Bhogapuram Greenfield Airport
-
విజయనగరం భోగాపురం బహిరంగ సభకు భారీగా తరలి వస్తున్న జనం (ఫొటోలు)
-
అటు అదానీ డేటా సెంటర్.. ఇటు భోగాపురం ఎయిర్‌పోర్టు
పనులే ప్రారంభం కానప్పుడు.. అది ఉత్తుత్తి శంకుస్థాపనే అవుతుంది కదా. గతంలో చంద్రబాబు హయాంలో జరిగింది అదే. కానీ, కోర్టు కేసులు పరిష్కరించి.. అన్ని అనుమతులతో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం. భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై కేసుల పరిష్కారం తర్వాత.. కేంద్రం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం నేడు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే క్రమంలో మొదటి అడుగు వేయబోతోంది. ఒకవైపు.. రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ అసలైన శంకుస్ధాపన జరగనుంది. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం, ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల విస్తరణను రాబోయే కాలానికి లక్ష్యంగా పెట్టుకుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ► పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడిసీఎల్) ఒప్పందం ► ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం, ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానం ► అంతర్జాతీయ ఎగ్జిమ్ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ అభివృద్ది ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్ ► 16 వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలు ► విశాఖపట్నం–భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం, రెండువైపులా సర్వీసు రోడ్లు ► ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి. ఇదీ చదవండి: అల భోగాపురంలో... నాడు నా(రా)టకం.. నేడు జగ‘నిజం’ ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు పునరావాసం విమానాశ్రయం కోసం స్వఛ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన 4 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో పునరావాసం, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వసతి కల్పించడం కూడా ఇప్పటికే జరిగింది. మరోవైపు.. ► అదానీ డేటా సెంటర్.. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా... రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్) ఏర్పాటు కానుంది. ► అదానీ డేటా సెంటర్ ద్వారా.. డేటా హబ్‌తో గణనీయంగా పెరగనున్న డేటా స్పీడ్, సింగపూర్ నుండి విశాఖపట్నం వరకు సముద్ర సబ్ మెరైన్ కేబుల్ ఏర్పాటు, తద్వారా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ 5 రెట్లు పెరిగి భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్ధలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. ► విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల వృద్ది, భారీ స్ధాయిలో హైటెక్ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం, విశ్వసనీయమైన డేటా భద్రత, సేవల ఖర్చులలో తగ్గుదల ► అధునాతన టెక్ కంపెనీలు విశాఖపట్నం ను ఎంచుకునే వీలు, తద్వారా ఐటీ రంగంలో పెరగనున్న ఆర్ధిక కార్యకలాపాలు ► డేటా సెంటర్‌కు అనుంబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్శిటీ, స్కిల్ సెంటర్ల ద్వారా యువతలో నైపుణ్యాల పెంపుకు మరింత ఊతం, బిజినెస్ పార్క్ రిక్రియేషన్ సెంటర్ల ద్వారా మారనున్న ఉద్యోగుల జీవన శైలి అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్ ఏర్పాటు, త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్‌ల అభివృద్ది, తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి కల్గనుంది. ఇదీ చదవండి: విశ్వనగరంలో వెలుగు రేఖలు -
విశాఖ ఐటీ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
సీఎం జగన్ పర్యటన.. లైవ్ అప్డేట్స్ ► ఈ సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుంది : సీఎం జగన్ ►విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉంది, డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంది, విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది ►విశాఖ వాసులకు డేటా సెంటర్ గొప్ప వరం, డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు ►దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖకు వస్తోంది, ఇంత పెద్ద డేటా సెంటర్ దేశంలో ఎక్కడా లేదు ►డేటా సెంటర్ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్‌నకు కృతజ్ఞతలు ►డేటా సెంటర్‌తో ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుంది, డేటా సెంటర్‌తో విశాఖ ఏ1 సిటీగా మారనుంది ► గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా చూడండి. మంచి జరిగిందని భావిస్తే నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మీ ముందుకు వచ్చే అర్హత ఉంది. మరి చంద్రబాబు నాయుడికి అలా అడిగే దమ్ముందా?.. చేసింది చెప్పడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం లేదు. చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడు. ► దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఈ 47 నెలల కాలంలో 2.10లక్షల కోట్ల రూపాయలు డీబీటీ చేశాం, గతానికి, ఇప్పటికీ తేడాను గమనించమని కోరుతున్నాం ► సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుంది. ► చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను ప్రారంభించాం. అదానీ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారుతుంది. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్‌పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేశాం. ► కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. ► మొదటి ఫేజ్‌లో 60 లక్షల మంది రవాణాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల మంది ప్రయాణిస్తారు. ఏ380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఏర్పాట్లు చేస్తాం. ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం గుర్తొస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశాం. ► ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్ సెంటర్ పనులను పూర్తి చేశాం. జూన్ నెలలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను జాతికి అంకితం చేస్తాం. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. ► రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం. ► భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ► విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్రీడీ మోడల్‌ను పరిశీలించిన సీఎం జగన్. కాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ► సీఎం జగన్ భోగాపురం చేరుకున్నారు.. మరికాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ► విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. ► విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ► ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం భూమి పూజ చేస్తారు. ► దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. విజయనగరం పర్యటనలో.. మరో రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు ► తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్.. జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు సీఎం జగన్ సంకల్పించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ చేపట్టారు. 2024 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. ► విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అదానీ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కానున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. ► అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొత్త ఎత్తులు
విజయనగరం కంటోన్మెంట్: రోజురోజుకూ సమస్యాత్మకంగా మారుతున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ భూ సేకరణ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు కొత్త దారులు వెతుకుతున్నారు. నిర్వాసిత గ్రామాల్లోకి అధికారులు వెళ్లడంతో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. కేసులు పెడతామని హెచ్చరించినా, సెక్షన్ 30ని అమలు పరచినా ఎయిర్‌పోర్టు బాధితులు వెరవకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులను ఒప్పించేందుకు అడపా దడపా వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అసలు గ్రామాల్లోకి అడుగుపెట్టనీయడంలేదు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనితను బుధవారం సుమారు రెండు గంటల పాటు నిర్బంధించారు. ఎయిర్‌పోర్టు బాధితుల ఆగ్రహాన్ని చూసి ద్వితీయ శ్రేణి అధికారులు గ్రామాల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అధికారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. గ్రామాల్లోకి ఎవరినీ రానీయడం లేదు కనుక నిర్వాసితులనే కలెక్టరేట్‌కు పిలిపించి చర్చించాలని నిర్ణయించారు. కలెక్టరే స్వయంగా నిర్వాసితులతో చర్చించేలా చర్యలు ప్రారంభించారు. భూములు, ఇళ్లు కోల్పోనున్నవారిని, పోరాట కమిటీ నాయకులను కలెక్టరేట్‌కు త్వరలోనే పిలిపించి దశలవారీగా చర్చించనున్నారు, ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన నిర్వాసితులు, నాయకులతో చర్చించి, విమానాశ్రయ అవసరాన్ని తెలియజెప్పి వారిని ఒప్పించేందుకు నిర్ణయించినట్టు భోగట్టా. మరో పక్క విమానాశ్రయం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. సేకరించాల్సిన 5,311.88 ఎకరాలను సర్వే చేసి, హద్దులు నిర్ణయించేందుకు ఈ నిధులు వెచ్చించాలని ఉత్తర్వులు వచ్చాయి. -
పల్లె కంటకన్నీరు
విజయనగరం కంటోన్మెంట్: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తొమ్మిది గ్రామా ల ప్రజలు భగ్గుమంటున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి మండలంలోని 9 గ్రామాల్లో 5,311.88 ఎకరాలను భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో భూ సేకరణ చేపడితే విభిన్నంగా ఉద్యమించాలని భోగాపురం ప్రాంత వాసులు పలు నిర్ణయాలను తీసుకున్నారు. గూడెపు వలస, కౌలువాడ, రావాడ, ముంజేరు, కొంగవాని వలన, కంచేరు, కంచేరుపాలెం, సవరవిల్లి, ఎ.రావివలస గ్రామాల్లో భూ సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో పలు ప్రకటనలు వెలువడినప్పుడు జిల్లాకేంద్రాన్ని కేంద్రీకృతం చేసుకుని పోరాటాలు చేశారు. సర్వేకోసం వచ్చిన రైట్బృందాన్ని మూకుమ్మడిగా అడ్డుకున్నారు. బృందంలోని ఇద్దరు సభ్యులను తరిమికొట్టారు. మరో పక్క మండలం కేంద్రం, జిల్లా కేంద్రాల్లో నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. బాధిత గ్రామాల్లోనే దీక్షలు ఎక్కడైతే భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందో ఆయా గ్రామాల్లో రోజుకో గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో రిలే నిరాాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. యువత ఓ సారి, మహిళలు మరోసారి, రైతాంగమంతా ఇంకోసారి నిరసన దీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ సారి దీక్షలు, పోరాటం ఉద్ధృతంగా ఉంటుందని విమానాశ్రయ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన సందర్భంగా కమిటీ సభ్యులు కొత్త ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగానే ఉద్యమానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రస్థాయి నాయకులను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి వారితో పాటు రాష్ర్ట స్థాయిలో ఉన్న నాయకులు కూడా పొల్గొంటే పోరాటానికి మరింత ఊతమిచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం త్వరలో భూ సేకరణ చట్టంలో కొత్త ఆర్డినెన్స్ వస్తుందని, దీని వల్ల ఆర్డినెన్స్ అమలయ్యే వరకూ విమానాశ్రయ నిర్మాణానికి ఒక్క అడుగూ ముందుకు వేయలేమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కృతనిశ్చయంతో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూములను తీసుకునేందుకు కృత నిశ్చయంతో ప్రభుత్వ యంత్రాంగం పథకం రచిస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలను నిషేధించింది. ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేసేందుకు జాయింట్ కలెక్టర్ బి రామారావు, బొబ్బిలి ఎస్డీసీ అనితలను నియమించింది. భూములను ఇప్పటికే గుర్తించినందున భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలూ లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పోరాటాలు చేసి న వారిని తగ్గించేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ వినియోగించా లని భావిస్తోంది. అవసరమైతే సెక్షన్-30 ఎలాగూ ఉందనే భావన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. ఇక భవిష్యత్తులో ప్రభుత్వ యంత్రాంగం నిర్వాసితుల మధ్య పెద్దస్థాయిలో పోరు జరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.