biswajit
-
Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
బన్గావ్. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్‌సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పారీ్టల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దాంతో బీజేపీ, తృణమూల్ రెండూ మథువా సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో ఉన్నారు...బన్గావ్ లోక్‌సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో హిందూ శరణార్థులు భారీగా బన్గావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు మథువాలే. బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నేపథ్యంలో వీరు సహజంగానే బీజేపీకి మద్దతిస్తున్నారు. బన్గావ్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ బన్గావ్ నుంచి బెంగాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారి ఓట్లు అత్యధికంగా బీజేపీకే పడ్డాయి. అలా ఇక్కడ తొలిసారి బీజేపీ విజయం సాధించింది. శంతను లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బన్‌గావ్‌లో సీఏఏ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఎన్నికల ముందు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. అయితే ఆన్లైన్ దరఖాస్తుల్లో బంగ్లాదేశ్‌లో ఉన్నప్పటి చిరునామా, నివాస పత్రాల వివరాలను చాలామంది సమర్పించలేదు. ఇది సమస్యలకు దారి తీయడంపై ఇక్కడి మథువాలు అసంతృప్తితో ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: టీఎంసీ సీఏఏను తృణమూల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా అభివరి్ణస్తోంది. మథువాలు ఇప్పటికే భారతీయులని, వారికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నాయని తృణమూల్ అధినేత్రి మమత అంటున్నారు. ‘‘ఈ దేశ పౌరులు కాకుంటే ఇన్నేళ్లు వారు ఓటెలా వేశారు? ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు, బెంగాల్ అసెంబ్లీకి ఎలా వెళ్లారు?’’ అని ప్రశి్నస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బన్‌గావ్‌లో ఘోర పరాజయం తర్వాత గతేడాది పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ దుమ్ము రేపింది. బోరో కుటుంబానిదే ఆధిపత్యం... బన్గావ్ రాజకీయాలను బోరో మా (బీనాపాణి దేవి) కుటుంబమే శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్‌కతాలోని బల్లిగంజ్‌లో స్థిరపడ్డారు. ప్రమథ్ నామశూద్ర (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. తమలా వలస వచి్చన వారికి ఆశ్రయం కోసం స్థానిక ఠాకూర్నగర్లో భూమి కొనుగోలు చేశారు. ‘ఠాకూర్బరీ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీస్’ పేరుతో కొన్న ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యరి్థగా హన్స్‌ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థి శంతను ఆయన రెండో కుమారుడే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఈస్టర్న్ నేవీ కమాండ్ చీఫ్
-
ప్రతిష్టాత్మక విన్యాసాలకు వేదికగా.. విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కానుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా వెల్లడించారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన నేవల్ బేస్ ఐఎన్ఎస్ సర్కార్‌లోని పరేడ్ గ్రౌండ్లో 73వ గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ గుప్తా.. గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ నౌకలు, సబ్ మెరైన్లు, ఇతర నౌకాదళ సిబ్బందితో కూడిన ప్లటూన్లు నిర్వహించిన పరేడ్‌ను ఆయన సమీక్షించారు. అనంతరం ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకూ మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన దేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక నౌకాదళ విన్యాసాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కశ్మీర్లో టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించిన లీడింగ్ సీమాన్ నవీన్‌కుమార్‌కు, 29 ఏళ్ల పాటు నేవీలో విశిష్ట సేవలందించిన కమాండర్ రాహుల్‌విలాస్ గోఖలేకు నవ్‌సేనా మెడల్‌ను ఈఎన్సీ చీఫ్ అందించారు. టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను రిటైర్డ్ లెఫ్టినెంట్ సీడీఆర్ తుషార్ బహ్ల్‌కు లెఫ్టినెంట్ వీకే జైన్ మెమోరియల్ అవార్డు, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్‌లో ఫ్లైట్ సేఫ్టీని మెరుగుపరిచిన హరనంద్‌కు కెప్టెన్ రవిధీర్ గోల్డ్‌మెడల్‌ను బహూకరించారు. అలాగే తూర్పు నౌకాదళ పరిధిలో 2020కి గాను అత్యుత్తమ సేవలందించిన నేవల్ డాక్‌యార్డు, ఐఎన్ఎస్ జలశ్వా యుద్ధ నౌకల బృందానికి యూనిట్ సైటేషన్ అవార్డు ప్రదానం చేశారు. -
బెంగాల్లో బీజేపీకి మరో భారీ షాక్!
-
ఐ డోంట్ కేర్..!
న్యూఢిల్లీ: సహాయ పాత్రలతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఓ సమయంలో అగ్రహీరోలతో సమానమైన ప్రేక్షకాదరణను పొందారు. ఆశా పరేఖ్, మాలా సిన్హా, వహీదా రెహ్మాన్ వంటి అందాల తారల సరసన నటించి, బెంగాలీ అభిమానులకే కాకుండా బాలీవుడ్ అభిమానులనూ ఉర్రూతలూగించారు. లేటు వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి, దేశ రాజధానికి గుండెకాయగా చెప్పుకునే న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాను గెలుస్తానన్న ఆత్మవిశ్వాసం తనకుందని, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అంతకుమించి ప్రోత్సాహాన్ని తనకు అందిస్తోందన్నారు. ప్రత్యర్థుల పేర్లు, వారి చరిత్రలు చూసి భయపడి వెనకడుగు వేసే వ్యక్తిత్వం తనది కాదన్నారు. వారెవరనే విషయాన్ని తాను అసలు పట్టించుకోనని చెప్పారు. న్యూఢిల్లీ నియోజవర్గంలో తన విజయావకాశాల గురించి, తాను చేస్తున్న ప్రచారం గురించి ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘క్యారెక్టర్ ఆర్టిస్టుగా బెంగాలీ చిత్రంతో సినిమాల్లోకి ప్రవేశించాను. ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎదుగుతూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. అగ్రహీరోల సరసన స్థానం సంపాదించుకున్నాను. సినీ పరిశ్రమలో పెద్దపెద్దవాళ్లున్నారని ఎప్పుడూ బెదరలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాను. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. అప్పటి నుంచే ప్రత్యర్థుల గురించి ఆలోచించడం మానేశాను. లేటు వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టావని కొందరంటున్నారు... వయసు ప్రభావం రాజకీయాల్లో జయాపజయాలపై ఉండదనేది నా అభిప్రాయం. నిజానికి వయసు అనుభవాన్నిస్తుంది. ఆ అనుభవంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. మిగతావారితో పోలిస్తే నేనే అత్యంత అనుభవమున్న వ్యక్తిని. ఇది నాకు అనుకూలాంశం. యువకులు ఆవేశపడతారు.. ఆందోళనకు దిగుతారు. కానీ వయసు మీదపడినవారు ఆలోచనతో ముందుకెళ్తారు. ప్రజలకు సేవ చేయడానికి అవసరమైనది కేవలం మంచి చేయాలన్న ఆలోచన మాత్రమే. అది నాకుంది. మూడో ఇన్నింగ్.. బెంగాలీ చిత్రసీమలోకి అడుగుపెట్టడం తొలి ఇన్నింగ్ అయితే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం రెండో ఇన్నింగ్. ఇక తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి జీవితంలో మూడో ఇన్నింగ్‌ను ప్రారంభించాను. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చాలా రోజుల నుంచే ఉంది. అయితే ఇదే సరైన సమయమనే అభిప్రాయంతో ఇప్పుడు అడుగుపెట్టాను. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తాను. ఇక గెలుపోటములన్నవి ఇప్పుడే ఎవరూ నిర్ణయించలేని విషయం. ఎన్నికలు టీ20 మ్యాచ్‌లాంటిది. చివరి నిమిషం వరకు ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో చెప్పడం కష్టం. నా గెలుపుకోసం నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. పార్టీ నుంచి కూడా అవసరమైనంత సహకారం అందుతోంది. ఇక నా ప్రత్యర్థుల విషయానకి వస్తే ఎవరు బలవంతులు? ఎవరు బలహీనులు? అనే విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. రాజకీయాల్లో బలవంతులు, బలహీనులు ఉండరనేది నా అభిప్రాయం. ‘మా, మతి, మానుష్’(కన్నతల్లి, కన్నభూమి, మానవత్వం) నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తున్నాం. ఇదే నినాదంతో 2009 ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ భారీ విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్ జరగక మానద’న్నారు. బెంగాలీల జనాభా ఎక్కువే... ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసేముందు మరో ఆలోచన ఏదీ లేకుండా బిశ్వజీత్ పేరును ఎంపిక చేశారని మమతా బెనర్జీ చెప్పడం వెనుక అనేక వ్యూహాలు దాగి ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బెంగాలీల జనాభా ఎక్కువగానే ఉంది. ఇక్కడి చిత్తరంజన్ పార్కు ప్రాంతాన్ని మినీ బెంగాల్‌గా పిలుస్తారు. దీంతోపాటు చటర్జీ అమ్ముల పొదిలో ‘బాలీవుడ్ హీరో ’ అనే మరో అస్త్రం ఉండనే ఉంది. దీంతోపాటు అన్నా హజారే వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తలు దీదీ(మమతా బెనర్జీ)కి తమ మద్దతును ప్రకటించారు. ఇది కూడా న్యూఢిల్లీ నియోజకవర్గంలో చటర్జీకి కలిసిరావొచ్చంటున్నారు.