బైక్ బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం.. అస్సలు ఊహించలేదు!
బెంగళూరు: ఇటీవలి కాలంలో ఆన్లైన్లో వాహనాల బుకింగ్స్‌కు ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. అవసరమేదైనా వాహనాలను బుక్ చేసుంటున్నారు. తాజాగా ఓ కంపెనీకి చెందిన బైక్‌ను బుక్ చేసుకున్న మహిళకు చేదు అనుభవం ఎదురైంది. సదరు బైకర్ ఆమెతో మిస్‌బిహేవ్ చేయడమే కాకుండా వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపించడంతో బాధితురాలు ఖంగుతింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. తనకు జరిగిన ఈ షాకింగ్ అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు తాను ఓ మీటింగ్‌కు హాజరయ్యాక ఇంటికి వెళ్లేందకు ఓ కంపెనీకి చెందిన బైక్‌ను బుక్ చేసుకుంది. అయితే, సదరు రైడర్ యాప్‌లో ఉన్న బైక్ నంబర్‌తో కాకుండా మరో బైక్‌లో తనను పికప్ చేసుకునేందుకు లొకేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఆమెను రిసీవ్ చేసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డుపై ఎవరూ లేని చోట.. ఒక చేతితో బైక్ నడుపుతూ మరో చేతితో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. అతడు అలా చేయడంతో తాను భయాందోళనకు గురైనట్టు ఆవేదన వ్యక్తం చేసింది.
‘During the journey, we reached a remote area with no other vehicles around. Shockingly, the driver began riding with one hand and engaging in inappropriate behavior (Masturbating while riding the bike). Fearing for my safety, I remained silent throughout the ordeal.’
అయితే, బైక్‌ను తన ఇంటి లొకేషన్ వరకు బుక్ చేసుకున్నప్పటికీ బైకర్ మాత్రం అక్కడి వరకు రాకుండా ఇంటికి 200 మీటర్ల దూరంలో తనను వదిలేసినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. సదరు బైకర్ ఆమె ఫోన్ నంబర్ సేవ్ చేసుకుని తనకు మెసేజ్‌లు చేయడం స్టార్ట్ చేశాడు. అతడు.. వాట్సాప్‌లో ఆమెను అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టడంతో నంబర్ బ్లాక్ చేసినట్టు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సదరు వాహనాల బుకింగ్ సంస్థపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
బైకర్ల విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. మీ సంస్థ వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దయచేసి ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణ అనుభవం ప్రయత్నించండి అని హితవు పలికారు. ఈ క్రమంలోనే అతను ఇప్పటికీ తనకు వివిధ నంబర్ల నుండి కాల్ చేస్తూనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Thread 🧵#SexualHarassement
Today, I went for the Manipur Violence protest at Town Hall Bangalore and booked a @rapidobikeapp auto for my way back home. However, multiple auto cancellations led me to opt for a bike instead. pic.twitter.com/bQkw4i7NvO
— Athira Purushothaman (@Aadhi_02) July 21, 2023
ఇక, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఫోన్ ఆధారంగా అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ట్విట్టర వేదికగా వెల్లడించారు.
🚔 🛵💨 Just nabbed a real sicko on wheels! 😱🚫 BCP won't stand for such indecent antics!🙅♀️🙅♂️
A Criminal case is lodged at E’ City PS on a guy who was pretending to be rapido bike rider! 🔒📝 We’re swifter🚓 Keep it clean or face the full force of the law! 💪 #SafeCity 🌆🏙️ pic.twitter.com/X23i95CppP
— C K Baba, IPS (@DCPSEBCP) July 22, 2023