భీమడోలు గాంధీబొమ్మ సెంటర్‌లో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య రేగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేత వర్గీయులు మరో వర్గానికి చెందిన ముగ్గురు యువకులను
టీడీపీ వర్గీయుల దాష్టీకం
Published Thu, May 25 2017 1:48 AM | Last Updated on Fri, Aug 10 2018 9:23 PM
భీమడోలు: భీమడోలు గాంధీబొమ్మ సెంటర్‌లో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య రేగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేత వర్గీయులు మరో వర్గానికి చెందిన ముగ్గురు యువకులను కర్రలతో చితకబాదారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మరింత రెచ్చిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలో కొప్పుల వెలమ వర్గీయులు, తూర్పు నుంచి వచ్చిన ఇతర కులాల వారికి మధ్య వివాదం నడుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో ఓ వివాహేతర సంబంధం కూడా వివాదానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో భీమడోలులో టీడీపీ వార్డు సభ్యుడు ఆదిరెడ్డి సత్యనారాయణ వర్గీయులు మరో వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ కడవకొల్లు రాంబాబును టెలిఫోన్ స్తంభానికి కట్టి చితకబాదారు. దీనిపై ప్రశ్నించిన రాంబాబు స్నేహితులు కర్రి అనిల్, బూర్లు భాస్కరరావులపై కూడా దాడి చేశారు. అరుపులు, కేకలతో గాంధీ బొమ్మ సెంర్ దద్దరిల్లింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఎస్సై బి.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. స్తంభానికి కట్టిన రాంబాబును వదిలించారు. తీవ్రగాయాలైన రాంబాబు, అనిల్, భాస్కరరావును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిరెడ్డి సత్యనారాయణతో పాటు 15 మందిపై కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement