హోదా కోసం టవరెక్కాడు
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ.. ఓ వ్యక్తి టవరెక్కాడు. ఒంగోలు జిల్లా కేంద్రంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు స్థానిక సెల్ టవర్ ఎక్కాడు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు... ప్రత్యేక హోదాపై ప్రభుత్వం ప్రకటన చేయకపోతే.. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా అంని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని కిందకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.