Bhuvanagiri district
-
దొంగబాబా...
-
బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న మూసీనది
-
23 అడుగుల శాసన స్తంభం.. 898 ఏళ్ల చరిత్ర వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: రాతిఫలకలపై చెక్కిన శాసనాలు చాలా కన్పిస్తాయి..కానీ, శాసనం కోసం ఇలా 23 అడుగుల ఎత్తైన స్తంభాన్ని ఏర్పాటు చేసిన అరుదైన ఘట్టం కళ్యాణ చాళుక్యుల కాలంలో జరిగింది. ఈ స్తంభానికి 898 ఏళ్లు. ఈ స్తంభం భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి ఆరు కి.మీ.దూరంలో ఉన్న కొలునుపాక ఊబదిబ్బపై ఉంది. ఆరో విక్రమాదిత్యుని కుమారుడు సోమేశ్వరుని కీర్తి కోసం స్థానిక అంబర తిలకమనే జైనబసది భోగానికి (భోజన సదుపాయం) పానుపురాయి గ్రామాన్ని సర్వబాధా పరిహారంగా దానం ఇచ్చిన సందర్భంలో 1125లో వేయించిన శాసనంగా తెలుస్తోంది. నాలుగు వైపులా కన్నడ భాషలో... స్తంభం నలువైపులా 151 పంక్తులతో కన్నడంలో శాసనం చెక్కి ఉంది. నాటి చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రతిబింబంగా ఉన్న ఈ శాసనం ప్రస్తుతం ఒకవైపు వంగిపోతూ కూలిపోయే స్థితికి చేరుకుంది. చుట్టూ ముళ్లపొదలు, బురదతో నిండి అడుగుతీసి అడుగు వేయాలంటేనే కష్టంగా మారిందని, ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా దానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. అందులో కొలనుపాక సోమేశ్వరాలయం కూడా ఒకటి. ఆలయానికి చేరువగానే ఉన్న ఈ శాసన మూలస్తంభాన్ని హెరిటేజ్ ఆర్కిటెక్టు శ్రీలేఖతో కలిసి పరిశీలించారు. కుమార సోమేశ్వరుడు, త్రికలింగాధిపతిని, ద్రావిడ దేశాధిపతిని జయించాడని, అతని దండనాయకుడైన స్వామిదేవుడు హరి, హర, జిన, బుద్ధ అనే చతుస్సమయాలను ప్రోత్సహించాడన్న విషయాలు శాసనంలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ అరుదైన శాసన స్తంభాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొలనుపాకకు వచ్చే పర్యాటకులు ఈ శాసనస్తంభాన్ని చూసేలా ఏర్పాట్లు చేసి దాన్ని ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. -
వెంటాడి చంపేస్తున్నారు.. మొన్న భువనగిరి, నిన్న సరూర్‌నగర్, నేడు బేగంబజార్..
సాక్షి, హైదరాబాద్: భువనగిరి జిల్లా లింగ రాజుపల్లికి చెందిన ఎరుకుల రామకృష్ణ మరో కులానికి చెందిన భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత కూడా భర్తను వదిలేయమని పలుమార్లు కూతురిని బెదిరించినా వినకపోవటంతో అల్లుడిని మట్టుబెట్టాలని మామ పల్లెపాటి వెంకటేష్ నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి దారుణంగా చంపించాడు. ►సరూర్‌నగర్‌కు చెందిన బి.నాగరాజు అన్య మతానికి చెందిన అశ్రిన్ సుల్తానాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. దీంతో కక్ష కట్టిన అశ్రిన్ అన్నయ్య మహ్మద్ మొబిన్ అహ్మద్, తన బావ (మరో సోదరి భర్త) మహ్మద్ మసూద్ అహ్మద్‌తో కలిసి సరూర్‌నగర్‌లో నడి రోడ్డు మీద నాగరాజు పై సెంట్రిగ్ రాడ్, కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు. ►బేగంబజార్ కోల్సావాడికి చెందిన నీరజ్ పన్వార్, వేరే కులానికి చెందిన సంజనను ప్రేమించాడు. వీరి ప్రేమను పెద్దలు నిరాక రించడంతో ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసు కొని పాతబస్తీ శంషీర్‌గంజ్‌లో ఉంటు న్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వైరం మొదలైంది. శుక్రవారం రాత్రి నీరజ్ తాతతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. చేపల మార్కెట్ సమీపంలో నలుగురు దుండ గులు నీరజ్‌ను చుట్టుమట్టు కత్తులతో పొడిచి, రాళ్లతో మోది హత్య చేశారు. ఇలా భాగ్యనగరం పరువు హత్యలతో తల్ల డిల్లుతోంది. చంపేది, చంపించేది అండగా ఉండాల్సిన కుటుంబీకులే కావటం విషాద కరం. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తండ్రి, వేరే మతస్తుడిని మనువాడిందని అన్న, వేరే కులస్తుడిని వివాహం చేసుకుందని మొత్తం కుటుంబమే కక్షగట్టి పరువు హత్య లకు పాల్పడుతున్నారు. చదవండి: చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా! హత్యలకు సాంకేతికత వినియోగం.. పోలీసులకు దొరికిపోతామని, అరెస్ట్ చేసి జైలుకెళతామని తెలిసినా ఏమాత్రం బెదరడం లేదు. పైకి ప్రేమను నటిస్తూనే ఎప్పుడు చంపాలి? ఎలా చంపాలి? పక్కా ప్రణాళికలు రచించి, అనువైన సమయంలో అంతమొంది స్తున్నారు. సొంత వారిని మట్టుబెట్టేందుకు నిందితులు సాంకేతికతను కూడా వినియోగి స్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ల కదలికలను ఆరా తీస్తున్నారు. నాగరాజు మర్డర్ కేసులో జరిగిందిదే. ఎలాగైనా చెల్లిలి భర్తను అంత మొందించాలని నిర్ణయించుకున్న మొబిన్.. నాగరాజు సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేశాడు. ఇందు కోసం ఈ– మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సం పాదించి తద్వారా సెల్‌ఫోన్‌ను ట్రాకింగ్ చేశా డు. అనువైన సమయం చూసి హత్య చేశాడు. ఫొటోలు, వీడియోలు తీస్తూ జనాలు.. పరువు హత్యలు జరుగుతున్నదో ఎక్కడో శివారు ప్రాంతాల్లో కాదు, నడిరోడ్ల మీద. కిక్కిరిసిన ట్రాఫిక్‌లో ఏమాత్రం బెరుకు, భయం లేకుండా నిందితులు హత్య చేస్తు న్నారు. హత్య జరిగే సమయంలో చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా సెల్ఫోన్లో ఫొటోలు, వీడి యోలు తీస్తూ నిశ్చేష్టులుగా ఉండిపోతు న్నారు. సరూర్‌నగర్‌లో నడిరోడ్డు మీద నాగ రాజును మొబిన్ హత్య చేస్తుంటే సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ ఉండిపోయారే తప్ప ఒక్కరైనా స్పందించి ఉంటే తన భర్త నాగరాజు బతికే వాడని అశ్రిన్ రోదించడం, మనిషిలో మాన వత్వం చనిపోయిందనడానికి ఇదో ఉదాహరణ. చట్టాలు, పోలీసులు డోంట్ కేర్.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారన్న అక్కసు తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. దీనికి తోడు బంధువులు, స్నేహితుల సూటిపోటి మాటలతో వారిలో కోపం మరింత కట్టలు తెంచుకుంటుంది. దీంతో హత్యలు చేయ డానికైనా, చేయించేందుకైనా వెనకా డట్లేదు. క్షణికావేశంలో హత్యలు చేసి, జీవితకాలం శిక్ష విధించుకుంటున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. చట్టాలు, పోలీసులంటే గౌరవం, భయం లేకుండా పోయింది. పరువు హత్యల కేసుల్లో నిందితులు త్వరగానే పట్టుబడుతుండటం గమనార్హం. -
యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు
-
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
-
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
సాక్షి, భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి హత్యోదంతంతో రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈనేపథ్యంలో నిరసన చేపట్టిన భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. (చదవండి : పెట్రోల్ పోసి.. నిప్పంటించి..) నిరసనకు దిగిన సిబ్బందిని అక్కడి ప్రజలు నిలదీశారు. అన్నీ పత్రాలు సక్రమంగా తమ పనులు చేయడానికి కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈక్రమంలో తన వద్ద రూ.2 వేలు లంచం తీసుకున్నాడంటూ ఓ మహిళ రెవెన్యూ ఉద్యోగిని నిలదీసింది. తన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే గల్లా పట్టి వసూలు చేస్తానని హెచ్చరించింది. ఈవ్యవహారమంతా వీడియో రికార్డింగ్ అవుంతోందని గ్రహించిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. (చదవండి : మూడు రోజులు విధుల బహిష్కరణ ) -
చేనేత అధ్యయన కేంద్రంగా పోచంపల్లి
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్. నేడు అంతర్జాయ మార్కెట్లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. అమెజాన్, వీవ్‌మార్ట్ లాంటి బహుళజాతీయ కంపెనీలు ఇక్కత్ వస్త్రాలను ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలు, దేశాల ప్రజలకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మరింత చేరువయ్యాయి. సినిమాలు, సీరియల్స్‌లో హీరో, హీరోయిన్లు, యాంకర్లు, పారిశ్రామిక వేత్తలు పోచంపల్లి చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడుతున్నారు. వెండితెరపై కూడా చేనేత వస్త్రాలు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చేనేతలకు మంచి క్రేజ్ పెరిగింది. అధ్యయన కేంద్రంగా.... ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి విదేశీయులు చేనేత వస్త్ర తయారీ తీరు తెన్నులు తెలుసుకోవడానికి నిత్యం వస్తుంటారు. అంతేకాక ముంబాయి, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కత్తా, బెంగుళూరు రాష్ట్రాలకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), బిజినెస్ స్కూల్ ఆఫ్ ఇండియా, పలు ఫ్యాషన్ టెక్నాలజీ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ స్టడీటూర్‌లో భాగంగా ఇక్కడికి వచ్చి చేనేతపై అధ్యయనం చేస్తుంటారు. అదేవిధంగా చేనేతను పాఠ్యాంశంగా చేర్చడంతో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు అధ్యయన నిమిత్తం ఇక్కడి వస్తుంటారు. అధ్యయన అంశాలు ఇవే... అమెరికా, జర్మనీ దేశాల అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్స్‌ను వాడుతున్నారంటే ఇక్కడి చేనేత కార్మికుల కళా నైపుణ్యం తెలుస్తోంది. ముఖ్యంగా పలు దేశాల ప్రజలు ఇక్కత్ చేనేత వస్త్రాలైన డ్రెస్ మెటీరియల్స్, డోర్ కర్టెన్స్, బెడ్ షీట్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. ముస్లిం దేశాల్లో స్టోల్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ తమ వస్త్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ప్రతిఏటా కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తుంది. అంతేకాక పలువురు ఔత్సాహిక యువకులు ఆన్లైన్ వస్త్ర వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కత్ వస్త్ర విశిష్టతను తెలుసుకోవడానికి వచ్చే విదేశీయులు చేనేత గృహాలు, చేనేత సహకార సంఘం, హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించి అక్కడ నూలు వడికే విధానం, చిటికి కట్టడం, గ్రాఫ్‌పై డిజైన్లు వేయడం, అచ్చు అతకడం, రంగుల అద్దకం, మగ్గాలు, వస్త్రాలు నేసే విధానం, మార్కెటింగ్, చేనేత కళాకారుల జీవన స్థితిగతులు, కూలీ, ఇక్కడి ఆచార, వ్యవహారాలను అధ్యయనం చేస్తుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ చదివిన విద్యార్థులు మాత్రం నూతన డిజైన్లను అధ్యయనం చేస్తుంటారు. పోచంపల్లి బాట పట్టిన 100కు పైగా దేశాలు.. చేనేతతో పాటు భూదానోద్యమానికి పురుడుపోసుకున్న పోచంపల్లిని ఇప్పటివరకు 100కు పైగా దేశాలు, వేలాది మంది విదేశీ ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వీఐపీలు సందర్శించడంతో ప్రపంచపటంలో పోచంపల్లికి తగిన గుర్తింపు వచ్చిం ది. అంతేకాక వివిధ రా ష్ట్రాల మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఫ్యాషన్, సినీరంగ ప్రముఖులు సందర్శించి చేనేతను అధ్యనం చేసి ఇక్కడి వస్త్రాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(నిర్డ్), జాతీయ సూక్ష్మ, లఘు, మధ్య పరిశ్రమల సంస్థ (నిమెస్మీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), గ్రామీణాభివృద్ధి జాతీయ మండలి (ఎన్సీఆర్డీ), కపార్డ్, ఆర్కిటెక్ట్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ), టూరిజం శాఖ, జాతీయ సస్య రక్షణ శిక్షణ సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి), అపార్డ్, గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ముఖ్యంగా అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, ఇటలీ, డెన్మార్క్, ఇండోనేషియా, హాలెండ్, దక్షిణాఫ్రికా, మలేషియా, బోట్స్వానా, టునీషియా, మంగోలియా, ఇథియోఫియా, ఘనా, లావోస్, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, సిరియా ఉజ్భకిస్థాన్, మయన్మార్, నేపాల్, సూడాన్, ఉగాండా, ఐర్లాండ్, కజకిస్థాన్, పెరూ, డర్భన్, నైజీరియా, జింబాంబ్వే, హంగరీ, టాంజానియా, ఐలాండ్, సోలోమన్, ఈక్విడార్, యెమన్, ఇరాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చిలీ, వియత్నాం, లిబియా, స్విడ్జర్లాండ్, జోర్ధాన్, కాంగో, పోర్సుగీస్ మొదలగు దేశాల వారున్నారు. చేనేత కళ గొప్పది.. ఇండియాకు మొదటిసారి వచ్చా. ప్రాచీన చేనేత కళను తెలుసుకోవడానికి పోచంపల్లిని సందర్శించడం గొప్ప అనుభూతినిచ్చి ంది. ఇక్కడి చేనేత కళాకారులు రూపొందిస్తున్న చేనేత వస్త్రాలు చాలా బాగున్నాయి. అయితే ఇంటిల్లిపాది కలిసి పని చేయడం, సమష్టిగా బాధ్యతలు పంచుకోవడం ఎంతో నచ్చింది. నూతన ప్రయోగాలతో చేనేత కళను కాపాడుకోవాలి. – మిల్లిహట్టన్, కెనడా మంచి ఆదరణ ఉంది ప్రస్తుతం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు మంచి ఆదరణ ఉంది. నిత్యం దేశ, విదేశాల నుంచి హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడ వస్త్ర తయారీ ప్రక్రియలను అధ్యయనం చేస్తుంటారు. గత యాభై ఏళ్లుగా చేనేత కళాకారులు అనేక మార్పులు, వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సా«ధిస్తున్నారు. చేనేతను ఉపా«ధి కేంద్రంగా గుర్తించి ప్రోత్సహిస్తే చేనేత పరిశ్రమ నిలదొక్కుకుంటుంది. – భారత లవకుమార్, హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్, పోచంపల్లి -
అసలు సూత్రధారులు ఎవరు?
-
మైనర్లకు ‘ఇంజెక్షన్’ ఇస్తున్నదెవరు?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి నివారణకు రాచకొండ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బలవంతంగా.., బతుకుదెరువు కోసం.. ఇలా పలు రకాల్లో జరుగుతున్న వ్యభిచార వృత్తికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. ఈ వృత్తి కోసం బాలికల అక్రమ రవాణాను ఎంచుకున్నారన్న విషయం బయటపడటంతో పోలీసు యంత్రాంగం కంగుతింది. ప్రస్తుతం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా, యాదగిరిగుట్టలో తరచూ పోలీసులు కార్డన్ సెర్చ్, ఇతరత్రా తనిఖీలు చేస్తున్నా ఇలాంటి అమానుష సంఘటన వెలుగు చూడటం నిఘా సంస్థల వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం పట్టుబడిన వ్యక్తి ద్వారా బాలికల అక్రమ రవాణా విషయం వెలుగు చూసినప్పటికీ దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం వల్లే అది కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న దందాను అరికట్టడానికి ఇప్పటికే పలువురిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. అయినా అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండటం వెనుక గల వైఫల్యాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ డాక్టర్ ఎవరు? పలు ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను యాదగిరిగుట్ట పట్టణానికి తీసుకువస్తున్నారు. వీరిని త్వరగా వ్యభిచార వృత్తిలో దింపడానికోసం నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ముందుగా ఇతరులకు అనుమానం రాకుండా స్థానికంగా బాలికలను చదివించి, వారికి 12 సంవత్సరాలు రాగానే శరీర పెరుగుదలకు ఇంజెక్షన్లు ఇస్తున్న విషయాన్ని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వెల్లడించారు. కాగా, వ్యభిచార గృహాలతో సంబంధం పెట్టుకున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు రూ.20 వేల నుంచి రూ.50 వేలు తీసుకుని 12 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల చిన్న వయసులో ఉన్న పిల్లలు యుక్తవయసు ఉన్న అమ్మాయిల్లా కనిపించడంతో పాటు వారి శరీర ఎదుగుదలలో కూడా భారీ మార్పులు వస్తాయి. అసలు ఈ ఇంజెక్షన్ ఇస్తున్న వైద్యుడు యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇస్తున్నాడా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వైద్యుడిని పట్టుకుని విచారిస్తే ఇప్పటి వరకు ఎంత మందికి ఇంజెక్షన్లు ఇచ్చారనేది తేలుతుందని అంటున్నారు. అసలు సూత్రధారులు ఎవరు? చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నది ఎవరు? అనే అంశం పోలీసులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్న వ్యభిచార నిర్మూలన ఒక్కరోజుతో అంతమయ్యేది కానప్పటికీ నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడంలేదు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి చిన్నారుల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు 2015లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేసు నమోదైంది. శంకర్‌తో పాటు కంసాని యాదగిరి అనే వ్యక్తి పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. యాదగిరి, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తుంటాడు. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు ఈ విషయం మాత్రమే తెలుసు. కానీ శంకర్‌తో పాటు యాదగిరి సైతం చిన్నారుల అక్రమ రవాణాలో ప్రధాన వ్యక్తి అని తాజా విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగా శంకర్ గత ఏడాది క్రితమే మరణించగా ఇటీవలనే పీడీ యాక్టు కింద యాదగిరి జైలులో ఉన్నాడు. చిన్నారుల అక్రమ రవాణా గుట్టు తెలియాలంటే యాదగిరిని విచారించాలని పలువురు అంటున్నారు. అంతేకాకుండా చిన్నారిని ఇబ్బందులకు గురిచేసిన కంసాని కల్యాణికి సంబంధించిన ఓ వ్యక్తికి సైతం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర ఏళ్ల క్రితమే చర్యలు తీసుకుని ఉంటే.. మూడున్నర ఏళ్ల క్రితమే సికింద్రాబాద్‌లో నమోదైన కేసు నేపథ్యంలో అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దారుణాలు జరిగేవి కాదని వివిధ స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. యాదగిరిగుట్ట కేంద్రంగా సాగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యాపారానికి చెక్ పెట్టాలంటే వ్యభిచార గృహాల నిర్వాహకులకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. పోలీసుల అదుపులో ఆర్ఎంపీ డాక్టర్? వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల నిర్వాహకులపై రౌడీషీట్ సాక్షి, యాదాద్రి: బాలికలు త్వరగా యుక్త వయసులోకి రావడానికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇచ్చాడనే అనుమానంతో యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలికలను కొనుగోలు చేసి వ్యభిచార వృత్తిలోకి దించుతున్న నిర్వాహకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11మంది బాలికలను కాపాడిన నేపథ్యంలో వారికి ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యభిచారం నిర్వహిస్తున్నవారితో సంబంధాలు కలిగి ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని నిజానిజాలు తెలుసుకోవడానికి అతడిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎంత మంది పిల్లలకు ఇంజక్షన్లు ఇచ్చారు, ఈ దారుణం వెనుక ఎవరెవరి హస్తం ఉంది, ఏ మేరకు డబ్బులు చేతులు మారుతాయి.. వంటి పలు అంశాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పోలీసులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. లాడ్జీలపై నిఘా తీవ్రతరం యాదగిరిగుట్ట, వడాయిగూడెం, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో గల లాడ్జీలు, రిసార్ట్స్లపై దాడులు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించిన కొన్ని లాడ్జీలను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై ఇప్పటికే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రెండు కంటే ఎక్కువసార్లు కేసులు నమోదైన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇళ్ల మధ్య గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని కూడా గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు -
తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూ ఢిల్లీ: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సేవలు తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. దీంతో నిమ్స్ కోసం ఏర్పాటు చేసిన భవణాల్లోనే ఎయిమ్స్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భవణాలు సిద్దంగా ఉన్నందున వైద్య సేవలు అతిత్వరలోనే ప్రారంభం చేస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. బీబీనగర్‌లో మరో 49 ఎకరాల స్థలంతో పాటు, రోడ్లు, విద్యుత్ వంటి పలు సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పోరాడి సాధించాం.. భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటును పోరాడి సాధించామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు స్థల రూపంలో తొలి అడుగుపడడం సంతోషంగా ఉందని.. ఏడాది లోపు ప్రిలిమినరీ సేవలు ప్రారంభమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ తెలిపారు. కేంద్రానికి ధన్యవాదాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే ఎయిమ్స్ ఏర్పాటు జరగనుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతిష్టాత్మక వైద్య సేవలు రావడానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. -
గాలివాన బీభత్సం
‘యాదాద్రి’ జిల్లాలో భారీగా ఆస్తి నష్టం సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ, ఆత్మకూరు(ఎం), భువనగిరి, ఆలేరు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారు జామున ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి వలిగొండ మండలం రేడ్లరేపాక, సుంకిశాల, ఆత్మకూరు(ఎం) చాడ, కొండాపూర్, కాటేపల్లి, రాయిపల్లి చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది. సుంకిశాల చెరువు నిండి అలుగు పారడంతో రోడ్లపై నీరు వచ్చింది. తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో వలిగొండ మండలం మల్లేపల్లి, వెల్వర్తి మధ్యనగల కోళ్ల ఫారాలు కొన్ని నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. వెల్వర్తిలో పలు నివాస గృహాల పైకప్పులు గాలికి ఎగిరిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆత్మకూరు(ఎం) మండలంలో బిక్కేరు వాగులో నీటి ప్రవాహం మొదలైంది. దమ్మపేటలో వాగులకు పోటెత్తిన వరద. దమ్మపేట(అశ్వారావుపేట): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే మబ్బులు కమ్మేశాయి. దమ్మపేటలో 79.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మండలంలోని మల్లెపూల వాగు, శ్రీరాంపురం పెద్దచెరువుకు వరదనీరు పోటెత్తింది. కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, బూర్గంపాడు, జూలూరుపాడు తదితర ప్రాంతా ల్లోనూ ఓ మోస్తరు వర్షం కురిసింది. పిడుగుపాటుకు రైతు మృతి... భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డికి చెందిన రైతు పెంజర్ల నరేందర్‌రెడ్డి(56) పిడుగుపాటుతో మరణించా డు. శనివారం ఆయన గేదె పాలు తీసేందుకు పొలం వద్దకు వెళ్లగా, ఈ ఘటన జరిగింది.