కేతన్, ప్రాచీ సర్కార్
‘‘నేను వరంగల్‌లో వ్యాపారం చేసేవాణ్ని. నటుడు కావాలనే ఆసక్తితో హైదరాబాద్ వచ్చి, 5 సినిమాల్లో నటించాను. స్నేహితుల చేయూతతో ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అనే సినిమా తీశాను’’ అని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. ఆయన నిర్మించిన ఈ సినిమా భీమవరం టాకీస్ వారి ఏటీటీలో (ఎనీ టైమ్ థియేటర్) ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా పూర్తయ్యాక చాలామందికి చూపించాను. లాక్‌డౌన్‌కి చాలా రోజుల ముందే పూర్తయింది.
చిన్న బడ్జెట్ సినిమాలకి ఆదరణ తక్కువగా ఉండటం వల్ల వ్యాపారం జరగలేదు. విడుదలకు పబ్లిసిటీ కోసమే 20 లక్షలు ఖర్చు పెట్టాలి.. అది తిరిగి వస్తుందన్న గ్యారంటీ కూడా లేక సినిమాను విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మగారి ‘క్లైమాక్స్’ సినిమా ఏటీటీ ద్వారా విడుదలయింది. భీమవరం టాకీస్‌పై ఏటీటీ పెట్టడంతో నిర్మాత రామ సత్యనారాయణగారిని కలిశాను. ఇచ్చిన మాట ప్రకారం తన సినిమాను కూడా ఆయన పక్కన పెట్టి మా సినిమాను ఈరోజు విడుదల చేస్తున్నారు. చిన్న సినిమాలకు ‘ఏటీటీ’ కరెక్ట్ వేదిక. ఇప్పుడు ఏటీటీ కోసమే బేస్ చేసుకుని సినిమాలు తీస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment