bhimadole
-
అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు.. మద్యం తాగి అర్ధనగ్నంగా
West Godavari: పోలసానిపల్లిలోని ఓ తోటలో బుధవారం అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఘటనా స్థలంలో మద్యం తాగి అర్ధనగ్నంగా ఉన్న ముగ్గురు యువతులు, ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక కారు, ఆరు సెల్ఫోన్లు, ఐదు మోటార్‌సైకిళ్లు, సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పంగిడిగూడెం పంచాయతీ సూర్యచంద్రరావుపేట, పంగిడిగూడెం, నల్లజర్ల, రాజమండ్రిలకు చెందిన కొంత మంది యువకులు తమ బైక్‌లపై పొలసానిపల్లిలోని ఓ తోటలోకి రాత్రి చేరుకోగా, మరో కారులో ముగ్గురు యువతులు వచ్చారు. మద్యం మత్తులో ఐటెంసాంగ్స్‌తో అర్ధనగ్నంగా ఉన్న యువతులతో అరుపులు, కేకలతో యువకులు చిందులేశారు. దీంతో ఆ ప్రాంతం హోరెత్తింది. చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) స్థానికుల సమాచారంతో ఎస్సై వీఎస్వీ భద్రరావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువతులు, యువకులు చిందులేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి అచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనలకు తిలోదకాలిస్తూ అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించామని ఎస్సై తెలిపారు. -
మంత్రి తానేటి వనితకు గాయాలు..
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని భీమడోలులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ వెళ్తుండగా భీమడోలు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్ వాహనం తప్పించబోయిన మంత్రి వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రి వనితకు స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చింతమనేనికి పదవీ గండం?
-
టీడీపీ వర్గీయుల దాష్టీకం
భీమడోలు: భీమడోలు గాంధీబొమ్మ సెంటర్లో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య రేగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేత వర్గీయులు మరో వర్గానికి చెందిన ముగ్గురు యువకులను కర్రలతో చితకబాదారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మరింత రెచ్చిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలో కొప్పుల వెలమ వర్గీయులు, తూర్పు నుంచి వచ్చిన ఇతర కులాల వారికి మధ్య వివాదం నడుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో ఓ వివాహేతర సంబంధం కూడా వివాదానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో భీమడోలులో టీడీపీ వార్డు సభ్యుడు ఆదిరెడ్డి సత్యనారాయణ వర్గీయులు మరో వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ కడవకొల్లు రాంబాబును టెలిఫోన్ స్తంభానికి కట్టి చితకబాదారు. దీనిపై ప్రశ్నించిన రాంబాబు స్నేహితులు కర్రి అనిల్, బూర్లు భాస్కరరావులపై కూడా దాడి చేశారు. అరుపులు, కేకలతో గాంధీ బొమ్మ సెంర్ దద్దరిల్లింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఎస్సై బి.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. స్తంభానికి కట్టిన రాంబాబును వదిలించారు. తీవ్రగాయాలైన రాంబాబు, అనిల్, భాస్కరరావును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిరెడ్డి సత్యనారాయణతో పాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
భీమడోలు/ఏలూరు అర్బన్ : భీమడోలు రాష్ట్ర రహదారిపై సోమవారం సాయంత్రం ఓ లారీ తోపుడు బండిని ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తోపుడు బండిపై మంచినీటి బిందెలను తీసుకుని వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పోలసానిపల్లి గ్రామానికి చెందిన బర్ల అప్పారావు(58) భీమడోలు జంక్షన్‌లోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. అతనికి హోటల్ నిర్వాహకులు తోపుడు బండిపై మంచినీటి బిందెలను తరలించే పనిని పురమాయించారు. అతనికి సహాయకారిగా భీమడోలు పంచాయతీ పరిధిలోని ఆర్జావారిగూడెంకు చెందిన కూరపాటి రూపమ్మను నియమించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ భీమడోలు ఎంపీడీవో కార్యాలయంలోని మంచినీటి పథకం వద్దకు వచ్చి బిందెలను నీటితో నింపుకుని తిరిగి భీమడోలు జంక్షన్ వైపుగా వెళ్తుండగా.. ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తోపుడు బండి నుజ్జునుజ్జయింది. అప్పారావు, రూపమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని తొలుత భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రా«థమిక చికిత్స అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందాడు. రూపమ్మ చికిత్స పొందుతోంది. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఏలూరు (సెంట్రల్) : రైలు నుంచి జారిపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు రైల్వేస్టేషన్ సమీపంలో సుమారు 40 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడు ఎత్తు 5.6 అడుగులు ఉండి బ్లూ కలర్ షర్టు, జీన్ ఫ్యాంటు ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు 9440627572, 08812– 231006 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. హెడ్‌కానిస్టేబుల్ జి.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. -
శ్రీవారి దేవస్థానానికి రూ.1.27 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు బుధవారం రూ.1.27 లక్షల విరాళం అందజేశారు. భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన కల్లి నారాయణ అప్పారావు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,00,008, ఆలయ విమానగోపుర స్వర్ణమయ పథకానికి రూ.27,000 మొత్తం రూ.1,27,008ను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావుకు అందజేశారు. దాతకు చైర్మన్ సుధాకరరావు, ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్లు అందజేశారు. -
భారీ కంటెయినర్ బోల్తా : ఇద్దరు మృతి
భీమడోలు (పశ్చిమగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న భారీ కంటెయినర్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జాతీయరహదారిపై పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రంలోని రైల్వేగేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో.. లారీ దూసుకెళ్లి రోడ్డుపై ఉన్న వికలాంగుడిని ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ రోడ్డుపై ఉన్న చిన్న దేవాలయాన్ని ఢీకొట్టి సమీపాన ఉన్న బస్టాండ్ షెల్టర్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో లారీలో ఇద్దరు వ్యక్తులు ఉండగా, ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి లారీలో చిక్కుకొని ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
మినీవ్యాన్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ
భీమడోలు :గుండుగొలను సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఐసర్ వ్యాన్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో బస్ డ్రైవర్ దుర్మరణం చెందగా, బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ మంగళవారం రాత్రి అమలాపురం బయలుదేరింది. మార్గమధ్యంలో గుండుగొలను సమీపంలోకి వచ్చేసరికి పిడుగురాళ్ల నుంచి రాజమండ్రికి పచ్చిమిరపకాయల లోడుతో వెళుతూ టైర్ పంక్చర్‌కావడంతో రోడ్డుపై నిలిచి ఉన్న ఐసర్ వ్యాన్‌ను వెనుక నుంచి వేగంగా వస్తూ ఆర్టీసీ బస్ ఢీకొంది. దీంతో బస్సును నడుపుతున్న డ్రైవర్ శ్రీకాకుళం జిల్లా చిగడాం మండలం రౌతు గ్రామానికి చెందిన దండు రమేష్‌రాజు (32) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బస్సులో ప్రయాణృకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. స్థానికులు కొందరు స్పందించి 108కు సమాచారం అందించి క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ ఎన్.దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. హైవే అధారిటీకి చెందిన వాహనంతో బస్సును పక్కకు జరిపారు. గుండుగొలను వీఆర్వో పి.పోతురాజు పంచనామా నిర్వహించారు. డ్రైవర్ మృతదేహాన్ని ఏలూరు తరలించి ఎస్సై బిృసురేందర్‌కుమార్ కేసు నమోదు చేశారు. క్షతగాత్రులకు ఏలూరులో చికిత్స ఏలూరు (వన్‌టౌన్) : ప్రమాదంలో గాయాలపాలైన వారిలో ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. అమలాపురం, ముమ్మిడివరానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్లు వలవల సత్యనారాయణ మూర్తి, కొప్పిశెట్టి సత్యనాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన ఎల్లమిల్లి ప్రియాంక, హైదరాబాద్‌కు చెందిన కొండేటి శ్యామల, కర్రి వీరభధ్రలక్ష్మీనారాయణ, విజయనగరం ఆలమందకు చెందిన కొచ్చెర్లపాటి రాజేష్ (వ్యాన్ క్లీనర్), పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు వీరమళ్ల బాలచంద్రుడు గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.