హైజాకింగ్ చెయ్ - ఎంపీ సీటు కొట్టు
భోలా పాండే, దేవేంద్ర నాథ్ - ఈ ఇద్దరూ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు. కానీ వీరిద్దరూ హైజాకర్లు. వీరిద్దరిపై హైజాకింగ్ చేసినందుకు కేసులు నమోదయ్యాయి. వారు జైళ్లలో కూడా మగ్గారు. దేవేందర్ నాథ్ ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే అయ్యారు. యుపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక భోలా పాండే కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. అదీ రెండు సార్లు. ఈ సారి ఉత్తరప్రదేశ్ లోని సలేమ్ పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా రంగంలోకి దిగారు.
1978 డిసెంబర్ 20 న జనతాసర్కారు అరెస్టు చేసిన ఇందిరాగాంధీని విడుదల చేయాలన్న డిమాండ్ తో భోలా పాండే, దేవేంద్ర నాథ్ లు విమానాన్ని దారి మళ్లించారు. వందలాది ప్రయాణికుల జీవితాలను పణంగా పెట్టారు. అయితే ఆరి వద్ద ఉన్న పిస్తోళ్లు బొమ్మ పిస్తోళ్లే. తరువాత కాలంలో వారిని సంజయ్ గాంధీ చేరదీశారు. ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు.
పాండేజీకి టికెట్ ఇవ్వడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. 1981 సెప్టెంబర్ 29 న జర్నేల్ సింగ్ భింద్రావాలే విడుదల కోరుతూ ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానాన్ని అయిదుగురు సిక్కు ఉద్యోగులు లాహోర్ కి దారి మళ్లించారు. వారు ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. పాండే ఎలా హీరోఅయ్యాడు. వీరెలా ఎందుకు దోషి అయ్యారని సిక్కు అతివాద వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.