Bhimavaram Talkies banner
-
చిన్న సినిమాలకు ఏటీటీ కరెక్ట్
‘‘నేను వరంగల్‌లో వ్యాపారం చేసేవాణ్ని. నటుడు కావాలనే ఆసక్తితో హైదరాబాద్ వచ్చి, 5 సినిమాల్లో నటించాను. స్నేహితుల చేయూతతో ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అనే సినిమా తీశాను’’ అని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. ఆయన నిర్మించిన ఈ సినిమా భీమవరం టాకీస్ వారి ఏటీటీలో (ఎనీ టైమ్ థియేటర్) ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా పూర్తయ్యాక చాలామందికి చూపించాను. లాక్‌డౌన్‌కి చాలా రోజుల ముందే పూర్తయింది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఆదరణ తక్కువగా ఉండటం వల్ల వ్యాపారం జరగలేదు. విడుదలకు పబ్లిసిటీ కోసమే 20 లక్షలు ఖర్చు పెట్టాలి.. అది తిరిగి వస్తుందన్న గ్యారంటీ కూడా లేక సినిమాను విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మగారి ‘క్లైమాక్స్’ సినిమా ఏటీటీ ద్వారా విడుదలయింది. భీమవరం టాకీస్‌పై ఏటీటీ పెట్టడంతో నిర్మాత రామ సత్యనారాయణగారిని కలిశాను. ఇచ్చిన మాట ప్రకారం తన సినిమాను కూడా ఆయన పక్కన పెట్టి మా సినిమాను ఈరోజు విడుదల చేస్తున్నారు. చిన్న సినిమాలకు ‘ఏటీటీ’ కరెక్ట్ వేదిక. ఇప్పుడు ఏటీటీ కోసమే బేస్ చేసుకుని సినిమాలు తీస్తాను’’ అన్నారు. -
ఇద్దరమ్మాయిల ప్రేమ!
శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో భీమవరం టాకీస్ పతాకంపై శ్రీ రాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఎఫైర్’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ శ్రీ రాజన్ మొత్తం తానై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరమ్మాయిల ప్రేమకు ఎవరు అడ్డుపడ్డారు? చివరికి ఏమైంది అన్నదే కథ. ఇప్పటి వరకూ నేను రిలీజ్ డేట్ ప్రకటించి సినిమాను పోస్ట్‌పోన్ చేయలేదు. కానీ మేము అనుకున్న డేట్‌కు ఎక్కువ సినిమాలు రిలీజ్ అవడం వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేశాం. నవంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు. ఈ చిత్రానికి శేషు సంగీతం అందించారు. -
ఈ రెండో ‘ఐస్‌క్రీమ్’ఇంకా బాగుంటుంది
- వర్మ ‘‘ ‘ఐస్‌క్రీమ్’ సినిమా అంతా ఒకే ఇంట్లో చిత్రీకరించాం. కానీ ‘ఐస్‌క్రీమ్-2’ను మాత్రం అవుట్‌డోర్‌లో చాలామంది ఆర్టిస్టులతో తీశాం. మొదటి ‘ఐస్‌క్రీమ్’ కంటే, ఈ రెండో ‘ఐస్‌క్రీమ్’ ఇంకా బాగుంటుంది’’ అని రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. జేడీ చక్రవర్తి, నవీన, నందు, భూపాల్, సిద్దు ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఐస్‌క్రీమ్-2’ ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించిన తుమ్మలపల్లిని జేడీ చక్రవర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో నందు, మల్టీ డెమైన్షన్ వాసు, ధన్‌రాజ్, సత్య, జేకే భారవి తదితరులు మాట్లాడారు.