Bijinepally
-
పొలం విక్రయంపై రభస.. తట్టుకోలేక యువకుడు
బిజినేపల్లి: భూమి విక్రయానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మిట్యాతండాకు చెందిన రమావత్ చంద్రు (26) వృత్తిరీత్యా డ్రైవర్. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఆటో నడుపుతుండేవాడు. ఈయనకు భార్య లక్ష్మితో పాటు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి తమకున్న రెండెకరాలను అమ్మి తీర్చాలనుకున్నాడు. అయితే వారు అంగీకరించక పోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. సోమవారం ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకటేశ్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు) చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి -
బస్సు ప్రమాదం..15 మందికి గాయాలు
-
అదుపుతప్పిన బస్సు.. 15 మందికి గాయాలు
బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తుండగా ముందు టైరు పేలి రోడ్డు పక్కకు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో 8 మందికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఆదివారం వీఆర్ఓ పరీక్ష కావడంతో పరీక్షకు హాజరయ్యేవారు బస్సులో ఎక్కువగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
వాహనం బోల్తా: 15మందికి గాయాలు
బిజినేపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా) : బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ప్రమాదవశాత్తూ క్రూజర్ వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. లోకేష్, ఐశ్వర్య, సిద్ధార్థ అనే చిన్నారులతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పంక్చర్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. వీళ్లంతా కోడేరు మండలకేంద్రానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.