ఘనంగా బోనాల పండుగ
కోదాడరూరల్): మండల పరిధిలోని బొజ్జగూడెంతండాలో శ్రావణమాసం మొదటి ఆదివారం గ్రామా దేవతైన ‘ముత్యాలమ్మ’ తల్లి కి బోనాల సమర్పించారు. మహిళలు గ్రామ శివారులో ఉన్న గుడి వద్దకు బోనాలతో వచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు పంతులు, సుశీల, గుగులోతు శ్రీను, నాగేశ్వరావు, లచ్య, మహిళలు పాల్గొన్నారు.