మోడీ వల్లే విజయం సాధించాం : వసుంధర రాజే
రాజస్థాన్లో బీజేపీ విజయానికి మోడీ ప్రధాన కారణమని వసుంధర రాజే సింధియా పేర్కొన్నారు. ఆదివారం జైపూర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సింధియా మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీ విజయం వెనక మోడీ హస్తం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్బంగా నరేంద్రమోడీకి వసుంధర రాజే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే రాజస్థాన్ లో బీజేపీకి ఇంత పెద్ద విజయం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందని వసుంధర రాజే ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలు ప్రీ ఫైనల్స్ అని సింధియా అభిప్రాయపడ్డారు. రాజస్థాన్లో 137 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో ముందంజలో ఉంది. దాంతో బీజేపీ విజయం దాదాపుగా ఖరారైనట్లే. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు రెండు రాష్ట్రాల్లో బీజేపీ కైవసం చేసుకోవడం, మరో రెండు రాష్ట్రాల్లో గట్టి పోటి ఇచ్చిన సంగతి తెలిసిందే.