
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తుండగా ముందు టైరు పేలి రోడ్డు పక్కకు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో 8 మందికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఆదివారం వీఆర్‌ఓ పరీక్ష కావడంతో పరీక్షకు హాజరయ్యేవారు బస్సులో ఎక్కువగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment