Birth certificates
-
సర్టిఫికెట్స్‌లో కుల, మత ప్రస్తావనపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్’, ‘నో రిలీజియన్’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది. వివరాల ప్రకారం.. తమ కుమారుడికి నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్వరూపతో పాటు మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు. ‘పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛతో పాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఇదే చెబుతోంది. నో క్యాస్ట్.. నో రిలీజియన్ అనే కాలాన్ని అన్ని దరఖాస్తుల్లో (ఆన్‌లైన్‌లోనూ) చేర్చాలని మున్సిపల్ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్ -
ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు..
సాక్షి, హైదరాబాద్: బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిధ్దమైంది. మొత్తం నలుగురు బల్దియా ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. హెల్త్ విభాగం సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. స్టాటిస్టికల్ విభాగంలో ఏఎస్ఏ, డీఎస్ఓ లను సొంత డిపార్ట్ మెంట్లకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ ఆపరేటర్ల నియామకంలో అవకతవకలపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేయాలన్నారు. ఇలాంటివి పునరాృతం కాకుండా చూడాలని కమిషనర్, మిగతా అధికారులకు ఆదేశాలు పంపారు. ఏం జరిగిందంటే..? ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. చదవండి: రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై! -
ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్ అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్ఆర్సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్వేర్ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్ సర్టిఫికెట్లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు . అంతేకాదు.. ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం గత డిసెంబర్లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. -
ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ
సాక్షి, అమరావతి: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. గడిచిన 53 మాసాల్లో 34.87 లక్షల బర్త్ సర్టిఫికెట్లు, 19.86 లక్షల డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. పుట్టిన తర్వాత చట్టబద్ధమైన గుర్తింపు కోసం జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఇందులో శిశువు జన్మించిన తేదీ, సమయం, ప్రాంతం, లింగం తదితర వివరాలుంటాయి. అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడానికి మృతి చెందిన వారికి మరణ ధ్రువీకరణ పత్రం కూడా తప్పనిసరి. అందుకే రాష్ట్రంలో జనన మరణ ధ్రువీకరణ విధిగా చేయాలని ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో సైతం జనన మరణాల ధ్రువీకరణకు సంబంధించిన పర్యవేక్షణ ఉంటోంది. అందుకే కరోనా లాంటి విపత్తుల సమయంలోనూ రికార్డు స్థాయిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రజలు తీసుకున్నారు. కేవలం 2020లోనే 7,14,017 మంది జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోగా, 2021 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ 4,39,402 మంది పుట్టినట్టు జనన ధ్రువీకరణ పత్రాలను బట్టి తేలింది. పుట్టిన 7 రోజుల్లోనే బర్త్ సర్టిఫికెట్, మృతి చెందిన మూడు రోజుల్లో డెత్ సర్టిఫికెట్ జారీ అవుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో శిశు ఆధార్ ప్రాజెక్టు అమలు కావాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ రోజుల్లో ప్రతీ ప్రభుత్వ పథకానికి, అవసరానికి ఆధారం తప్పనిసరిగా మారింది. అందుకే చిన్నారికి 1 రోజు వయస్సు ఉన్నా కూడా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యుఐడీఏఐ తెలిపింది. ఇందు కోసం శిశువు జనన ధ్రువీకరణ పత్రం అవసరం. అందుకే అటు బర్త్ సర్టిఫికెట్, ఇటు ఆధార్ వెనువెంటనే వచ్చేలా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు. చిన్నారుల నుంచి ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ తీసుకోకుండా మొదట ఆధార్ జారీ చేస్తారు. ఆ తర్వాత పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఆ బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అలాగే నెలవారీ హెచ్ఎంఐఎస్ (హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం), ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ ఛైల్డ్ హెల్త్) పోర్టల్‌కు అనుసంధానించే వారి పేర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు ఆదేశించారు. జీవనశైలి జబ్బుల వివరాలు కూడా హెచ్ఎంఐఎస్ పోర్టల్‌కు అనుసంధానించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో.. గత ఏడాది అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకూ అత్యధికంగా కర్నూలు జిల్లాలో 90,450 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 72,775 మందికి జారీచేసి రెండో స్థానంలో నిలిచింది. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. 2020లో ఆ జిల్లాలో 55,656 పత్రాలు జారీచేశారు. 48,965 డెత్ సర్టిఫికెట్లు జారీచేసి గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 20,509 మాత్రమే డెత్ సర్టిఫికెట్లు జారీచేశారు. 2021 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 30 వరకూ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 50,116 బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 48,742 డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇవి పక్కాగా నమోదు అయినవి మాత్రమే అని, కొన్ని నమోదు కావాల్సినవి కూడా ఉంటాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. -
టెలిగ్రామ్ ద్వారా మోసాలు.. అమ్మకానికి జనన, మరణ ధ్రువపత్రాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 50 ఏళ్ల క్రితం మరణించగా సంబంధిత వ్యక్తి వారసులు ఆయన మరణ ధ్రువీకరణ పత్రం కోసం రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాల్లో సంప్రదించగా అధికారులు రికార్డుల్లో లేదని తెలిపారు. దీంతో వారసులు ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడి సహాయంతో రూ.1,000 చెల్లించి విజయనగరం జిల్లాలోని ఓ పీహెచ్సీ రికార్డుల్లో నమోదైనట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. అనంతపురం జిల్లాకే చెందిన ఓ వృద్ధుడు ఆధార్ కార్డులో వయసు మార్పు కోసం ఇదే తరహాలో రూ.900 చెల్లించి జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు ఓ అంతర్రాష్ట్ర ముఠా ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో యథేచ్ఛగా కొనసాగిస్తోంది. 1990 తర్వాత జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. వీటిని మంజూరు చేసే అధికారం గ్రామ, మండల, పురపాలక స్థాయి అధికారులకు ఉంది. జనన, మరణాల వివరాలు రికార్డుల్లో లేకపోతే తగిన ధ్రువీకరణ పత్రాలను అందించి మీసేవ లేదా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్డీవో వాటిని రికార్డుల్లో నమోదు చేసి.. ఆయా పత్రాల మంజూరుకు అనుమతి ఇస్తారు. కానీ ఇవన్నీ లేకపోయినా కేవలం రూ.600తో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందిస్తోంది.. అంతర్రాష్ట్ర ముఠా. ఈ ముఠా ఆగడాలను పరిశీలిస్తే సాంకేతికంగా ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తుల నేతృత్వంలోనే ఈ దందా భారీ ఎత్తున సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ముఠా మోసాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. మీసేవా, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకుల నంబర్లు సేకరించి.. ఆన్లైన్ ద్వారా సరికొత్త దందాకు తెరలేపిన అంతర్రాష్ట్ర ముఠా ముందుగా ప్రజలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం సంప్రదించే ఇంటర్నెట్, మీసేవా సెంటర్లపై కన్నేస్తోంది. వాటి నిర్వాహకుల నంబర్లను సేకరించి.. వారిని టెలిగ్రామ్ యాప్ ద్వారా తమ గ్రూపు సభ్యులుగా చేర్చుకుంటోంది. గ్రూప్ అడ్మిన్‌కు వివరాలు పంపి.. ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లిస్తే చాలు.. జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని మంజూరు చేయడం తీవ్ర నేరం. విద్రోహశక్తులు, సైబర్ నేరగాళ్లకు ఇవి ఊతంగా మారే ప్రమాదం లేకపోలేదు. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హత పొందడం, బీమా సంస్థల నుంచి సొమ్మును పొందటం, ఉద్యోగాల్లో పదోన్నతి పొందడం, తదితర చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే అవకాశమూ ఉంది. ఫోన్‌పేలో రూ.600 చెల్లిస్తే చాలు.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాల్సినవారు టెలిగ్రామ్‌లో ‘సర్టిఫికెట్ సర్వీస్ చార్జబుల్’ అనే గ్రూపు నిర్వాహకుడికి వివరాలను పంపి రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. రితేష్‌కుమార్ అనే వ్యక్తి ఫోన్‌పే నంబర్ 9939844009కు నగదు పంపి.. ఆ స్క్రీన్ షాట్‌ను పంపితే చాలు.. క్షణాల్లో సంబంధిత రాష్ట్రంలోని ఏదైనా ఓ పీహెచ్సీలో నమోదు చేసిన పత్రాలను ఆన్లైన్లోనే సదరు వ్యక్తులకు పంపుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కొద్దు టెలిగ్రామ్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్న ముఠా ఉచ్చులో ప్రజలెవరూ చిక్కుకోవద్దు. ముఖ్యంగా ఇంటర్నెట్, మీసేవా నిర్వాహకులు ఈ ముఠా సభ్యుల మాటలు నమ్మి ప్రజలకు నకిలీ ధ్రువీకరణ పత్రాలను అందించవద్దు. ఇలాంటివాటిని ఉపయోగించి ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందినా, బీమా సంస్థలను మోసం చేసినా, ఉద్యోగోన్నతి కోసం వీటిని ఉపయోగించినా నేరంగా పరిగణిస్తాం. –డాక్టర్ కె.ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం గతంలో ఆధార్ కార్డుల్లో వయసు మార్పు ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజల జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఈ ముఠా అందజేస్తున్నట్లు సమాచారం. తాము అందిస్తున్న ధ్రువీకరణ పత్రాల్లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా అన్ని వివరాలు పక్కాగా ఉంటాయని ఈ ముఠా టెలిగ్రామ్ గ్రూపులలో సందేశాలు పంపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి జనన ధ్రువీకరణ పత్రం కావాలని టెలిగ్రామ్ గ్రూపులో సదరు ముఠా సభ్యుడితో చాటింగ్ చేయగా.. వెంటనే అనంతపురం జిల్లా రాయదుర్గం పీహెచ్సీలో డేటా అందుబాటులో ఉందని సంక్షిప్త సందేశం పంపించాడు. హిందూపురంలోనూ ఇదేవిధంగా పత్రాలను అందజేస్తామన్నాడు. అలాగే విశాఖపట్నం చెందిన ఓ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించగా.. విశాఖపట్నం ఆర్సీడీ హాస్పిటల్లో అందజేస్తామని సమాధానం ఇచ్చాడు. ఇలా అడిగిన వెంటనే ఫోన్‌పే ద్వారా డబ్బులు జమ చేయించుకుని నిబంధనలకు విరుద్ధంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. గతంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి ఆధార్ కార్డుల్లో వయసును విచ్చలవిడిగా మార్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఘటనలు విదితమే. అప్పట్లో ఆధార్‌లో వయసు మార్పునకు పాన్‌కార్డులో వయసు మార్చారు. కాగా ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్లో లభించే జనన ధ్రువీకరణ పత్రాలను ఇందుకు వినియోగిస్తుండటం గమనార్హం. -
సార్.. మా ఊరే లేదంటున్నారు
జి.మాడుగుల: తమకు ఆధార్ కార్డులు ఇప్పించాలని ఆదివాసీ గిరిజన బాలబాలికలు ఆదివారం వినూత్నంగా చేతులు జోడించి వేడుకున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల–రావికమతం మండలాల సరిహద్దులో నేరేడుబంద అనే కుగ్రామం ఉంది. ఇక్కడ పాతికలోపు కుటుంబాలు ఉన్నాయి. మారుమూలన ఉండే ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో.. ఇక్కడ జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ కాలేదు. వీరు ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దనే జన్మించడం, ఆరోగ్య సిబ్బంది రికార్డుల్లో కూడా వీరి గురించి నమోదు కాకపోవడంతో వీరికి బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఆధార్ కార్డులు జారీ చేయడం సమస్యగా మారింది. మండలంలో గడుతూరు పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా ఆధార్ కార్డులు లేవు. దీంతో విద్యతోపాటు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం.. జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో చర్యలు చేపట్టి మాకు ఆధార్ కార్డులు ఇప్పించాలి’ అని గిరిజన పిల్లలు వేడుకున్నారు. -
కుల,మత వివరాల్లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: జన ధ్రువీకరణపత్రంలో కుల,మత వివరాలు లేకుండా జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం నాచారం గ్రామానికి చెందిన జర్నలిస్టు సందేపు స్వరూప, ఎ.డేవిడ్‌లు దాఖలు చేసిన పిల్లో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జనన, మరణ ధ్రువీకరణ అధికారి, కొత్తకోట మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు కుల,మతాలకు అతీతంగా ఇష్టపడి వివాహం చేసుకున్నారని, వారి కుమారుడు ఇవాన్ రూడే జనన పత్రంలో కులమత వివరాలు లేకుండా జారీ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు ఎస్.వెంకన్న, డి.సురేశ్‌కుమార్‌లు వాదించారు. గతేడాది మార్చి 23న వారికి కుమారుడు పుడితే ఇప్పటి వరకూ జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వలేదన్నారు. తమిళనాడుకు చెందిన న్యాయవాది ఎం.స్నేహ గతంలో ఇదే తరహాలో చేసిన ప్రయత్నాలు ఫలించాయని, స్థానిక కలెక్టర్ ఆమెకు కుల,మత వివరాలు లేకుండా «సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన డి.వి. రామకృష్ణారావు, కృపాళి దంపతులు తమ కుమారుడిని స్కూల్లో చేర్చినప్పుడు ఏమతమో దరఖాస్తులో రాయాలని స్కూల్ యాజమాన్యం పట్టుబట్టిందని, చివరికి హైకోర్టు మందలించిన తర్వాత వారి కుమారుడికి స్కూల్లో సీటు లభించిందని న్యాయవాదులు తెలిపారు. కులం, మతం పట్ల నమ్మకం లేని వారి విశ్వాసాలను కూడా గౌరవించాలన్నారు. -
జనన నమోదు ఆలస్యమైతే చిక్కులే
సాక్షి, అమరావతి: తెలిసో, తెలియకో సకాలంలో జనన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోనివారు అష్టకష్టాలు పడుతున్నారు. ఆలస్యంగా జనన ధ్రువీకరణ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను ఎక్కువగా అధికారులు తిరస్కరిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఆలస్యంగా జనన నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల్లో 19,230 అర్జీలను అధికారులు తిరస్కరించారు. గత ఏడాది జులై 15 నుంచి ఈనెల 15వ తేదీ వరకూ మొత్తం 90,929 అర్జీలు రాగా తిరస్కరించినవి కాకుండా మరో 14,163 అర్జీలను అధికారులు పెండింగులో పెట్టారు. అర్జీలు తిరస్కరణకు గురైన వారు జనన ధ్రువీకరణ పత్రాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఈ కష్టాలు పడకుండా ఉండాలంటే సకాలంలో జననాల నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బాబునైనా, పాపనైనా పాఠశాలలో చేర్పించాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అంతేకాదు జీవితంలో ఎక్కడ ఏ పనికావాలన్నా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కావాల్సిందే. ఇంతప్రాధాన్యం ఉన్నందునే ప్రసవం జరగ్గానే పిల్లల పుట్టిన తేదీని నమోదు చేసి పంచాయతీలు/మున్సిపాలిటీలు/ నగరపాలక సంస్థలకు (ఆస్పత్రి ఏ పరిధిలో ఉంటే అక్కడికి) పంపించి రికార్డు చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఇళ్లలో పుట్టిన పిల్లలకు మాత్రం ఈ సదుపాయంలేదు. ఆస్పత్రుల్లో కాకుండా ఇళ్లలో పిల్లలు పుట్టిన వెంటనే వారు ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి జనన ధ్రువీకరణ పత్రం పొందాలి. నమోదు ఎలాగంటే... ఒకవేళ పిల్లలు పుట్టిన ఏడాదిలోగా జనన నమోదు చేయించుకోనిపక్షంలో ఈ విషయం ధ్రువీకరణ కోసం నాన్ అవైలబులిటీ సర్టిఫికేట్ కోసం మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేసుకున్న దరఖాస్తులను వారు పరిశీలించి ఎక్కడా జనన నమోదు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏడాది తర్వాత జనన నమోదు కావాలంటే మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా మీసేవ ద్వారా వచ్చిన అర్జీలను తహసీల్దార్లు పరిశీలించి వారి జననాలు నమోదు కాలేదని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇలా నిర్ధారించిన తర్వాత వారికి డివిజనల్ రెవెన్యూ అధికారి జనన నమోదు ధ్రువీకరణకు ఆమోదిస్తారు. ఇలా నమోదైన తర్వాత ఎప్పుడైనా మీసేవ నుంచి జనన ధ్రువీకరణ పత్రం పొందవచ్చు. ఏడాది తర్వాత జనన నమోదు కోసం మీసేవలో దరఖాస్తు చేసిన వారు నగర నివాసులైతే నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి పుట్టిన తేదీ నమోదు కాలేదని (నాన్ అవైలబులిటీ) సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకోవడం చాలా కష్టమని, అధికారులు ఎన్ని సార్లు తిరిగినా ఎందుకు నమోదు చేయించుకోలేదంటూ తిప్పుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. -
జననాల నమోదు ‘డబుల్’
జననాల నమోదు శాతం భారీగా పెరిగింది. పదేళ్ల కింద 40.3 శాతం ఉండగా.. ప్రస్తుతం 82.9 శాతానికి పెరిగింది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో జనన ధ్రువీకరణ కీలకంగా మారింది. ఆధార్ కార్డు వంటి వివిధ కార్డుల జారీలోనూ జనన ధ్రువీకరణ తప్పనిసరైంది. దీంతో ప్రజల్లో జనన నమోదుపై శ్రద్ధ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జననాల నమోదు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ పట్టణాల్లోనే మెరుగ్గా.. జననాల నమోదులో పట్టణ ప్రాంతాల్లోనే పరిస్థితిమెరుగ్గా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో జనన ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక వ్యవస్థ ఉండటంతో నమోదుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసిన పక్షం రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 92.9 శాతం జననాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువగా 62.6 శాతమే నమోదయ్యాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో నమోదు ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంది. గ్రామాల్లో అయోమయం.. గ్రామీణ ప్రాంతాల్లో జనన ధ్రువీకరణ పత్రాల పరిస్థితి గందరగోళంగా మారింది. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే వీలుంది. అయితే ఆ పంచాయతీ కార్యకలాపాలన్నీ ఆన్లైన్ ద్వారా పనిచేస్తే కేంద్రం రూపొందించిన జనన, మరణ నమోదు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా జారీ చేయాలి. కానీ రాష్ట్రంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు ఆన్లైన్ ద్వారా కాకుండా మాన్యువల్‌గానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.దీంతో పంచాయతీల్లో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మీ–సేవ, ఈ–సేవ కేంద్రాల్లో జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. వాటిని స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించి ‘రికార్డ్ నాట్ ఫౌండ్’అని పేర్కొంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. కనిష్టంగా నెల రోజుల తర్వాత ఈ పత్రాన్ని జారీ చేసినప్పటికీ.. జనన ధ్రువీకరణ పత్రం ఎక్కడ పొందాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. -
పోర్టల్ ద్వారా జనన, మరణ పత్రాల మంజూరు
నెల్లూరు సిటీ: సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనణ, మరణ ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయనున్నట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ప్రైవేట్ హాస్పిటళ్ల డాక్టర్లు, సిబ్బందికి సీఆర్ఎస్ పోర్టల్ వినియోగంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, సీఆర్ఎస్ పోర్టల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటళ్ల వారు తనకు పత్రాలను పంపిస్తే పరిశీలించి మంజూరు చేస్తానన్నారు. 21 రోజుల్లో సంబంధిత పత్రాలను తనకు మెయిల్ చేయాలని, లేని పక్షంలో లేట్ ఆర్డర్ అవుతుందని, కార్పొరేషన్‌కు వచ్చి పత్రాలను ఇవ్వాలని సూచించారు. హాస్పిటళ్ల డాక్టర్లు, సిబ్బందికి యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఇచ్చారు. ఐడీలు, పాస్‌వర్డ్‌లను బయట వ్యక్తులకు తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తప్పుడు పత్రాలను నమోదు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
‘బంగారు తల్లి’కి ఎన్ని కష్టాలో!
పరిగి, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం అమలులో నీరుగారుతోంది. ఆడపిల్లను భారమనుకోకండి... మహాలక్ష్మిలా భావిం చండి... చదువు చెప్పించండి... ప్రోత్సహిస్తాం... ఆర్థిక సాయం అందజేస్తామన్న ప్రభుత్వం... పథకం గురించి పేదలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతోంది. తెల్ల రేషన్కార్డులున్న కుటుంబాల బాలికల సంక్షేమానికి ఉద్దేశించిన పథకం.. ప్రారంభించి తొమ్మిది నెలలవుతున్నా బాలారిష్టాలు దాటడం లేదు. బంగారు తల్లుల తల్లిదండ్రులకు భరోసానివ్వటం లేదు. మొదట్లో ఆర్భాటాలు చేసిన ప్రభుత్వం బంగారు తల్లి పథకం గురించి గ్రామీణ పేదలకు అవగాహన కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. పథకం ప్రారంభమైన గతేడాది మే నుంచి ఇప్పటివరకూ జన్మించిన బాలికలకు, పథకం కోసం ఐకేపీలో నమోదవుతున్న సంఖ్యకు ఏ మాత్రం పొంతన కుదరటం లేదు. గణాంకాలను బట్టి చూస్తే జిల్లాలో 50 శాతానికిపైగా ప్రజలకు బంగారు తల్లి పథకం గురించే తెలియదనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు పథకం గురించి కొందరికి తెలిసినా అధికారులు సహకరించకపోవడంతో తిప్పలు పడుతున్నారు. బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లిపేరిట బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి పంచాయతీ అధికారులు, ఖాతాలు తెరవడానికి బ్యాంకర్లు రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో పలువురు బంగారుతల్లి పథకం వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రజల్లో అవగాహనా లోపం... జిల్లాలో ‘బంగారుతల్లి’ గురించి సగానికిపైగా ప్రజలకు అవగాహన లేదనే విషయాన్ని పథకం ప్రారంభమైన నాటినుంచి నమోదైన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో పథకం ప్రారంభమైన గతేడాది మే నుంచి ఇప్పటివరకు 13,362మంది బాలికలు జన్మించి నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 1,232మంది బాలి కలు మూడో కాన్పులో జన్మించడం, గులాబీ రేషన్‌కార్డుల కుటుంబాలు కావడంతో పథకానికి అర్హత పొందలేదు. మిగిలిన 12,130 మంది బాలి కలు బంగారు తల్లి పథకానికి అర్హులైనప్పటికీ ఇప్పటివరకు 4,844మంది బాలికల కోసమే ఐకేపీ కార్యాలయాల్లో తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,149మందికి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి మొదటి విడత డబ్బులు అందగా, మిగతా 1695 దరఖాస్తులు ఆయా స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాలో ఇంకా 7,286 మంది బాలికలకు బంగారు తల్లి పథకం అందాల్సి ఉంది. పరిగి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పథకం రిజిస్ట్రేషన్లలో కొన్ని మండలాలు చాలా వెనుకబడ్డాయి. మే నుంచి ఇప్పటివరకు బంట్వారంలో 34 మంది బాలికలకు, బషీరాబాద్‌లో 36మందికి మాత్రమే పథకం నుంచి మొదటి దఫా ఆర్థిక సాయం అందింది. పరిగి, మర్పల్లి, చేవెళ్ల మండలాల్లో అత్యధికంగా 150కి పైగా బాలికలకు తొలివిడత ఆర్థిక ప్రయోజనం అందింది. పథకంతో ప్రయోజనాలివీ... తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో మొదటి, రెండో కాన్పులో జన్మించిన ఆడపిల్లలకు పథకం వర్తిస్తుంది. ఒకేసారి కవలలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే. బాలిక జన్మించింది మొదలు డిగ్రీ పూర్తి చేసుకునే వరకు అంటే 21ఏళ్లు నిండే వరకు మొత్తం తొమ్మిది దఫాలుగా రూ.2.15లక్షలను ప్రభుత్వం అందజేస్తుంది. కచ్చితంగా డిగ్రీ పూర్తి చేస్తేనే ఈ మొత్తం అందజేయాలనే నిబంధన ఉంది. మధ్యలో చదువు ఆపేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా తగ్గుతాయి.