ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
వరంగల్ జిల్లా ఏటూరునాగారం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహం విద్యార్థి అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కడుపునొప్పితో బాధపడుతున్న ఏడవ తరగతి విద్యార్థి భూక్యా రాయషెల్ను సిబ్బంది ఏటూరు నాగారం ఆస్పత్రికి బుధవారం ఉదయం తీసుకెళ్లారు. కొద్దిసేపటికే అతడు మృతి చెందాడు. కామెర్ల వ్యాధి వల్లే మృతి చెందినట్టు సమాచారం. తమకు సమాచారం అందించకుండానే తమ కుమారుడ్ని ఆస్పత్రికి తరలించారని మృతుడి తండ్రి భూక్యా బీకోజీ ఆరోపించాడు.