bhuma nagireddy death
-
గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి
-
నేనొక స్నేహితున్ని కోల్పోయాను: మోహన్‌బాబు
ప్రముఖ రాజకీయ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంపై సినీ నటుడు మోహన్‌బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'భూమా మరణం నన్ను ఎంతగానో బాధించింది. నేను ఒక మంచి స్నేహితుడిని, మా కుటుంబం మంచి సన్నిహితుడిని కోల్పోయింది. కోయంబత్తూరులో ఉన్న నన్ను భూమా మరణం కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను' అని మోహన్‌బాబు పేర్కొన్నారు. భూమా మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం రాజకీయ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మృతిపై కాంగ్రెస్ నేత, ఎంపీ చిరంజీవి, సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, సంతాపం తెలిపారు. భూమా కుటుంబసభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. నంద్యాల నియోజకవర్గానికి భూమా విశేషమైన సేవలు అందించారని, ఆయన మరణం ఆ నియోజకవర్గానికి తీరని లోటని బాలకృష్ణ పేర్కొన్నారు. -
గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి
నంద్యాల: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఈ రోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా పిట్స్ వచ్చాయని, వెంటనే ఆయన్ను ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారని డాక్టర్ హరినాథ్ చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల తీసుకొచ్చారని తెలిపారు. భూమాకు తీవ్ర గుండెనొప్పి రావడంతో పల్స్ రేట్ పడిపోయిందని, దాదాపు రెండు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని డాక్టర్ హరినాథ్ చెప్పారు. 1999లో నాగిరెడ్డికి మొదటిసారి బైపాస్ సర్జరీ చేశారని, ఏడాదిన్నర క్రితం ఆయనకు మరోసారి గుండెపోటు రావడంతో యాంజియోగ్రామ్ చేశారని తెలిపారు. భూమాకు షుగర్, బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నాయని చెప్పారు. నాగిరెడ్డికి గుండెనొప్పి రావడానికి తీవ్ర మానసిక ఒత్తిడి కూడా కారణమని డాక్టర్ హరినాథ్ తెలిపారు.