Bias river
-
13వ రోజు.. 13వ మృతదేహం లభ్యం
హైదరాబాద్‌కు చెందిన సాయిరాజుగా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో శుక్రవారం మరో విద్యార్థి మృతదేహం బయటపడింది. మృతుడిని హైదరాబాద్‌లోని ఏఎస్రావునగర్కు చెందిన ఎం.సాయిరాజుగా గుర్తించారు. బియాస్ నదిలో పెను ప్రమాదం చోటుచేసుకొని శుక్రవారం నాటికి 13 రోజులయ్యాయి. శుక్రవారం ఎప్పట్లాగే ఆర్మీ, నేవీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్తో పాటు రాష్ట్రానికి చెందిన పోలీసు గజ ఈతగాళ్లతో కూడిన ఆరు వందల మంది నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా 11 మంది విద్యార్థులు, ఒక ఫ్యాకల్టీ ఆచూకీ దొరకాల్సి ఉంది. సాయిరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌కు తరలించామని, శనివారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తామని ప్రభుత్వం తరపున సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
బియాస్లో మరో రెండు మృతదేహాలు లభ్యం
మండి : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల్లో బుధవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సంఘటన జరిగి 11 రోజుల తర్వాత పండో రిజర్వాయర్ దగ్గర ఈ మృతదేహాలు బయటపడ్డాయి. గత రాత్రి నుంచి పండో రిజర్వాయర్ వద్ద భారీ వర్షం పడటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బయటపడిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు ఎవరిదన్నది గుర్తించాల్సి ఉంది. కాగా ఇప్పటివరకూ పది మృతదేహాలు లభ్యం అయ్యాయి. విహార యాత్రకు వెళ్లిన వీఎన్నార్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను హిమాచల్ ప్రదేశ్ అధికారులు హైదరాబాద్ పంపనున్నారు. -
బియాస్ లో మరో మృతదేహం వెలికితీత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరో మృతదేహం వెలికితీశారు. బియాస్ నదిలో అలోజీమాతా మందిర్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహం ఎవరిదన్నది కాసేపట్లో గుర్తించనున్నారు. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది ఆదివారం సాయంత్రం బియాస్ నదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తొమ్మది మృతదేహాలను గుర్తించారు. ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలను హైదరాబాద్ తరలించారు. మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.