వాహనం బోల్తా: 15మందికి గాయాలు
Published Fri, Apr 8 2016 3:18 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
బిజినేపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా) : బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ప్రమాదవశాత్తూ క్రూజర్ వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. లోకేష్, ఐశ్వర్య, సిద్ధార్థ అనే చిన్నారులతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పంక్చర్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. వీళ్లంతా కోడేరు మండలకేంద్రానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement