పుట్టినూరు కన్నతల్లితో సమానం
సూర్యాపేట
పుట్టినూరు కన్నతల్లితో సమానమని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పాలకూరి నారాయణగౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని త్రివేణి ఫంక్షన్హాల్లో నూతనకల్ మండలం పోలుమళ్ల గ్రామానికి చెందిన ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదరికంలో పుట్టి అనేక దుర్భరపరిస్థితులను అనుభవించి ఉన్నత స్థానాల్లోకి వెళ్లినప్పటికీ నెలకొకసారైనా స్వగ్రామాన్ని సందర్శించకుండా ఉండలేనన్నారు. గ్రామానికి చెందిన ఎంతోమంది ఉద్యోగులు తనకు ఆదర్శప్రాయమన్నారు. తనతో అయ్యే ఎలాంటి సహాయసహకారాలైనా గ్రామస్తులకు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలోని ఎంతోమంది పేద విద్యార్థులకు మనమంతా ఆదర్శంగా నిలవాలని తోటి ఉద్యోగులకు సూచించారు. గ్రామానికి చెందిన పగడాల వెంకటనారాయణ, కర్నాటి వెంకటేశ్వర్లును కూడా ఘనంగా సన్మానించారు. ఇటీవల ఐఏఎస్ ర్యాంకు సాధించిన చామకూరి శ్రీధర్ ఫోన్లో తన సందేశాన్ని అందజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గ్రామానికి చెందిన రేసు శ్రీనివాస్ వ్యవహరించగా గ్రామ శ్రేయోభిలాషులు మెంచు కనకమల్లు, గ్రామానికి చెందిన హసనబాద రాజేష్, డాక్టర్ ఎస్.కృష్ణ, సీహెచ్.శ్రీనివాస్, రాణి, డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ చంద్రయ్య, వైఎస్ ఎంపీపీ లక్ష్మణ్, సర్పంచ్ఘంట నాగార్జున, 1వ వార్డు కౌన్సిలర్ వర్ధెల్లి శ్రీహరి, తాళ్లపల్లి యాదగిరి, పులుసు సాయిబాబా, పులుసు వెంకటనారాయణ, రేసు మల్లేష్, కాంపాటి రాధాకృష్ణ, బెల్లంకొండ రాంమూర్తి, నామాల సోమయ్య, రేసు రాములు పాల్గొన్నారు.