లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో మణిపాల్ టైగర్స్ తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం కటక్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో మణిపాల్ టైగర్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మణిపాల్ పేసర్ దిల్హార ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
అఖరి ఓవర్‌లో భిల్వారా కింగ్స్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. ఫెర్నాండో కేవలం 5 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇకతొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మణిపాల్ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టైగర్స్ బ్యాటర్లలో ఓపెనర్లు జెస్సీ రైడర్(35 బంతుల్లో 47), తాటెండ తైబు(30 బంతుల్లో 54) రాణించారు.
భిల్వారా బౌలర్లలో బెస్ట్ మూడు వికెట్లు, యూసఫ్ పఠాన్ రెండు, కరియా, ఎడ్వర్డ్స్ తలా వికెట్ సాధించారు. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. భిల్వారా కెప్టెన్ యూసప్ ఫఠాన్ 21 బంతుల్లో 42 పరుగుల(2 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు అఖరిలో ఔట్ కావడంతో మ్యాచ్ మణిపాల్ వైపు మలుపు తిరిగింది. మణిపాల్ బౌలర్లలో ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్బజన్ సింగ్ రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: Dinesh Karthik Vs Rishabh Pant: పంత్ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment