు) సాధించగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 33 బంతుల్లో 64 పరుగులతో చెలరేగాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 34 పరుగులతో రాణించగా.. జేసల్ కారియా 29 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో యూసఫ్ పఠాన్ మెరుపులు (5 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు) మెరిపించగా.. రాజేశ్ బిష్ణోయి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 12 పరుగులు సాధించాడు. ఇలా బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో భిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు స్కోరు చేసింది. చేతులెత్తేసిన జెయింట్స్ బ్యాటర్లు! గేల్, సెహ్వాగ్ కూడా విఫలం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కెవిన్ ఒ బ్రెయిన్ 2, క్రిస్ గేల్ 15 పరుగులకే నిష్క్రమించారు. కెప్టెన్ సెహ్వాగ్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇక కింగ్స్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యశ్పాల్ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఆఖర్లో రియాద్, కేపీ అప్పన్న కాసేపు పోరాడినా.. అప్పటికే పరిస్థితి చేజారడంతో 165 పరుగులకే సెహ్వాగ్ సేన కథ ముగిసింది. 57 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. ఇక కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్‌కు అత్యధికంగా మూడు వికెట్లు దక్కాయి. జేసల్ కారియా, ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. టినో బెస్ట్ ఒకటి, దినేశ్ ఒకటి, మాంటీ పనేసర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కింగ్స్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన విలియం పోర్టర్‌ఫీల్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే! Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై -
యూసఫ్ పఠాన్ మెరుపులు వృథా.. టైగర్స్ చేతిలో కింగ్స్ ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో మణిపాల్ టైగర్స్ తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం కటక్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో మణిపాల్ టైగర్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మణిపాల్ పేసర్ దిల్హార ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అఖరి ఓవర్లో భిల్వారా కింగ్స్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. ఫెర్నాండో కేవలం 5 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇకతొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మణిపాల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టైగర్స్ బ్యాటర్లలో ఓపెనర్లు జెస్సీ రైడర్(35 బంతుల్లో 47), తాటెండ తైబు(30 బంతుల్లో 54) రాణించారు. భిల్వారా బౌలర్లలో బెస్ట్ మూడు వికెట్లు, యూసఫ్ పఠాన్ రెండు, కరియా, ఎడ్వర్డ్స్ తలా వికెట్ సాధించారు. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భిల్వారా కెప్టెన్ యూసప్ ఫఠాన్ 21 బంతుల్లో 42 పరుగుల(2 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు అఖరిలో ఔట్ కావడంతో మ్యాచ్ మణిపాల్ వైపు మలుపు తిరిగింది. మణిపాల్ బౌలర్లలో ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్బజన్ సింగ్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Dinesh Karthik Vs Rishabh Pant: పంత్ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ -
కైఫ్ అర్ధ శతకం వృథా! పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! ఉత్కంఠ పోరులో భిల్వార కింగ్స్ గెలుపు
Legends League Cricket 2022- Manipal Tigers vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో మ్యాచ్‌లో భిల్వార కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్లో వరుసగా సిక్స్, 0, ఫోర్, ఫోర్ బాది టినో బెస్ట్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ సేన గెలుపుతో ఈ టోర్నీని ఆరంభించింది. కాగా లక్నో వేదికగా ఆదివారం(సెప్టెంబరు 18) మణిపాల్ టైగర్స్- భిల్వార కింగ్స్ మధ్య జరిగింది. చెలరేగిన ఫిడెల్! ఇందులో టాస్ గెలిచిన భిల్వార కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ రవికాంత్ శుక్లా వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఫిడెల్ ఎడ్వర్డ్స్(విండీస్ బౌలర్) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. మణిపాల్ టైగర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కైఫ్ అర్ధ సెంచరీ! అయినా గానీ! ఇక నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి హర్భజన్ బృందం కష్టాల్లో కూరుకుపోయిన వేళ మహ్మద్ కైఫ్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 59 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా మణిపాల్ టైగర్స్ గౌరవప్రదమైన స్కోరు(ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు) చేయడంలో కీలక పాత్ర పోషించాడు. యూసఫ్ పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! టినో మెరుపులు లక్ష్య ఛేదనకు దిగిన భిల్వార కింగ్స్ సైతం ఆదిలోనే ఓపెనర్లు నమన్ ఓజా(6 పరుగులు), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్( 4 పరుగులు) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యూసఫ్ పఠాన్ 28 బంతుల్లోనే 44 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 15, టినో బెస్ట్ 15 పరుగులతో రాణించడంతో 19.4 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి భిల్వారా కింగ్స్ టార్గెట్‌ను ఛేదించింది. ఇక మణిపాల్ టైగర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఫిడెల్ ఎడ్వర్డ్(నాలుగు వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్ T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా!